కడప

చంద్రన్న బీమా కార్మిక కర్షకులకు ధీమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కమలాపురం,మే 30: జిల్లాగ్రామీణాభివృద్ధి సంస్థ జిల్లాసమాఖ్య ఇన్సురెన్స్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రాష్ట్రంలోని అసంఘటిత కార్మికులకోసం ఏర్పాటుచేసిన చంద్రన్న బీమా పథకం కార్మిక కర్షకులకు ధీమా అని ఎంపిడివో ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం స్థానిక ఐకెపి కార్యాలయంలో మండల మహిళా సమాఖ్య శిక్షణ శిబిరంలో మాట్లాడుతూ చంద్రన్న బీమా పథకం 19సంవత్సరాల నుంచి 70సంవత్సరాల వరకు వయస్సున్న అసంఘటిత రంగ కార్మికులకు ఎంతో ఉపయోగమన్నారు. బీమా నమోదుపై బీమా సేవల నిమిత్తమై నమోదుచేసుకున్న వారు ఏడాదికి రూ.15లు చెల్లించి అర్హత పొందాలన్నారు. 15 ఏళ్ల నుంచి 50 ఏళ్లు నమోదుకాబడిన వారు ప్రమాదవశాత్తు మరణం, పూర్తి అంగవైకల్యం సంభవిస్తే రూ.5లక్షలు, పాక్షికంగా వైకల్యం వస్తే రూ.3లక్షలు ఉంటుందన్నారు. వ్యవసాయరంగంలో ,పారిశ్రామిక వాడల్లో అణగారిన కుటుంబాలకు ఈ పథకం మేలు చేస్తుందన్నారు. జూన్ 1 నుంచి 30వరకు గ్రామసమైఖ్యల్లో చంద్రన్న బీమా పథకంలో తమ పేర్లు నమోదుచేసుకోవాలని సూచించారు. స్థానిక స్ర్తి శక్తి భవన్‌లో ఈకార్యక్రమంపై శిక్షణను అధికారులు నిర్వహించారు. ఇందులో కార్మిక శాఖ అధికారి పలు సూచనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐకెపి ఏపిఎం జగదీశ్వరీ, ఉపాధి ఏపిఓ గరుడాచలం, సిసిలు బాబు, ఓబులేసు, గంగరాజు పాల్గొన్నారు.