కడప

అభివృద్ధి నిధులు కొన్ని ప్రాంతాలకే పరిమితమా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,మే 30: జిల్లా అభివృద్ధి నిమిత్తం రాష్ట్రప్రభుత్వం ఇటీవల రూ.126కోట్లు కేటాయించగా, ఆ నిధు లు కొన్ని ప్రాంతాలకే పరిమితం చేశా రు. పరపతి ఉన్న నేతలు తమ ప్రాం తాలకు ఆ నిధులను తరలించుకువెళ్లా రు. జిల్లావ్యాప్తంగా పలుప్రాంతాల్లో అభివృద్ధిలో ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉండగా పరపతి ఉన్న నేతలు తమ ప్రాంతాలకు నిధులు దక్కించుకున్నారు. జిల్లా వ్యాప్తంగా మూడు నియోజకవర్గాలు మినహా మిగిలిన 7 నియోజకవర్గాల్లో వైకాపా ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తుండగా ఆ ప్రాంతాల్లో నిధులు అంతంతమాత్రంగానే విడుదల చేశా రు. అన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశంపార్టీ నియోజకవర్గాల ఇన్‌చార్జిలు ఇచ్చిన ప్రతిపాదనలు ప్రభుత్వం ఆమోదించింది. రాష్ట్రప్రభుత్వం విడుదల చేసిన రూ.126కోట్లు నిధులు ఖర్చు పై ప్రణాళికలు తయారు చేసి పనులు మొదలుపెట్టారు. ఈ పనుల్లో ముఖ్యంగా రూ.10కోట్లతో కోల్డ్ స్టోరే జి ఏర్పాటు చేస్తున్నారు. అలాగే భూగర్భజలాలు పెంచేందుకు పాపా గ్ని నదిపై రూ.12కోట్లతో ఆరు సబ్‌సర్ఫేస్ డ్యామ్‌లు నిర్మించనున్నారు. బహుళ గ్రామపథకం కింద నీటి వనరులు రూ.65కోట్లు ఖర్చు చేయనున్నారు. రూ.3.94కోట్లతో మంచినీటి పనుల విద్యుద్దీకరణ, పైపులైన్లను పొడగించి నిర్మించనున్నారు. 190 అంగన్వాడీ కేంద్రాల నిర్మాణానికి రూ. 6.36కోట్లు కేటాయించారు. వీటి లో ఒక్కొ భవనాలకు రూ.10లక్షలు, మిగిలిన అంగన్వాడీ కేంద్రాలకు రూ.66 లక్షలు ఖర్చు చేయనున్నారు. గండికోట పర్యాటక కేంద్రం అభివృద్ధికి జమ్మలమడుగు నుంచి గండికోటకు 15కి.మీ.రోడ్డు విస్తరణకు రూ.16 కోట్లు కేటాయించారు. మైదుకూరు రోడ్లు, కాలువల నిర్మాణాలకు రూ. కోటి కేటాయించారు. ఎన్‌టిఆర్ జలసిరి కింద 285 బోరుబావులకు మోటార్‌లు అమర్చేందుకు రూ.70లక్షలు కేటాయించారు. ఎర్రగుంట్ల మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.30లక్షలు, జమ్మలమడుగు పురపాలక సంఘం అభివృద్ధికి రూ.కోటి కేటాయించారు. ముద్దనూరు పంచాయతీలో మురికి కాలువల నిర్మాణాలకు రూ.30లక్షలు, కడప -కర్నూలు రోడ్డు దుంపలగట్టువద్ద తారురోడ్డు నిర్మాణానికి రూ.96 లక్షలు కేటాయించారు. దుంపలగట్టు నుంచి సిసిరోడ్డుకు రూ.35లక్షలుకేటాయించారు. ఖాజీపేట గ్రామసమైఖ్యల నిర్మాణానికి రూ.13.60లక్షలు, స్వ యం సహాయక బృందాల మహిళలకు జీన్స్ గార్మెంట్ శిక్షణ, మిషన్లకు మోటార్ అమర్చి, 20కుట్టుమిషన్లు, రెండు ఓవర్‌లాక్ మిషన్లకు రూ. 2 లక్షలు చొప్పున కేటాయించారు. రా జంపేట, రైల్వేకోడూరు, కడప, పులివెందుల, కమలాపురం నియోజవర్గాలకు అభివృద్ధి నిధులు కేటాయించలేదు. దీంతోజిల్లాలోని సంబంధిత ప్రాంత ప్రజలు తమ ప్రాంతానికి ప్రత్యేక అభివృద్ధి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.