కడప

ఇక ఇండోర్ విద్యుత్ ఉపకేంద్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,మే 30: జిల్లాలో ఇండోర్ విద్యుత్ ఉపకేంద్రాలు ఏర్పాటు చేసి తద్వారా నాణ్యమైన విద్యుత్ సరఫరాకు అధికారులు చర్యలు చేపట్టారు. కృష్ణపట్నం, సింహాద్రి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుంచి జిల్లాకు సరఫరా అయ్యే విద్యుత్‌లో సాంకేతిక లోపాలు ఏర్పడిన అనంతరం ఇండోర్ విద్యుత్ కేంద్రాల పరిధిల్లోని సబ్‌స్టేషన్లలో విద్యుత్‌ను ఇచ్చేవారు. వ్యవసాయానికి, గృహాలు, కమర్షియల్, పరిశ్రమల కనెక్షన్లకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ఇండోర్ విద్యుత్‌తోపాటు సోలార్, గాలిమర్రల విద్యుత్ కూడా వినియోగదారులకు సరఫరా చేసేందుకు గట్టి చర్యలు తీసుకుంది. ప్రప్రథమంగా కడప, ప్రొద్దుటూరు పట్టణాల్లో ఇండోర్ ఉప విద్యుత్ కేంద్రాలు ఏర్పాటుచేసేందుకు ఒక్కొక్క కేంద్రానికి రూ.3కోట్లు ఖర్చు పెట్టనున్నారు. ఇప్పటికే విద్యుత్ వినియోగం తగ్గించేందుకు జిల్లాలో 5లక్షలు పైబడి ఎల్‌ఈడి బల్బులు సరఫరా చేశారు. జిల్లాలో విద్యుత్ వినియోగం కూడా రోజురోజుకు పెరుగుతోంది. జిల్లా వ్యాప్తంగా 12.7 మిలియన్ల యూనిట్లు ప్రభుత్వం కేటాయించగా వినియోగదారులు 12.3 మిలియన్ల యూనిట్లు వినియోగిస్తున్నారు. క్రమేపీ విద్యుత్ వినియోగం తగ్గించేందుకు ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ సబ్‌స్టేషన్లు నిర్మాణం నిమిత్తం రూ.30కోట్లు ప్రభుత్వం కేటాయించింది. విద్యుత్ వినియోగం తగ్గుముఖం పట్టడం కేతిక కారణాలే ప్రధానమని అధికారులు ప్రత్యక్షంగా చెబుతున్నారు. గతంలో జిల్లాలో రాయచోటి ప్రాంతంలో రూరల్ ఎలక్ట్రికల్ సఫ్లై కార్పొరేషన్ ద్వారా మూడుదశాబ్ధాలు పైబడి గ్రామీణ సంస్థకు విద్యుత్‌శాఖ బాధ్యతలు అప్పగించారు. రెస్కో ఇష్టారాజ్యంగా వ్యవహరించి ప్రభుత్వంపై భారం వేసింది. రెస్కోను ట్రాన్స్‌కోలోకి విలీనం చేయడంతో ట్రాన్స్‌కో అధికారులు తీసుకుంటున్న చర్యలతో ఇప్పుడిప్పుడే గాడితప్పిన రెస్కో కుదుటపడుతోంది. జిల్లా వ్యాప్తంగా ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా 46వేల కనెక్షన్ల ద్వారా విద్యుత్ వినియోగం చేసుకుంటున్నారు. వాటిని కూడా దీనదయాల్ పథకం ద్వారా సర్వీసులు క్రమబద్దీకరణకు విద్యుత్ శాఖ అధికారులు ప్రజల్లో చైతన్యం తీసుకుని వస్తున్నారు. వేసవికాలంలో కూడా విద్యుత్ వినియోగం అధికంగా ఉన్నా విద్యుత్ సరఫరా వినియోగదారులకు ఎటువంటి ఇక్కట్లకు గురిచేయకుండా యధేచ్చగా సరఫరా చేస్తున్నారు. విద్యుత్ వాడకంలో పలువురు బడానేతలు , అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండటంతో వాటికి కూడా జిల్లా అధికారులు కళ్లెం వేశారు. అలాగే విద్యుత్ అక్రమకనెక్షన్ల దారులపై అధికారులు పకడ్బంధీగా కొరఢా ఝళిపిస్తున్నారు. విద్యుత్ వినియోగం పెరుగుతుండటంతో ఇండోర్ విద్యుత్ ఉపకేంద్రాలకు జిల్లాలో విద్యుత్‌శాఖ అధికారులు శ్రీకారం చుట్టారు.