కడప

టీడీపీకి అచ్చిరాని రెడ్డి సామాజికవర్గం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజంపేట, జనవరి 22: రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీకి రెడ్డి సామాజికవర్గం అభ్యర్థులు అచ్చిరావడం లేదనిపిస్తోంది. ఈ నియోజకవర్గంలో మొదటి నుండి రెడ్డి, బలిజ సామాజికవర్గం అభ్యర్థుల మధ్యే ప్రధాన పోటీ నడిచింది. తెలుగుదేశం పార్టీ పుట్టుక తరువాత కూడా ఇదే సంప్రదాయం కొనసాగింది. టీడీపీ ఆవిర్భావం తరువాత జరిగిన ఎన్నికల్లో రెడ్డి సామాజికవర్గానికి చెందిన ముగ్గురు అభ్యర్థులు ఎన్నికయ్యారు. అయితే, ఈముగ్గురు నేతలతీరు పార్టీలో విభిన్నంగా సాగింది. టీడీపీ ఆవిర్భావానికి ముందు కూడా పలుసార్లు రాజంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ రెడ్డి సామాజికవర్గానికి చెందిన అభ్యర్థులను బరిలోకి దించితే, ప్రత్యర్థి పార్టీ బలిజ సామాజికవర్గం నుంచి అభ్యర్థులను పోటీకి నిలబెట్టింది. తెలుగుదేశం పార్టీ 1983, 1985 సార్వత్రిక ఎన్నికల్లో బలిజ సామాజికవర్గానికి చెందిన సీనియర్ నేత స్వర్గీయ బండారు రత్నసభాపతిని అభ్యర్థిగా ఎంపిక చేశారు. విధిలేని పరిస్థితుల్లో మూడుసార్లు ఆ పార్టీ రెడ్డి సామాజికవర్గం నుండి అభ్యర్థుల ఎంపిక చేసింది. 1989లో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ లభించకపోవడంతో సీనియర్ నేత కొండూరు ప్రభావతమ్మకు తెలుగుదేశం పార్టీ టిక్కెట్ ఇచ్చింది. ఆ ఎన్నికల్లో ప్రభావతమ్మ ఓటమి చవిచూశారు. ఆ తరువాత అప్పటి తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్టీఆర్ రాజంపేట నియోజకవర్గ పార్టీ కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించాలని ప్రభావతమ్మను కోరారు. అనివార్య కారణాల వలన ప్రభావతమ్మ క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. దీంతో 1989 నుండి 1994 వరకు నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు ఆ పార్టీ కార్యకర్తలే చూసుకుంటూ వచ్చారు. ఆ తరువాత 1994, 1999, 2004 ఎన్నికల్లో టీడీపీ తిరిగి బలిజ సామాజికవర్గానికి చెందిన పసుపులేటి బ్రహ్మయ్యను అభ్యర్థిగా బరిలోకి దించింది. 2009 ఎన్నికల్లో టీడీపీ తిరిగి రెడ్డి సామాజికవర్గానికి చెందిన మాజీ శాసనసభ్యుడు డాక్టర్ కే.మదన్‌మోహన్‌రెడ్డిని అభ్యర్థిగా పోటీకి నిలబెట్టింది. ఈ ఎన్నికల్లో మదన్‌మోహన్‌రెడ్డి ఓటమి చవిచూసినా, 2012 ఉప ఎన్నికల వరకు నియోజకవర్గానికి పార్టీ ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. అప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లో మదన్‌మోహన్‌రెడ్డిని కాదని బలిజ సామాజికవర్గానికి చెందిన పసుపులేటి బ్రహ్మయ్యను అభ్యర్థిగా టీడీపీ అధిష్టానం ప్రకటించింది. దీంతో మదన్‌మోహన్‌రెడ్డి మనస్తాపానికి గురయ్యారు. బ్రహ్మయ్యతో కలిసి ఎన్నికల్లో తిరగలేనని నేరుగా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు చెప్పి 2014 ఎన్నికల వరకు పార్టీలోనే కొనసాగారు. 2014 ఎన్నికల్లో కూడా పార్టీ టికెట్ దక్కకపోవడంతో మదన్‌మోహన్‌రెడ్డి పార్టీకి దూరమయ్యారు. 2014 ఎన్నికల్లో ఆనూహ్యంగా తెరపైకి వచ్చిన మేడా మల్లికార్జునరెడ్డి టీడీపీ టికెట్ దక్కించుకుని విజయం సాధించారు. ప్రభుత్వ విప్ పదవి కూడా ఆయనను వరించింది. నాలుగున్నర సంవత్సరాల పాటు టీడీపీలోనే కొనసాగిన మల్లికార్జునరెడ్డిని పార్టీ నుంచి మంగళవారం సస్పెండ్ చేశారు. అదే సమయంలో మల్లిఖార్జునరెడ్డి వైసీపీ అధ్యక్షుడు జగన్‌ను కలిసి వైసీపీలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. దీంతో రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీకి రెడ్డి సామాజికవర్గానికి చెందిన అభ్యర్థులు అచ్చిరారన్నది తేలిపోయింది.