కడప

పేదలను మోసంచేస్తున్న ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రొద్దుటూరు, జనవరి 22: ఎన్‌టీఆర్ గృహ పథకం పేరుతో పేదలను ప్రభుత్వం మోసం చేస్తోందని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఆరోపించారు. ఎన్‌టీఆర్ గృహ పథకం కింద ఎంపికైన లబ్దిదారులతో ఆయన స్థానిక గాంధీ పార్కులో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్‌టీఆర్ గృహ పథకం కింద ఎంపికైన లబ్దిదారుల వద్ద నుంచి మూడు విభాగాల పేరుతో లక్ష రూపాయలు, యాభై వేల రూపాయలు, ఐదు వందల రూపాయలు లబ్దిదారుల వాటా చెల్లించాలని తీసుకుని ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని అన్నారు. ప్రస్తుతం ఎన్‌టీఆర్ గృహ పథకం కింద నిర్మిస్తున్న 33 బ్లాకులలో ఆనాడు అపెరల్ పార్కుకు స్థలాన్ని కేటాయించింది. ఈ కేటాయింపుపై రైతులు కోర్టుకు వెళ్లడంతో గృహ నిర్మాణాలు ఆగిపోయాయన్నారు. గృహ నిర్మాణాలు ఆగిపోయిన విషయాన్ని తెలుగుదేశం నాయకులు గోప్యంగా ఉంచి, పేదలను మోసగించే ప్రయత్నం చేస్తోందన్నారు. 2006లో అప్పటి ముఖ్యమంత్రి వైయస్ హయంలో అపెరల్ పార్కుకు రైతులు తక్కువ ధరకు భూములను ప్రభుత్వానికి అప్పగించారని గుర్తుచేశారు. అపెరల్ పార్కు పరిశ్రమల ఏర్పాటు చేయకపోవడంతో ఆ భూములను రైతులకు ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ప్రభుత్వానికి లేఖ రాసిన విషయాన్ని శివప్రసాదరెడ్డి గుర్తు చేశారు. 2014 ఎన్నికల సమయంలో పేదలందరికీ ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఎన్నికలు సమీపిస్తుండడంతో ఇప్పుడు గృహ నిర్మాణాల పేరుతో లబ్దిదారుల నుంచి డబ్బు కాజేయాలని చూస్తోందని అన్నారు. జగన్ అధికారంలోకి వస్తే పేదలందరికీ ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. అలాచేయని పక్షం తన సొంత భూమిలో ఈ సమావేశానికి హాజరైన లబ్దిదారులకు ఒకటిన్నర సెంట్లు చెప్పున స్థలాన్ని అందిస్తానని శివప్రసాద్‌రెడ్డి హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఇచ్చే స్థలాలు తమకు వద్దని, తాము చెల్లించిన డిపాజిట్లును తిరిగి తమకు వాపస్ ఇవ్వాలని లబ్దిదారులు మున్సిపల్ కమిషనర్‌కు దరఖాస్తులు అందజేశారు.