కడప

పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, జనవరి 22: సుదూర ప్రాంతాల నుంచి ఎంతో ఆశతో రిమ్స్ ఆసుపత్రికి వచ్చే పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ వైద్యాధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక రిమ్స్ ఆసుపత్రిలో అభివృద్ధి కమిటీ సమావేశాన్ని కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా రిమ్స్ ఆసుపత్రిని ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని, రూ.86 కోట్లతో రిమ్స్ ఆసుపత్రిలో వివిధ అభివృద్ధి పనులు, నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. పనుల్లో వేగం పెంచాలని సూచించారు. ఎన్టీఆర్ వైద్యసేవ ద్వారా ఉచిత వైద్యసేవలు అందిస్తున్నారని, రిమ్స్ ఆసుపత్రిలో రోగులకు ప్రేమ, ఆప్యాయతలతో వైద్యచికిత్సలు అందించాలన్నారు. ఈ సందర్భంగా గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలుపై కలెక్టర్ సమీక్షించారు. ఇందులో ఆసుపత్రి భద్రత నిమిత్తం ఏర్పాటు చేసిన 50 సీసీ కెమెరాల నిర్వహణను పకడ్బంధీగా నిర్వహించాలన్నారు. జాన్సన్ లిఫ్ట్ ప్రైవేటు లిమిటెడ్ వారిచే చేపట్టిన లిఫ్ట్ ఏర్పాటు పనులను వేగవంతం చేయాలన్నారు. ఆసుపత్రిలో ఔట్‌సోర్సింగ్ సిబ్బంది అందరూ డ్రెస్ కోడ్ తప్పనిసరిగా పాటించాలని, ఆ విధంగా పాటించని వారికి ఒకరోజు జీతం కట్ చేయాలని సూచించారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద దాతలను ఎవరైనా ముందుకు వస్తే ఆసుపత్రిలో ఈసీటీ, ఈఈజీ, అల్ట్రాసౌండ్ స్కాన్ మిషన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదే విధంగా క్రాష్ ట్రాలిస్, మనికిన్స్, రిజిష్టర్లు, లారింగో స్కోప్స్, కంప్లైంట్ బాక్సుల ఏర్పాటు, అప్పర్ జీ1 ఎండోస్కోప్ మిషన్ ఏర్పాటుకు టెండర్ ప్రక్రియ పూర్తయి వర్క్ ఆర్డర్ ఇవ్వడం జరిగిందని, ఆ పనులను వెంటనే ప్రారంభించాలని రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ గిరిధర్‌కు సూచించారు. మున్సిపల్ శాఖ ద్వారా ఆస్పత్రిలో చేపట్టిన ఇంటర్నల్ అప్రోచ్ రోడ్డు, నేమ్‌బోర్డులు, డెమో లైట్ల ఏర్పాటుకు టెండర్ ప్రాసెస్ పూర్తి చేయడం జరిగిందని వెంటనే వర్క్ ఆర్డర్ జారీ చేసి పనులు ప్రారంభించాలన్నారు. బ్లడ్‌బ్యాంకు విభాగంలో సెంట్రిప్యూజ్ ఏర్పాటు కూడా టెండర్ల ప్రక్రియ పూర్తి చేయడం జరిగిందన్నారు. ఈ పనిని కూడా వెంటనే ప్రారంభించేందుకు తదుపరి ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. స్థానిక పాత బస్టాండు నుంచి రిమ్స్ హాస్పిటల్ వరకు, అలాగే రిమ్స్ హాస్పిటల్ నుండి పాత బస్టాండు వరకు బస్సుల సర్వీస్ ఏర్పాట్లు కూడా వెంటనే చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బయోకెమిస్ట్రీ విభాగంలో ఆటో అనలైజర్ చేయడం లేదని, నూతన పరికరాన్ని ఏర్పాటుకు తదుపరి చర్యలు తీసుకోవాలన్నారు. రీ ఏజెంట్స్ సరఫరా చేయు గ్రీన్ ఆపిల్ మెడికల్ సంస్థకు చెల్లించాల్సిన రూ.15 లక్షల మొత్తాన్ని చెల్లించుటకు సరఫరా చేయు గ్రీన్ ఆపిల్ మెడికల్ సంస్థకు చెల్లించాల్సిన రూ.15 లక్షల మొత్తాన్ని చెల్లించుటకు ఐదు మంది సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసి వారు సరఫరా చేసిన వస్తువులను, వాటి వాడకాన్ని పరిశీలించిన పిదప నగదు చెల్లింపులకు తదుపరి చర్యలు గైకొనాలని సూచించారు. రేడియోలజీ విభాగంలో ఏసీల ఏర్పాటుకు కూడా కలెక్టర్ ఆమోదం తెలిపారు.
మెడికల్ కాలేజ్ డెవలప్‌మెంట్ సొసైటీ సమావేశం నిర్వహణ: రిమ్స్ మెడికల్ కళాశాల అభివృద్ధి నిమిత్తం నూతనంగా ఏర్పాటు చేసిన కళాశాల డెవలప్‌మెంట్ సొసైటీ సభ్యులతో మంగళవారం రిమ్స్ డైరెక్టర్ చాంబర్లో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మెడికల్ కళాశాలలోని అన్ని విభాగంలలో 20 కొత్త కంప్యూటర్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. అలాగే రూ.8.50 లక్షలతో బాయ్స్ హాస్టల్ వద్ద, రూ.16.5 లక్షలతో గర్ల్స్ హాస్టల్ వద్ద పార్కింగ్ షెడ్‌లో ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. అనాటమీ, పేథాలజీ డిపార్టుమెంట్లలో ప్రస్తుతం వారికి ఉన్న పరికరాలు కాకుండా నూతన పరికరాలు కూడా కొనుగోలు చేయడానికి ఆమోదం తెలిపారు. కళాశాలలో గల ఆడిటోరియం అభివృద్ధి చేయడానికి మరమ్మతులకు రూ.56.80 లక్షలు అవసరమవుతాయని కళాశాల ప్రిన్సిపాల్ విన్నవించగా, ఈ పనులు చేపట్టుటకు టెండర్లు పిలవాలని ఏపీహెచ్ ఎంఐడీసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌ను ఆదేశించారు. కళాశాలలో గల జిమ్ కేంద్రాన్ని గెస్ట్ హౌస్ మరమ్మత్తుల కూడా కలెక్టర్ అంగీకారాన్ని తెలిపారు. ఆసుపత్రిలో గల జిమ్ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా రూ.10 లక్షలతో బ్లడ్‌బ్యాంకు విభాగంలో ఏర్పాటు చేసిన సెంట్రిప్యూజ్ నూతన మిషన్‌ను కలెక్టర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ గిరిధర్, ఆర్ ఎంవో డాక్టర్ వెంకటశివ, రిమ్స్ కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు, హాస్పిటల్ డెవలప్‌మెంట్ సొసైటీ వర్కింగ్ ఛైర్మన్ మురళీధర్‌రెడ్డి, కమిటీ సభ్యులు డాక్టర్ వారణాసి ప్రతాప్‌రెడ్డి, డాక్టర్ నాగేంద్ర, బ్లడ్ బ్యాంక్ హెచ్‌వోడీ డాక్టర్ వరలక్ష్మి, అన్ని విభాగాల డాక్టర్లు, నర్సులు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.