కడప

చరిత్రకు ఆనవాలైన బౌద్ధారామాలు అభివృద్ధికి నోచుకోవా.!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందలూరు, మే 30:విభిన్న మతాలు, సంస్కృతికి నిలయమైన మనదేశంలోని రాయలసీమ ప్రాంతంలో అరుదుగా ఉన్న నందలూరు మండలంలోని ఆడపూరు వద్ద ఉన్న బౌద్దారామాలు యేళ్లు గడుస్తున్నా అభివృద్ధికి నోచుకోలేదు. 1, 2 శతాబ్దంలో ఇక్కడ బౌద్దులు నివాసం ఉండినట్లు చరిత్ర చెబుతుంది. 1913లోనే బ్రిటిష్ పరిశోధకులు ఏపి లాంగ్‌హర్స్ ఇక్కడ బౌద్దారామాలు ఉన్నాయని గుర్తించారు. 1978-80లో రాష్ట్ర పురావస్తు శాఖ బౌద్దారామాల వద్ద త్రవ్వకాలు సాగించారు. ఇక్కడ ఒక మహాస్ధూపం, 21 స్మారక స్ధూపాలు లభ్యమయ్యాయి. వాటితో పాటు విహారం, ఎన్నో కళాఖండాలు శాతవాహానులు, మహారథుల కాలం నాటి 1650 సీసపు నాణెలు, అప్పట్లో బౌద్దులు వాటిని పాత్రలు, బుద్ద పాలఫలకం, అనేక చరిత్ర చాటే ఇనుప వస్తువులు బయల్పడ్డాయి. రాయలసీమ ప్రాంతంలో బౌద్దమతాన్ని తెలిపే ఈ బౌద్దారామాలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇటీవల కలెక్టర్ కెవి రమణ, పురావస్తు శాఖ అధికారులు ఈ బౌద్దారామాలను సందర్శించి వాటిని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. ఇటీవల బుద్దుని 2560 జయంతి ఉత్సవాలను జిల్లా పర్యాటక అభివృద్ధి సంస్థ ఇక్కడ ఘనంగా నిర్వహించింది. ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించి పర్యాటక రంగంగా అభివృద్ధి చేయాలని వారు ప్రభుత్వానికి నివేదించారు. బౌద్దారామాల వద్ద ఏలాంటి సెక్యూరిటీ లేక పోవడంతో అసాంఘిక కార్యక్రమాలకు ఎవరు అడ్డుకట్ట వేయలేక పోతున్నారు. చరిత్రను చాటే బౌద్దుల గృహాతో పాటు ఈ బౌద్దారామాలను కపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికులు అంటున్నారు. గతంలో ఇక్కడ వాచ్‌మెన్ ఉండేవాడని, ప్రస్తుతం ఎవరు లేక పోవడంతో పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన గదుల వద్ద అనేక మంది మద్యం సేవిస్తూ, అసాంఘిక చర్యలకు అడ్డాగా మార్చారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బౌద్దారామాలకు వచ్చే పర్యాటకులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించి ఈ బౌద్దారామాలను అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు.