కడప

అరకొరగా ‘అమృత’ నిధులు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,మే 30: అమృత్ పథకం కింద జిల్లాలోని కడప నగరపాలకం, ప్రొద్దుటూరు పురపాలకానికి మొదటి ఫేస్ కింద రూ.44.32కోట్లు విడుదలయ్యాయి. కడప నగర పాలకం తాగునీటి ఎద్దడి నివారణకు రాష్ట్రప్రభుత్వం ద్వారా రూ.7.11కోట్లు, కేంద్ర ప్రభుత్వం ద్వారా రూ.17.78కోట్లు, నగరపాలకం రూ.18.43కోట్లు ఖర్చు చేయాల్సివుంది. అలాగే ప్రొద్దుటూరు పురపాలకానికి కేంద్రప్రభుత్వం రూ.25లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.10లక్షలు, పురపాలక సంఘాలు రూ.15లక్షలు వెచ్చించాల్సివుంటుంది. కేంద్రం ఇచ్చిన నిధులతోపాటు మ్యాక్సింగ్ గ్రాంట్ కింద రాష్ట్రప్రభుత్వం సంబంధిత పురపాలక సంఘాలు అమృతపథకం కింద తాగునీటితోపాటు పురపాలక సంఘాల్లో ఉద్యానవన వసతులు కూడా చేపట్టాల్సి ఉంటుంది. ఈ అరకొర నిధులతో కడప నగర పాలకం , ప్రొద్దుటూరు పురపాలకాల్లో దాహార్తి తీర్చడం కష్టంతో కూడుకున్న పని. సంబంధిత అధికారులు నగర పాలకం, ప్రొద్దుటూరు పురపాలకానికి దాహార్తి తీర్చేందుకు వందలకోట్లరూపాయలతో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకు ప్రతిపాదనలు పంపారు. ఆ ప్రతిపాదనలు ప్రభుత్వం బుట్టదాఖలు చేసి ముష్టి తరహాలో విధిలించారు.
అయితే ప్రస్తుతం అమృతపథకం కింద విడుదలైన నిధులు ఒక వీధికి కూడా నీరు సరఫరా చేయడంకానీ ఉద్యానవనాలు పెంపకాలు కానీ చేయలేరు. అధికారపార్టీకి చెందిన నేతలు ఆధిపత్యపోరుతో తమ స్వార్థప్రయోజనాల కోసం ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటారే తప్ప అమృత్ పథకం కింద తక్కువ నిధులు విడుదలయ్యాయని కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలతో సంప్రదించిన నేతల దాఖలాలు లేవు. అలాగే కడప నగర పాలకంలోనూ, ప్రొద్దుటూరు పురపాలకం లోనూ నీటి సమస్య తీవ్ర రూపం దాల్చి శానిటేషన్ సమస్య చెప్పనక్కర్లేదు. ఉద్యానవన తోటలు పెంపకం చేయాలన్నా నీటి సమస్య అనువైన ప్రాంతాల్లో అంతంత మాత్రమే. ప్రస్తుతం ఉన్న పార్కులన్నీ కళాహీనంగా ఉన్నాయి. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు జిల్లా నేతలు రాష్ట్ర, కేంద్రప్రభుత్వాలతో సంప్రదించి అమృత్ పథకానికి మరికొన్ని నిధులు విడుదల చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.