కడప

నవ్యాంధ్రకోసం అహర్నిశలు కృషి చేద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప(క్రైమ్), జూన్ 2:తెలుగు రాష్ట్రాలు విడిపోయి నేటికి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో ప్రజలందరూ అహర్నిశలు కృషి చేస్తూ నవ్యాంద్ర నిర్మాణానికి పాటుపడాలని జిల్లా ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ పిలుపునిచ్చారు. గురువారం పోలీసు ప్రధాన కార్యాలయ ఆవరణంలో నవనిర్మాణ దీక్ష కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. పో లీసు అధికారులతో నవనిర్మాణ దీక్ష ప్రతిజ్ఞ చేయించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నవ్యాంధ్ర కోసం అహర్నిశలు కృషి చేసి రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపాలన్నారు. రాష్టవ్రిభజన ప్రజలు కోరుకున్నది కాకపోయినా దీన్ని ఒక పీడ కలగా మరచిపోవాలన్నారు. ప్రసు తం మనముందుండేది అభివృద్ధి మాత్రమేనని అభివృద్ధి కాంక్షతో అధికారులు, నేతలు అన్నివర్గాల ప్రజలు దృఢదీక్షతో కృషి చేస్తేది సాధించలేనిదంటూ ఏముండదన్నారు. జరిగినదాన్ని గురించి తలచుకుని బాధపడేకంటే చేయాల్సిన పని సక్రమంగా నిర్వహిస్తే ఎంతటి విజయాన్ని అయినా సాధించవచ్చునన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో పోలీసులు ఎంతో సహనంగా వ్యవహరించి సహకరించారన్నారు. రాష్ట్రం విడిపోవడం పోలీసులకు కూడా చాలా బాధించిందన్నారు. ఈకార్యక్రమంలో ఓఎస్‌డి ఆపరేషన్స్ సత్యయేసుబాబు, ఏఆర్ డిఎస్పీ మురళీధర్, ఎస్‌బి డిఎస్పీ రాజగోపాల్‌రెడ్డి, ఆర్‌ఐలు హరికృష్ణ, సత్యగోపాల్ , ఆర్‌ఎస్‌ఐలు, డిపిఓలు, సిబ్బంది పాల్గొన్నారు.