కడప

నేటి నుంచి మీ సేవల సమ్మె..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప:సులభంగా, వేగంగా అంటూ మీ సేవ ద్వారా ప్రజలకు వివిధ సేవలను అందిస్తున్న మీసేవ నిర్వాహకులు గురువారం నుంచి సమ్మె సైరన్‌ను మోగిస్తున్నారు. ముఖ్యంగా వివిధ డిమాండ్ల సాధనకై నిరవధిక బంద్‌కు పిలుపునిచ్చారు. జిల్లాలోని మీ సేవ నిర్వాహకులు రాష్టమ్రీసేవ ఆపరేటర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు ఈ బంద్‌కు మద్దతు తెలిపారు. మొత్తం ఏపీ ఆన్‌లైన్, కార్వి, సిఎంఎస్ తదితర సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్న మీ సేవలు మూతపడనున్నాయి. ప్రభుత్వానికి గత సంవత్సరం నివేదికలు అందించినా స్పందించకపోవడంతో సమ్మె కొనసాగిస్తున్నట్లు నిర్వాహకుల అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. ముఖ్యంగా మీ సేవ కేంద్రాల నిర్వహణకు, పంచాయతీ, మున్సిపాల్టీల్లో వసతి సదుపాయాలు కల్పించాలన్నారు. అలాగే ప్రతి మీ సేవ నిర్వహణకు కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలన్నారు. ప్రజలకు అందించే ధృవీకరణ పత్రాలైన స్టేషనరీ ఖర్చులుప్రభుత్వమే భరించాలన్నారు. అన్ని ప్రభుత్వ సేవలను మీసేవ కేంద్రాల ద్వారా అందించాలన్నారు. నిర్వాహకులందరికీ ఆరోగ్యబీమా, ప్రమాద బీమాను అందించాలని ప్రధాన డిమాండ్లతో ఈ సమ్మెకు దిగనున్నారు. ఇందులో భాగంగానే బుధవారం సాయంత్రం నుంచే మీసేవ కేంద్రాలు మూసివేసి సమ్మె నోటీసును అంటించారు. నిరవధిక సమ్మె గనుక కొనసాగితే ఎన్నో పథకాలకు, ప్రభుత్వ ప్రవేశ పరీక్షలకు, దరఖాస్తులకు అవసరమయ్యే ధృవీకరణపత్రాలు మంజూరు చేయకపోతే అభ్యర్థులు తీవ్రస్థాయిలో నష్టపోవడం ఖాయం. ఇప్పటికైనా రాష్ట్రప్రభుత్వం మీ సేవ నిర్వాహకుల న్యాయమైన సమస్యలను పరిష్కరించి ప్రజలకు ఎలాంటి కష్టాలు లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
* జిల్లాలో 400 కేంద్రాలు
జిల్లాలోని 400 మీసేవ కేంద్రాల ద్వారా ప్రజలకు 347 సేవలు అందుతున్నాయి. విద్యుత్, టెలిఫోన్, ఆదాయ, కులధృవీకరణ పత్రాలు, రెవెన్యూకు సంబంధించిన సేవలు, అడంగళ్, వన్‌బి, పట్టాదారు పాసుపుస్తకాలు తదితర సేవలు మీసేవల ద్వారా ప్రజలకు అందడం ఆగిపోనున్నాయి.
అప్పుల పాలౌతున్న నిర్వాహకులు
చాలీ చాలని కమీషన్లతో నిర్వాహకులు నానా అవస్థలు పడుతున్నారు. వచ్చే కమీషన్‌తో రూమ్‌కు అద్దె, విద్యుత్, ఇంటర్నెట్ బిల్లులు కట్టుకోలేని పరిస్థితి తలెత్తుతోంది. మీసేవ కేంద్రాల నిర్వహణ సాధ్యం గాక అనేక మంది అప్పుల పాలౌతున్నారు. రాష్ట్రంలో 11వేల మీసేవ కేంద్రాలు ఉండగా, కేవలం 9వేల మీసేవ కేంద్రాల ద్వారా ప్రజలకు సేవలందనున్నాయి. అంటే 3వేల మీసేవ కేంద్రాలు నష్టాలలో ఉండి, కేంద్రాలను నడుపుకోలేని పరిస్థితుల్లో ఉన్నాయి. మీ సేవ నిర్వాహకుల అసోసియేషన్‌కు ప్రభుత్వం నుంచి హామీ రాకపోతే సమ్మె కొనసాగితే ప్రజలకు ,విద్యార్థులకు ఎంతగానో నష్టం వాటిల్లుతుంది. ఇప్పుడే పలు పోటీపరీక్షలు, ఉద్యోగ నోటిఫికేషన్లు రావడంతో అభ్యర్థులకు రెవెన్యూ వ్యవస్థ నుంచి కుల ధృవీకరణ పత్రాలు, ఆదాయ ధృవీకరణ పత్రాలు ఎంతో అవసరం.
కనీస వేతనంకు అనుగుణంగా కమీషన్లు ఇవ్వాలి
* ఏపీ మీసేవ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్‌కుమార్
రాష్ట్రంలో మీసేవ నిర్వాహకులు ఎంతగానో విద్యార్హతలు కలిగి నిత్యం అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ పట్టణ , మారుమూల గ్రామాల ప్రజలకు సేవలు అందించే నిర్వాహకులకు నేడు కనీస వేతనానికి అనుగుణంగా కమీషన్లు అందక, ఆర్థిక ఇబ్బందుల్లో సతమతవౌతున్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు లేబర్ యాక్టుప్రకారం స్కిల్డ్ లేబర్‌కు వేతనం రూ.18,500లు ఉంది. కనీస వేతనానికి అనుగుణంగా మీసేవ నిర్వాహకులకు ఆర్థిక భరోసా ఇవ్వాలని, ప్రతి లావాదేవీలకు 80శాతం నిర్వాహకులకు ఇవ్వాలన్నారు. నేడు రూ.2వేలు కూడా ఆదాయం లేని మీసేవ కేంద్రాలు ఎన్నో ఉన్నాయన్నారు. మీ సేవ నిర్వాహకులకు ఆరోగ్యకార్డులు, ఆరోగ్యబీమా, విధి నిర్వహణలో నిర్వాహకులు మృతి చెందితే ఎక్స్‌గ్రేషియా కింద రూ.10లక్షలు అందించాలన్నారు. మీ సేవకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుచేసి మీసేవ నిర్వహణకు ఉపయోగపడే మిషనరీ సబ్సిడీ రూపంలో ఆర్థిక రుణాలు అందజేయాలి.