కడప

పరిశ్రమల స్థాపనకు త్వరగా అనుమతులు ఇవ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప(కల్చరల్), జూన్ 2:జిల్లాలో పరిశ్రమల స్థాపనకు సింగిల్ డెస్క్ పాలసీ కింద ఆన్‌లైన్ ద్వారా అందిన దరఖాస్తులను నిర్ణీత గడువు లోగా పరిష్కరించి పరిశ్రమల స్థాపనకు అనుమతులు జారీ చేయాలని కలెక్టర్ కెవి సత్యనారాయణ పేర్కొన్నారు. గురువారం సాయంత్రం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో పరిశ్రమల అభివృద్ధి కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అవసరమైన అన్ని వౌళిక వసతులు పుష్కలంగా ఉన్నాయన్నారు. కొప్పర్తి పారిశ్రామిక వాడలో 7 ఎకరాల భూమి సిద్ధంగా ఉందని తెలిపారు. ఫుడ్‌ప్రాససింగ్ పరిశ్రమల ఏర్పాటుకు మంచి అవకాశాలు ఉన్నాయని, జిల్లాలో పరిశ్రమల స్థాపనకు వచ్చే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు వారు కోరిన అనుమతులను సంబంధిత శాఖాధికారులు ప్రభు త్వం విధించిన గడువులోపు అనుమతులు జారీ అయ్యేలా సమన్వయంతో పనిచేయాలన్నారు. కాగా పెట్టుబడి రాయితీ కింద 8యూనిట్లకు రూ.51 లక్షల 77వేలు , విద్యుత్ చార్జీల రాయితీ కింద 4 యూనిట్లకు రూ.12లక్షల 60వేలు ,అమ్మకం పన్నురాయితీ కింద ఒక యూనిట్‌కు రూ.18లక్షల 62వేలు , పావలా వడ్డీ కింద 3 యూనిట్లకు రూ.20లక్షల 19వేలు, స్టాంప్ డ్యూటి రాయితీ కింద ఒక యూనిట్‌కు రూ.2లక్షల 92వేలు రాయితీని ఈసమావేశంలో కమిటీ మంజూరు చేసింది. సింగిల్ డెస్క్ పాలసీ కింద 11 కొత్త యూనిట్లకు అనుమతి ఇవ్వడం జరిగింది. మొత్తంగా 17యూనిట్లకు వివిధ రాయితీల కింద కోటి 6లక్షల 12వేలు రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఈసమావేశంలో పరిశ్రమలశాఖ ఇన్‌చార్జి జనరల్ మేనేజర్ జయలక్ష్మి, ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరు నరేంద్రబాబు, ఏపిఐఐసి జోనల్ మేనేజర్ రమణారెడ్డి, సాంఘిక సంక్షేమశాఖ డిడి సరస్వతి, టౌన్ అండ్ ప్లానింగ్ కంట్రి శైలజ, ఏపిఎఫ్‌ఎస్‌సి బ్రాంచ్ మేనేజర్ రాజేంద్రరెడ్డి పాల్గొన్నారు.