కడప

భ్రూణ హత్యల నివారణ కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,మే 30: జిల్లా అధికారులు భ్రూణ హత్యల నివారణ చట్టాన్ని సమగ్రవంతంగా అమలుచేసి ఆడపిల్లలను రక్షించాలని, అలాగే వారిని చదివించి ఉన్నత స్థానాలకు తీసుకెళ్లాలని కలెక్టర్ కెవి సత్యనారాయణ సంబంధిత అధికారులను, తల్లిదండ్రులను ఆదేశించారు. సోమవారం ఉదయం స్థానిక సభాభవన్‌లో బేటీ బచావో-బేటీ పడావో కార్యక్రమంపై బ్రోచర్ విడుదల చేశారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ పథకాన్ని భారత ప్రభుత్వ మహిళా శిశుసంక్షేమశాఖ అమలుచేస్తోందన్నారు. ఈ చట్టాన్ని పకడ్బంధీగా అమలు చేయడం ద్వారా భృణహత్యలు అరికట్టవచ్చునని, తద్వారా బాలికల నిష్పత్తిని గణనీయంగా పెంచేందుకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. జిల్లాలో 20గ్రామ పంచాయతీల్లో ఆడపిల్లల నిష్పత్తి చాలా తక్కువ ఉన్నట్లు గుర్తించామన్నారు. ఆ ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టి ఈవ్యత్యాసాన్ని తొలగించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. సమగ్ర బాలల పరిరక్షణ పథకాన్ని అమలు పరిచి బాలబాలికల వ్యత్యాసాన్ని రూపుమాపేందుకు చర్యలు తీసుకున్నట్లు వారు తెలిపారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు ప్రతి 1000 మంది బాలురలో 942 మంది బాలికలు ఉన్నారని, దీన్ని ఇంకా పెంచాల్సిన అవసరం ఉందన్నారు. బ్రూణహత్యల నివారణ చట్టాన్ని సమగ్రంగా అమలుచేయాలని, బేటీ బచావో -బేటీ పడావో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఈసమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ శే్వత తెవతియ, జెసి -2 శేషయ్య,డిఆర్వోసులోచన, ఐసిడిఎస్ పిడి రాఘవరావు, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ శివప్రసాద్‌రెడ్డి తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.