కడప

పవిత్ర పుణ్యక్షేత్రం గండి వీరాంజనేయ క్షేత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,(కల్చరల్)మే 30: గండిలో కొలువైన ఆంజనేయుడి విగ్రహాన్ని సాక్షాత్తు శ్రీరామచంద్రుడే తన బాణపు కొనతో మొలిచాడని పురాణ కథలు స్పష్టం చేస్తున్నాయి. రావణాసురుడు సీతను అపహరించి, లంకకు తీసుకుపోయిన తర్వాత సీతను అనే్వషిస్తూ వచ్చిన రామలక్ష్మణులకు వాయుదేవుడు ఆతిథ్యమిచ్చినట్లు పురాణ కథలలో ఉంది. అలాగే లంకకు వెళ్లి విజయంతో వచ్చిన సీతారామలక్ష్మణులకు రెండు కొండల మధ్య బంగారపు విజయతోరణాన్ని కట్టి వాయుదేవుడు స్వాగతం ఇచ్చినట్లు స్థల పురాణం చెబుతోంది. ఈ బంగారు విజయతోరణం నేటికీ పవిత్రులకు దర్శనమిస్తుందని పెద్దలు చెబుతున్నారు. హనుమత్ జయంతి పురస్కరించుకుని మంగళవారం వేలాది మంది భక్తులు శ్రీశ్రీశ్రీ గండివీరాంజయస్వామిని దర్శించుకుంటారు. కడప జిల్లాలోని పుణ్యక్షేత్రాలలో శ్రీగండి వీరాంజనేయస్వామి క్షేత్రం ఒకటి. ఈ పుణ్యక్షేత్రం కడపజిల్లా చక్రాయపేట మండలం మారెళ్లమడక సమీపంలోని పాపాఘ్ని నదీ తీరాన వెలిసి వుంది. కాగా కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాలలో వ్యాపించి వున్న పాలకొండల పర్వత పంక్తికి ఈప్రాంతంలో గండి పడింది. రెండు కొండల నడుమ పాపాఘ్ని నది పారుతున్న ప్రదేశం కనుక ఈ ప్రాంతాన్ని గండిక్షేత్రంగా పిలుస్తున్నారు. అక్కడ నెలకొని ఉన్న ఆంజనేయుడికి శ్రీగండి వీరాంజనేయస్వామి అని నామధేయం వచ్చింది. పాలకొండల పర్వత పంక్తికి పురాణ ఇతిహాసాలలో విశేషమైన స్థల పురాణం ఉంది. ఈ పర్వత శ్రేణిని శేషాచల పర్వత పంక్తిగా పిలుస్తారు. ఆదిశేషుడు అవతారమే ఈ శేషాచల పర్వతాలు. శిరోభాగం తిరుపతి కాగా, తోక కొన గండి వీరాంజనేయస్వామి క్షేత్రమని భక్తులు పిలుస్తున్నారు. శేషాచల పర్వత పంక్తికి గండిక్షేత్రం వద్ద తప్ప మరెక్కడా గండి పడిన దాఖలాలు లేవు. కర్నాటక రాష్ట్రం చింతామణి జిల్లాలోని నందికొండల నుంచి ప్రారంభమైన పాపాఘ్ని నది పరమపుణ్య దాయినిగా పేరొందింది. పురాణాలలో నది గురించి 3నంది పాదసము ద్భూతా పాపాఘ్ని పుణ్యదాయిని2 అని పేర్కొనబడింది. ప్రజల పాపాలు హరింపచేసే పవిత్రత ఈ నదికి ఉందనే భావనతోనే ఈ నదికి పాపాఘ్ని అని పేరు వచ్చిందని ప్రతీతి. ఇంతటి పవిత్ర పుణ్యస్థలంలో వెలసివున్న గండివీరాంజనేయస్వామి క్షేత్రం ఈప్రాంత ప్రజలకే కాక, ఇతర రాష్ట్రాల ప్రజలకు ఆరాధ్యమైంది. ఇక్కడ కొలువైన ఆంజనేయుడి విగ్రహాన్ని సాక్షాత్తు శ్రీరామచంద్రుడే తన బాణపు ములికి కొనతో మొలిచాడని పురాణ కథలు స్పష్టం చేస్తున్నాయి. స్థల పురాణ కథలను గమనిస్తే ఇది వాయుక్షేత్రాలలో ఒకటిగా చెప్పబడుతుంది. త్రేతాయుగంలో ఆంజనేయుని తండ్రి అయిన వాయుదేవుడు ఈ గండి ప్రాంతంలో తపస్సు చేసుకునే వాడు. రావణాసురుడు సీతను అపహరించి, లంకకు తీసుకుపోయిన తర్వాత సీతను అనే్వషిస్తూ వచ్చిన రామలక్ష్మణులకు వాయుదేవుడు ఆతిధ్యమిచ్చినట్లు పురాణ కథలలో ఉంది. లంకకు వెళ్లి విజయంతో వచ్చిన సీతారామలక్ష్మణులకు రెండు కొండల మధ్య బంగారపు విజయతోరణాన్ని కట్టి వాయుదేవుడు స్వాగతం ఇచ్చినట్లు స్థల పురాణం చెబుతోంది. ఈ బంగారు విజయతోరణం నేటికీ పవిత్రులకు దర్శనమిస్తుందని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ విధంగా రావణ సంహారానంతరం తిరిగి వచ్చిన రాముడు సీత కోరిక మేరకు ఒక రాత్రిలో తన బాణపు ములికితో కొండకు హనుమంతుని విగ్రహం చెక్కినట్లు స్థల పురాణంలో పేర్కొన్నారు. కాగా విగ్రహానికి కుడిచేయి చిటికెన వేలు చెక్కలేదు. సీతతో ఒక రాత్రిలో హనుమంతు విగ్రహాన్ని చెక్కుతానని చెప్పిన శ్రీరాముడు ఆ వేలి వరకు చెక్కే సమయానికి తెల్లవారి పోవడంతో అసంపూర్ణంగా విరమించినట్లు చెబుతున్నారు. ప్రకృతి సౌందర్యాల దృశ్యాలతో గండిక్షేత్రం విరజిల్లుతోంది. ఇక్కడి పాపాఘ్ని నదిలో యాత్రికులు స్నానం చేసి, మానసిక ప్రశాంతత పొందుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈప్రాంత అడవులలో అనేక రకాల ఔషద మొక్కలను, వనమూలికలు కూడా విరివిగా లభ్యమవుతాయి. అలాగే ప్రతి సంవత్సరం శ్రావణ మాస శనివారాలలో శ్రీగండి వీరాంజనేయస్వామి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు జిల్లాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాదిమంది భక్తులు పాల్గొని స్వామిని దర్శించుకుంటారు.