కడప

చంద్రన్న బీమాపై అవగాహన సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వల్లూరు,మే 30: రాష్ట్రప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన చంద్రన్న ప్రమాద బీమా పథకంపై మహిళలకు అవగాహన సదస్సు నిర్వహించారు. సోమవారం మండల కేంద్రంలోని స్ర్తి శక్త్భివన్‌లో ఐకెపి ఏపిఎం రాధిక ఆధ్వర్యంలో మహిళలకు పథకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ రూ.15లు బీమా పథకంతో రూ.5లక్షలు ప్రమాద బీమా పథకానికి అర్హులౌతారని చెప్పారు. ఈ పథకంపై అందరికీ అవగాహన కల్పించాలన్నారు. ఈ కారక్రమంలో విఓల అధ్యక్షురాళ్లు, సభ్యులు, ఆనిమేటర్లు పాల్గొన్నారు.
చెన్నూరులో...
చెన్నూరు: రాష్ట్రప్రభుత్వం చంద్రన్న బీమా పథకం కింద అర్హులైన వారందరూ బీమాపథకానికి దరఖాస్తు చేసుకోవాలని ఎండివో వెంకటరమణారెడ్డి సూచించారు. సోమవారం ఎండివో సభాభవన్‌లో చంద్రన్న బీమాపథకం పై అవగాహన కార్యక్రమం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.15లు బీమా దరఖాస్తు నిర్ణీత రుసుం నిర్ణయించారని ఈ పథకం ద్వారా రూ.15వేలు లోపు ఆర్థిక సంపాదన ఉన్న వారు దరఖాస్తులు చేసుకోవచ్చునని చెప్పారు. చంద్రన్న బీమా పథకాన్ని వెలుగు ఇఓలకు అప్పగించడం జరిగిందని ఇప్పటికే ఆయా గ్రామ పంచాయతీల్లో వెలుగు ద్వారా చంద్రన్న పథకంపై ప్రజలకు గ్రామసభలు నిర్వహించి వారి పేర్లు నమోదు చేయాలని సూచించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వెలుగు ఏపిఓ బాలస్వామి, ఎండివో సిబ్బంది పాల్గొన్నారు.
ఖాజీపేటలో...
ఖాజీపేట: మండలంలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న కార్మికులంతా చంద్రన్న బీమాను సద్వినియోగం చేసుకోవాలని మండల అభివృద్ధి అధికారి ఉషారాణి తెలిపారు. స్థానిక వెలుగు కార్యాలయంలో సోమవారం మహిళలతో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ 18సంవత్సరాల నుంచి 70సంవత్సరాల వయస్సు కలిగిన ప్రతి కార్మికుడు రూ.15లు రుసుం చెల్లించి బీమా సభ్యత్వం పొందాలన్నారు. ఈ బీమా ద్వారా పలుప్రయోజనాలు ఉన్నాయన్నారు. జూన్ 30వ తేదిలోపు ఈ అవకాశం ఉంటుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని కూలీలను, అప్రమత్తం చేయాల్సిన బాధ్యత డ్వాక్రా మహిళలపైనే ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఏపిఎం శ్రీనివాసులు, శ్రీనిధి రాష్టక్రార్యదర్శి నిర్మల పాల్గొన్నారు.