కడప

మహాయజ్ఞంగా ‘నవోదయం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయచోటి,మే 20: మహాయజ్ఞంగా నవోదయం కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా నిర్వహించాలని జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ప్రేమ్ ప్రసాద్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక ఎక్సైజ్ కార్యాలయంలో జిల్లాలోని 13 స్టేషన్ల ఎక్సైజ్ అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 340 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. అదే విధంగా 2470 లీటర్ల సారాను కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. 83,290 లీటర్ల బెల్లం ఊటను కూడా ధ్వంసం చేయడం జరిగిందన్నారు. 220 కేసులు, 41 మందిని అరెస్టు చేయడం జరిగిందన్నారు. రాయచోటి ఎక్సైజ్ పరిధిలోని సంబేపల్లె, సుండుపల్లె, చిన్నమండెం, రాయచోటి, వీరబల్లె మండలాల్లో అసిస్టెంట్ కమిషనర్ బాలక్రిష్ణన్ గత 20 రోజులుగా ప్రతిపల్లె తిరిగి సారా ఎక్కడ కూడా లేకుండా నిర్మూలించారని ఆయన ప్రశంసించారు. కొన్ని పల్లెల్లో అయితే ప్రజలే స్వచ్చంధంగా సారాను తయారు చేయమని ప్రతిజ్ఞ కూడా చేసినట్లు ఆయన తెలిపారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 87 నాటు సారా రహిత గ్రామాలను గుర్తించినట్లు ఆయన తెలిపారు. అనంతరం రాయచోటి, సుండుపల్లె, సంబేపల్లె, చిన్నమండెం, వీరబల్లె మండలాల్లో విసృతంగా దాడులు నిర్వహించి నాటు సారాను అరికట్టడం జరిగింది. ఈ దాడుల్లో సుమారు 43 మందిపై కేసులు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. 150 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. 11,400 లీటర్ల బెల్లం ఊటను కూడా ధ్వంసం చేయడం జరిగిందన్నారు. రాయచోటి మండలంలోని మాధవరం వడ్డిపల్లె, చెర్లోపల్లెబిడికి, ముష్టిమేకలపల్లె, గుంటిమడుగు పల్లెలోని ప్రజలకు అవగాహన సదస్సులను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. సంబేపల్లె మండలంలోని శెట్టిపల్లె పెద్దబిడికి, పరకలబండ బిడికి, చిన్న బిడికి, రౌతుకుంటబోయపల్లెలోని ప్రజలు స్వచ్చంధంగా వచ్చి సారాను తయారు చేయమని ప్రతిజ్ఞ చేసినట్లు ఆయన తెలిపారు. ఎమ్మార్పీ ధరల కంటే అధికంగా విక్రయిస్తున్న షాపులకు అధిక మొత్తంలో జరిమానా విధించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్‌పోర్స్‌మెంటు అసిస్టెంట్ కమిషనర్ విజయ కుమారి, కడప ఎక్సైజ్ సూపరింటిండెంట్ శ్రీనివాసచారి, ఎన్‌పోర్స్‌మెంటు అసిస్టెంట్ కమిషనర్లు బాలక్రిష్ణన్, రవికుమార్, ప్రొద్దుటూరు ఎక్సైజ్ సూపరింటిండెంట్ విజయ కుమార్, సిఐలు మురళీ కిషోర్, ఎన్‌పోర్స్‌మెంటు సిఐ గణేష్, జిల్లాలోని 13 స్టేషన్ల ఎక్సైజ్ సిఐలు, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.