కడప

ఆలయాలు నిర్మించడం పూర్వజన్మ సుకృతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కమలాపురం,మే 30: ఆలయాలను నిర్మించడం పూర్వజన్మ సుకృతమని అందరికీ ఆ అదృష్టం కలగదని స్వర్ణహంపి పీఠాధిపతి గోవిందానందస్వామి పేర్కొన్నారు. ఆయన సోమవారం మండల పరిధిలోని రామాపురం గ్రామంలోని మోక్షనారాయణస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ వ్యవస్థాపకులు సాయినాథశర్మ, వేదపండితులు మారుతీ శర్మ, కిరణ్‌లు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన ఆలయంలోని మోక్షనారాయణస్వామి, వల్లీ దేవసేన సమేత సుబ్రమణ్యస్వామి, మహాలక్ష్మి, ఆంజనేయస్వాములకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణంగా కొత్తగా చెక్కబడిన శిల్పాలకు ఆలయాలు నిర్మించడం జరుగుతోందన్నారు. అయితే 1500 సంవత్సరాల నాటి క్రితం శిధిలమైపోయిన ఆలయంలోని మూలవిరాట్‌లకు మళ్లీ ఆలయాలను నిర్మించి పూర్వవైభవాన్ని తీసుకురావాడం గొప్ప విషయమని ఆయన కొనియాడారు. ఇక్కడ నెలకొన్న మూలవిరాట్‌లు మహత్తయిన మూర్తులని ఇక్కడ దర్శించుకుని పూజలు నిర్వహించడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు.
ఆలయంలో నిత్యకళ్యాణం, నిత్యాన్నదానాలు నిర్వహించడం గొప్పవిషయమన్నారు. ఈ కార్యక్రమంలో హిందుధర్మ ప్రచార పరిషత్ సభ్యులు రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.