కడప

5న దూదేకుల యువగర్జన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప(కల్చరల్), జూన్ 2:ఆంధ్రప్రదేశ్ నూర్‌బాషా, దూదేకుల బిసి ముస్లిం సంక్షేమ సంఘం నిర్మాణ సారథ్యంలో నూర్‌బాషా, దూదేకుల ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఈనెల 5న కర్నూలులోని రావూరి గార్డన్‌లో జరిగే దూదేకుల యువగర్జనకు జిల్లా నుంచి పెద్ద ఎత్తున యువత తరలిరావాలని ఏపి నూర్‌బాషా సంక్షేమసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుంకేసుల ఖాదర్‌బాషా, నాయకులు డి.జి.అక్బర్ అలీ, కె.బాబా ఫకృద్దీన్, బి.సుభాన్‌లు పిలుపునిచ్చారు. స్థానిక వైఎస్సార్ ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రధానంగా దూదేకుల యువగర్జనకు సంఘం జాతీయ నాయకులు డి.చమన్‌సాహెబ్, షేక్ సత్తార్ సాహెబ్, రాష్ట్ర అధ్యక్షుడు నాగూర్‌మీరాతోపాటు పలువురు రాష్ట్ర నాయకులు హాజరౌతారన్నారు. ముఖ్యంగా గర్జనలో దూదేకులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారాలు, మన హక్కుల కోసం తీసుకోవాల్సిన నిర్ణయాలపై ప్రసంగిస్తారన్నారు. కాగా సంఘం ఎన్‌ఆర్‌ఐ అధ్యక్షుడు నూర్‌బాషా సలీ ఆధ్వర్యంలో యువగర్జన జరుగుతుందన్నారు. ప్రధానంగా మన సమస్యలైన దూదేకుల బిసి కమిషన్ ప్రకారం బిసి -ఇ 4శాతం నుంచి 10శాతానికి పెంచి అందులో మనకు 50శాతం కేటాయించాలన్నారు. కులం పేరు నూర్‌బాషా ముస్లింగా మార్చాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. నూర్‌బాషా ఫెడరేషన్‌కు కార్యరూపం ఇవ్వాలని, రెండు ఎమ్మెల్సీలు, రెండు కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. అలాగే వక్ఫ్‌బోర్డు , హజ్‌కమిటీ, ఉర్దూ అకాడమి, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్‌లో భాగస్వామ్యం చేయాలన్నారు. రాష్ట్ర రాజధానిలో రాష్ట్ర కమిటీకి 5 ఎకరాలు స్థలం కేటాయించాలని, ముఖ్యపట్టణాల్లో కమ్యూనిటీ హాళ్లకు, హాస్టళ్లకు, స్మశాన వాటికలకు వక్ఫ్‌బోర్డు స్థలాలు కేటాయించాలన్నారు. మైనార్టీ విద్యాసంస్థల్లో దామాషా ప్రకారం సీట్లు కేటాయించాలని, కుల వృత్తికి ప్రోత్సా హం, కళాకారులకు పెన్షన్ ఇవ్వాలన్నారు. పోటీ పరీక్షలైన ఆల్ ఇం డియా సర్వీసెస్, ఎంసెట్, ఐఐటి, జెఇఇ రాష్ట్ర ఉద్యోగులకు ప్రత్యేక శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. విదేశాల్లో విద్యార్థులు పై చదువులు కోసం ప్రత్యేక స్కాలర్‌షిప్‌లు మంజూరు చేయాలని, మైనార్టీ బడ్జెట్‌ని పెంచి, అందులో దామాషా ప్రకారం 50శాతం దూదేకుల వారికి కేటాయించాలని డిమాండ్ చేశారు. దూదేకుల, నూర్‌బాషా కులానికి ముస్లిం మైనార్టీ స్టేటస్ వర్తించే విధంగా జిఓ విడుదల చేసి అన్ని విద్యాసంస్థలకు, ప్రభుత్వ కార్యాలయాలకు అందజేయాలన్నారు. యువగర్జనకు యువకులు పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని వారు కోరారు.