కడప

టీడీపీ నుంచి మేడా సస్పెన్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజంపేట, జనవరి 22: రాజంపేట తెలుగుదేశం పార్టీలో నెలకొన్న సంక్షోభం చిలికిచిలికి గాలివానగా మారింది. కడప జిల్లా నుండి టీడీపీ తరపున ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జునరెడ్డి. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ అమరావతిలోని చంద్రబాబు నివాసంలో మంగళవారం జరిగిన నియోజకవర్గ పార్టీ కార్యకర్తల సమావేశంలో మల్లిఖార్జునరెడ్డిన సస్పెండ్ చేసినట్టు ప్రకటించారు. వెంటనే మల్లికార్జునరెడ్డి సాయంత్రం వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డిని లోటస్‌పాండ్‌లో కలుసుకొని పార్టీలో చేరికకు ముహూర్తం నిర్ణయించుకున్నారు. జగన్‌ను కలిసిన సందర్భంగా మేడా వెంకట మల్లికార్జునరెడ్డి తెలుగుదేశం పార్టీపైన, ఆ పార్టీ అధినేత చంద్రబాబుపైన పదునైన పదజాలంతో విమర్శలు గుప్పించారు. ఈనెల 31వ తేదీన తన అనుచరులు, కార్యకర్తలు, నేతల సమక్షంలో పెద్దఎత్తున వైసీపీలో చేరుతున్నట్టు మేడా ప్రకటించారు. అంతేకాకుండా జగన్మోహన్‌రెడ్డి సూచనల మేరకు శాసనసభ్యత్వానికి, ప్రభుత్వ విప్ పదవికి కూడా స్పీకర్ ఫార్మేట్‌లో బుధవారం రాజీనామాను సమర్పించనున్నట్టు ప్రకటించారు. జగన్మోహన్‌రెడ్డితో కలయికకు ముందు తన సోదరులతో కలిసి మల్లికార్జునరెడ్డి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డితో పార్టీలో చేరికపై చర్చించారు. జగన్‌ను మల్లిఖార్జునరెడ్డి కలిసే సమయంలో రాజంపేట వైసీపీ ఇన్‌చార్జ్ ఆకేపాటి అమర్‌నాధరెడ్డి రాజంపేటలో ఉండడం గమనార్హం. జగన్‌ను కలిసిన తరువాత మల్లికార్జునరెడ్డి మాట్లాడుతూ టీడీపీ నుంచి వైసీపీలోకి రావడం గంజాయి వనం నుండి తులసి వనంలోకి వచ్చినట్టుగా ఉందన్నారు. మల్లిఖార్జునరెడ్డి పనితీరుపైన కూడా టీడీపీ జిల్లా నేతలు, నియోజకవర్గ నేతలు కూడా అమరావతిలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఘాటైన పదజాలంతో విమర్శించారు. 2014 ఎన్నికల్లో బీజేపీకి రాజంపేట అసెంబ్లీ స్థానం కేటాయించారని, అయితే పార్టీ అధినేతను ఒప్పించి మల్లిఖార్జునరెడ్డికి ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు మార్గం సుగమమం చేశామని కార్యకర్తలు అన్నారు. అలాగే ప్రభుత్వ విప్‌తో పాటు, కోరినన్ని సంక్షేమ, అభివృద్ధి పనులకు నిధులు ముఖ్యమంత్రి కేటాయించారని అన్నారు. మల్లిఖార్జునరెడ్డి తండ్రి రామకృష్ణారెడ్డికి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యునిగా కూడా నియమించారని అన్నారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతూ, పార్టీని భ్రష్టు పట్టిస్తూ పార్టీలోనే ఉంటూ కుతంత్రాలు పన్నారని రాజ్యసభ సభ్యులు సిఎం రమేష్‌తో పాటు పలువురు జిల్లా, నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నేతలు కూడా వ్యాఖ్యానించారు.
రాజంపేటకు త్రిసభ్య కమిటీ
మల్లికార్జునరెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేయడంతో, ఈ నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాలు చూసుకునేందుకు జిల్లా మంత్రి ఆదినారాయణరెడ్డితో పాటు జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షులు ఆర్.శ్రీనివాసులురెడ్డితో త్రిసభ్య కమిటీని చంద్రబాబు నియమించారు. త్వరలో నియోజకవర్గానికి పార్టీ పూర్తిస్థాయి ఇన్‌చార్జ్‌ని నియమించనున్నట్టు చంద్రబాబు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలోకి మధ్యలో వచ్చిన వారు మధ్యలో వెళ్లిపోతారని, మల్లిఖార్జునరెడ్డి కుటుంబానికి ఎంతో గౌరవం ఇచ్చినా, స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీ మారేందుకు సిద్ధపడ్డారని అన్నారు. మల్లిఖార్జునరెడ్డి వెళ్ళిపోయినా పార్టీ కార్యకర్తలు అలాగే ఉన్నారని, ఇదే కసితో రానున్న ఎన్నికల్లో పనిచేసి రాజంపేటలో టీడీపీ అభ్యర్థిని గెలిపించుకు రావాలని కోరారు.
అభ్యర్థిని ఎంపిక చేస్తా..గెలిపించండి
వచ్చే ఎన్నికల్లో రాజంపేట నియోజకవర్గం నుండి ఎవరైనా బలమైన అభ్యర్థిని సూచించాలని మంగళవారం అమరావతిలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు కార్యకర్తలను, నాయకులను కోరారు. కార్యకర్తలంతా కలిసి ఒక అభ్యర్థిని సూచించడంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోవడంతో తానే బలమైన అభ్యర్థిని ఎంపిక చేస్తానని, ఆ అభ్యర్థికి మీరంతా మద్దతిచ్చి పనిచేయాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.