కడప

కౌనె్సలింగ్ పేరుతో పిలచి చితకబాదిన పోలీసు అధికారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,మే 13: భార్యాభర్తల మద్య చిన్నపాటి ఘర్షణలు జరిగి, మనస్పర్థలు ఏర్పడటంతో ఇద్దరినీ కౌన్సిలింగ్ కోసమని మహిళా పోలీసుస్టేషన్‌కు పిలిపించిన ఖాకీలు తమ విశ్వరూపాన్ని చూపించారు. వారికి రెండు, మూడు పర్యాయాలు కౌన్సిలింగ్ ఇచ్చి భార్యభర్తలను కలపాల్సిన పోలీసులు అందుకు భిన్నంగా వ్యవహరించారు. నగరంలో దంపతుల మధ్య ఏర్పడిన వివాదం పరిష్కారం పేరుతో పోలీసుస్టేషన్‌కు పిలిపించి రాజశేఖర్ అనే యువకుడిని గత రెండురోజులుగా మహిళా పోలీసుస్టేషన్‌లో చితక బాదారు. చావు బతుకుల మధ్య ఉన్న ఆ యువకుడి బంధువులు మహిళా పోలీసుస్టేషన్ అధికారుల కాళ్లవేళ్లా పడినా కనికరం చూపలేదు. ఈ వ్యవహారంపై శుక్రవారం రాత్రి బాధితుడి కుటుంబ సభ్యులు జిల్లా ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణను కలిసి తమ గోడును వెళ్లబుచ్చుకున్నారు. వెంటనే ఎస్పీ స్పందిస్తూ ఈ సంఘటనపై విచారణకు పోలీసు అధికారులను మహిళా పోలీసుస్టేషన్‌కు పంపారు. అందుకు కౌంటర్‌గా మహిళా పోలీసుస్టేషన్ అధికారులు ఫిర్యాదు దారులను ఎస్పీ వద్దకు పంపినట్లు తెలుస్తోంది. కడప నగరం చలమారెడ్డిపల్లె గ్రామానికి చెందిన బత్తల రాజశేఖర్ (25), బి.రమాదేవి దంపతులు. ఇటీవలే భార్యభర్తలకు చిన్నపాటి వివాదం రావడంతో రమాదేవి తల్లిదండ్రులు నగరంలోని మహిళా పోలీసుస్టేషన్ అధికారులను ఆశ్రయించారు. ఆమె తల్లిదండ్రులు ఆర్థికంగా, రాజకీయంగా పలుకుబడి కావడంతో భర్త రాజశేఖర్‌ను స్టేషన్‌కు పిలిపించి లాఠీ రుచిచూపించారు. తొలుత కౌన్సిలింగ్ పేరుతో మహిళా పోలీసుస్టేషన్‌కు పిలిపించి భార్య భర్తలను విచారించిన పోలీసులు రెండు రోజులుగా రాజశేఖర్‌ను చితకబాదారు. ఆ యువకుడు కదలలేని స్థితిలో ఉన్నట్లు తెలిసింది. ఆయన సంబంధీకులు స్టేషన్‌కు వచ్చినా అతన్ని పోలీసులు చూపడం లేదు. ఆయన కుటుంబ సభ్యులు భయాందోళనకు గురై ఎస్పీని సంప్రదించారు. ఎస్పీ వెంటనే ఆ సంఘటనపై విచారణకు ఆదేశిస్తూ కొట్టిన వారిపై శాఖాపరమైన చర్యలకు ఆదేశించారు.