కడప

గెలిచిన ఆ ఒక్కడు.. దాటుకున్నాడు...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, జనవరి 22: 2014 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ నుండి జిల్లాలో గెలిచిన ఒకే ఒక్కడు మేడా మల్లికార్జునరెడ్డి ఇప్పుడు 2019 ఎన్నికలకు ముందు ఆ ఒక్కడు పార్టీ నుంచి దాటుకున్నాడు.. మేడా మల్లికార్జునరెడ్డి తనకు మంత్రి పదవి వస్తుందని 2014 ఎన్నికల తర్వాత భావించారు. క్రమక్రమంగా ఆ అసంతృప్తి ఎక్కువ కావడం, మల్లికార్జునరెడ్డి సోదరుడు రఘునాధరెడ్డి పట్టుదల పెరగడంతో చివరకు ఈ అంశం చిలికి చిలికి గాలివానలా మారి జిల్లాలో రాజకీయ వేడిని రగిల్చింది... మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మేడా మల్లికార్జునరెడ్డిని పార్టీ నుండి సస్పెన్షన్ చేసేందుకు దారి తీసింది... సస్పెన్షన్ కోసమే కాచుకొని ఉన్నట్లుగా మేడా మల్లికార్జునరెడ్డి మంగళవారమే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి పార్టీలో చేరేందుకు ఖరారు చేసుకున్నారు. ప్రస్తుతం, వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి వచ్చి మంత్రిగా పనిచేస్తున్న ఆదినారాయణరెడ్డి, బద్వేల్‌లో వైసీపీ నుండి గెలిచి తెలుగుదేశంలోకి వచ్చిన జయరాములు మాత్రమే ప్రస్తుతం చట్టసభ ప్రతినిధులుగా టీడీపీకి మిగిలారు. మేడా మల్లికార్జునరెడ్డి పార్టీ మార్పు అంశం గత ఐదారు నెలలుగా జిల్లాలో నానుతోంది. ప్రధానంగా మల్లికార్జునరెడ్డి సోదరుడు రఘునాధరెడ్డి వైకాపా నేతలతో సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మేడా కన్‌స్ట్రక్షన్ అనేక కాంట్రాక్టు పనులు చేపట్టి ఉండటం కూడా ఈ రాజకీయ మార్పిడికి కారణమని రాజకీయ విశే్లషకులు భావిస్తున్నారు. వైకాపాలో చేరితే తెలంగాణలో తాము చేస్తున్న కాంట్రాక్టు పనులకు ఏ అడ్డంకులు లేకుండా బిల్లులు మంజూరవుతాయనే ఉద్దేశ్యంతోనే పార్టీ మారుతున్నారని తెలుగుదేశం వర్గీయులు చెబుతున్నారు. పార్టీ మారే ఉద్దేశ్యం 6 నెలల నుండి పెట్టుకొని పార్టీ మీద నిందలు మోపేందుకు మేడా మల్లికార్జునరెడ్డి ఇన్ని రోజులు నాటకాలు ఆడారని తెలుగుదేశం వర్గీయుల వాదన. మేడా వర్గీయుల వాదన మరోలా ఉంది.. తమకు రాజంపేట నియోజకవర్గంలోని తెలుగుదేశం నేతలు కానీ జిల్లా తెలుగుదేశం అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, మంత్రి ఆదినారాయనరెడ్డి కానీ గుర్తింపును ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. ఆ వేదనతోనే వెళ్లిపోతున్నామని మేడా వర్గీయుల వాదన. ఏది ఏమైనా వైఎస్‌ఆర్ కడప జిల్లాలో చాలా ముందుగానే రాజకీయ వేడి రగిల్చడంలో మేడా ఉదంతం దోహదం చేసింది. మేడా సోదరుడు తెలుగుదేశంలోనే ఉండి ఉంటే ఇరు పార్టీల్లోను టికెట్ల సంక్షోభం అసలు లేని నియోజకవర్గంగా రాజంపేట నిలిచి ఉండేది. ఇప్పుడు అన్ని నియోజకవర్గాలతో పాటు ఒక ఆకు ఎక్కువే సంక్షోభం ఇరు పార్టీలకు ఏర్పడింది. మేడా మల్లికార్జునరెడ్డి పార్టీ వీడగానే ఆ నియోజకవర్గంలో బలంగా ఉన్న కాపు(బలిజ)లు, మరోవైపు రాజులు ఎవరికి వారు టికెట్ల ప్రయత్నం ప్రారంభించారు. ఇటు వైకాపాలోను మేడా సోదరుల చేరికతో తొలి నుండి ఉన్న మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాధరెడ్డికి టికెట్ అంశం ప్రశ్నార్థకంగా మారింది. మేడా సోదరులలో ఒకరికి రాజంపేట శాసనసభ నియోజకవర్గానికి టికెట్ ఇవ్వాల్సి వస్తే అమరనాధరెడ్డిని వైకాపా అధిష్టానం బుజ్జగించాల్సిన పరిస్థితి ఉంది. ఇలా ఇరు పార్టీలు రాజంపేట శాసనసభ నియోజకవర్గం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి.