కడప

జిల్లా అభివృద్ధిపై సిఎం దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,మే 23: తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించారు. ఈ నేపధ్యంలో ఇటీవల కాపుకార్పొరేషన్ చైర్మన్ రామాంజనేయ, సోమవారం బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు జిల్లాలో పర్యటించారు. ప్రతిపక్షనేత, వైసిపి నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సొంత జిల్లాలో కాపులను, బ్రాహ్మణులను తెలుగుదేశంపార్టీ ఆకట్టుకునేందుకు సర్వశక్తులు వడ్డుతున్నారు. 2019 ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే ముందస్తు జాగ్రత్తలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ కార్పొరేషన్ల చైర్మన్లు, కమిషన్ల చైర్మన్లు జిల్లాకు పంపి తమ శాఖల వారీగా అభివృద్ధి, సంక్షేమంపై సంబంధిత నేతలను జిల్లా పంపుతున్నారు. అలాగే జిల్లాకు ముఖ్యమంత్రి తరచూ పర్యటనలు చేయడం, ప్రత్యేకించి హెచ్‌ఆర్‌డి, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి గంటా శ్రీనివాసరావు, జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, వ్యవసాయశాఖ, ఉద్యానవనశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావులను జిల్లాకు పంపుతున్నారు. దీన్ని బట్టి చూస్తే జగన్ సొంత జిల్లాపై ప్రభుత్వపరంగా రాజకీయపరంగా బాబు దూకుడు పెంచి తనదైన శైలిలో సర్వశక్తులు వడ్డుతున్నారు. ఈనేపధ్యంలో కడపను హార్టికల్చర్ హబ్‌గా ప్రకటించడం, గండికోటను ప్రపంచపర్యాటక కేంద్రంగా రూపకల్పన చేస్తుండటం, ఒంటిమిట్టను రెండవ భద్రాద్రిగా తీర్చిదిద్దడం, ఒంటిమిట్ట, గండికోట, తిరుపతి , కాళహస్తి, కాణిపాకంలను టెంపుల్స్ సర్క్యూట్‌గా తీర్చిదిద్దేందుకు ఇప్పటికే ప్రత్యేక నిధులు మంజూరు చేశారు. అలాగే జిల్లాకు తన మార్క్ కలిగిన కలెక్టర్‌గా కెవి సత్యనారాయణను, ఎస్పీగా పిహెచ్‌డి రామకృష్ణలను నియామకం చేశారు. మొత్తం మీద వైఎస్ జగన్ సొంత జిల్లాపై ముఖ్యమంత్రి దృష్టిపెట్టారు.

బ్రాహ్మణులు సంఘటితంగా మెలగాలి

కమలాపురం, మే 23: బ్రాహ్మణులందరూ సంఘటితంగామెలగాలని రాష్ట్ర బ్రాహ్మణకార్పొరేషన్ చైర్మన్ ఐవిఆర్ కృష్ణారావు పేర్కొన్నారు. ఆయన సోమవారం మండల పరిధిలోని రామాపురం గ్రామంలో జరిగిన మోక్షనారాయణ స్వామి వల్లీదేవసేన సమేత సుబ్రమణ్య స్వామి బ్రహ్మోత్సవాల్లో విశిష్ట అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయనకు ఆలయ వ్యవస్థాపకుడు సాయినాథశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఆలయంలోని మూలవిరాట్‌లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడికి విచ్చేసిన హంపి పీఠాధిపతి విద్యారణ్యభారతిస్వామి, హిందూ దేవాలయ ప్రతిష్టాన పీఠాధిపతి, భారతిస్వామిల ఆశీర్వాదాలు పొందారు. అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ బ్రిటీష్ హయాంలో హిందూదేశంపై పరదేశీయులు జరిపిన దాడులకంటే గత 50 ఏళ్లలో మనదేశంలో హిందూ సంస్కృతిపై జరిగిన దాడులు అధికమని ఆయన ఆందోళన వ్యక్తం చేసారు. ప్రతి ఒక్క హిందువుతమ సంస్కృతిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అలాగే బ్రాహ్మణ కార్పొరేషన్‌లో ఎలాంటి అవినీతి, అవకతవకలకు తావు లేదన్నారు. నిరుపేదలైన బ్రాహ్మణులకు సాయం అందిస్తామన్నారు. వేలాదిమంది పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నారని అయితే ప్రభుత్వం తరుపున పెన్షన్ పొందనివారికి మాత్రమే మంజూరు చేస్తామన్నారు. విద్యార్థులకు, ఇతర పథకాలకు అవసరమైన మేర సాయం అందిస్తామన్నారు. ఇందులో ఎలాంటి రాజకీయ వత్తిళ్లకు తావు లేదన్నారు. అలాగే రాష్ట్రంలోబ్రాహ్మణ శ్మశాన వాటికలకు ప్రభుత్వం తరుపున స్థలాలు మంజూరు చేయిస్తామని అవసరమైన చోట్ల వౌలిక సదుపాయాలకు కూడా నిధులు మంజూరు చేస్తామన్నారు. కమలాపురం బ్రాహ్మణ శ్మశాన వాటికకు స్థలం మంజూరు చేయాలని కలెక్టరుకు పంపడం జరిగిందన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా మోక్షనారాయణస్వామి ఆలయం ప్రత్యేకతను సంతరించుకుందని కొనియాడారు. హంపి పీఠాధిపతి శ్రీవిద్యారణ్యభారతి స్వామి మాట్లాడుతూ హిందూసంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. వాడవాడలా దేవాలయాలను నిర్మించి పూజాది కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. మరో పీఠాధిపతి కమలానందభారతి స్వామి మాట్లాడుతూ ఏ గ్రామంలో అయితే ఆలయాలు ధూపదీపనైవేద్యాలతో కళకళ లాడతాయో అక్కడ ప్రజలు పాడిపంటలతో, సుఖసంతోషాలతో ఆనందంగా ఉంటారన్నారు. గ్రామదేవతలను తప్పనిసరిగా పూజించాలన్నారు. ఈ కార్యక్రమంలో కడప ఆర్డీవో చిన్నరాముడు, తహశీల్దార్ రామ్మోహన్, బ్రాహ్మణసంఘ కో ఆర్డినేటర్ జనార్థన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఐవిఆర్ కృష్ణారావును దుశ్శాలువతో, మెమెంటోలతో ఘనంగా సత్కరించారు.