కడప

నేటి నుంచి రంజాన్ దీక్షలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,(కల్చరల్)జూన్ 6: నేటి నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం కానున్నాయి. సర్వకాల సర్వావస్థలో మనిషి నిర్వహించాల్సిన విద్యుక్త ధర్మాలను ప్రబోధం చేస్తూ మానవాళికి మోక్షమార్గం చూపే పవిత్ర రంజాన్ మహ్మద్ ప్రవక్త ప్రవచించిన ఇస్లాం ప్రభోధనాలు, సూత్రాలు, పవిత్ర ఐతిహాసిక సంభవాలను మననం చేసుకునే పుణ్యదినాలు ప్రారంభమైనట్లు సోమవారం నాటి నెలవంక దర్శనం ప్రకటించింది...నెలవంక భాగ్యదర్శనంతో నెలరోజుల నాటి ఉపవాస వ్రతానికి మంగళవారం నుంచి శ్రీకారం చుట్టారు. నెలరోజుల వరకు కఠోరదీక్షలు, అల్లాహ్ ప్రార్థనావళితో నిమగ్నమయ్యే 3రంజాన్2 మాసానికి మహమ్మదీయులు సంసిద్ధులయ్యారు. వయస్సు నిమిత్తం లేకుండా ఉపవాసాలు ఉండటానికి చిన్నలు, పెద్దలు దీక్షకు పూనుకున్నారు. ఇస్లాం గురువులు, పీఠాధిపతులు, మతపెద్దల ప్రవచనాల ప్రకారం రంజాన్ నెల తదుపరి నిర్వహించే ఈదుల్ ఫితర్ పండుగ అత్యంత పవిత్రమైంది...ప్రతి మహ్మదీయుడు ఇస్లాం మత మార్గదర్శనాలతో పాటు హజరత్ మహమ్మద్ ప్రవక్త నిర్ధేశికత్వంలో జీవితాన్ని ధార్మికపరంగా సుసంపన్నం చేసుకునేందుకు నెలరోజులపాటు ఉండే నిష్కళంక మాసం రంజాన్. అత్యంత భక్తి ప్రపత్తులతో కొనసాగే ఉపవాసాలు ఉండే (రోజేదార్ల) పవిత్ర మాసంగా ఈ పండుగను వర్ణిస్తున్నారు. కాగా ఇస్లాం నిర్ధేశించే మానవత, మమత, సమతల సారాంశాన్ని తమ జీవితాల్లో ఇనుమడింప చేసుకునేందుకు మహ్మదీయులకు రంజాన్ మాసం ఓ సువర్ణావకాశం.

8న మహాసంకల్ప ముగింపు సభ

ఆంధ్రభూమి బ్యూరో
కడప,జూన్ 6: ముఖ్యమంత్రిగా ఎన్.చంద్రబాబునాయుడు బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా నవనిర్మాణంలో ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు గత వారంరోజులుగా చేపట్టిన నవనిర్మాణ దీక్షలు బుధవారం ముగియనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రానున్నారు. రాష్టవ్య్రాప్తంగా నవనిర్మాణ దీక్షలను పెద్ద ఎత్తున పూర్తిచేయడం, ప్రజలు, అధికారులు, అనధికారులను ఆ నిర్మాణంలో భాగస్వామ్యులను చేసేందుకు ముఖ్యమంత్రి ప్రతి ఒక్కరిచేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ నేపధ్యంలో మహాసంకల్ప సభ కడప జిల్లా కేంద్రంలో బహిరంగ సభతో ముగియనుంది. ఈమేరకు కలెక్టర్ కెవి సత్యనారాయణ గత మూడురోజులుగా జిల్లాలోని అన్ని శాఖల అధికారులతో సమీక్షలు ఏర్పాటుచేసి ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, కొరత లేకుండా ముగింపు సభకు వచ్చే ప్రజలను చూడాలన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకు డిఎంహెచ్‌ఓ, ట్రాన్స్‌కో, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యుఎస్, ఆర్‌అండ్‌బి, మైక్రో ఇరిగేషన్, డ్వామా, డిఆర్‌డిఏ, మెప్మా, రాజీవ్ విద్యామిషన్ ప్రాజెక్టు డైరెక్టర్లు, రవాణాశాఖ అధికారులకు బాధ్యతలు అప్పగించి, డిపిఓ, జెడ్పి సిఇఓ, ఎంపిడివోలు, వెలుగు అధికారులు, సిబ్బందికి జనసమీకరణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో జిల్లా వ్యాప్తంగా మహాసంకల్ప సభకు పెద్ద ఎత్తున జనాలు తరలిరానున్నారు.
ముఖ్యమంత్రి పర్యటన వివరాలు
రాష్టమ్రుఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు ఈనెల 8న కడప మున్సిపల్ మైదానంలో జరిగే మహాసంకల్ప సభలో పాల్గొనేందుకు వస్తున్నారని జిల్లా రెవెన్యూ అధికారిణి సులోచన తెలిపారు. ముఖ్యమంత్రి 8న సాయంత్రం 4.05 గంటలకు కడప మున్సిపల్ స్టేడియంకు చేరుకుంటారన్నారు. సాయంత్రం 4.15 గంటల నుంచి సాయంత్రం 6.15 గంటల వరకు ముఖ్యమంత్రి మహాసంకల్ప సభలో పాల్గొని రాత్రి ఆర్‌అండ్‌బి గెస్ట్ హౌస్‌లో బస చేస్తారన్నారు. 9వ తేదీ ఉదయం కడప విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో బయలుదేరి గన్నవరం విమానాశ్రయం వెళతారని డిఆర్వో వివరించారు.

వేగంగా రాష్ట్భ్రావృద్ధి..

ఆంధ్ర భూమి బ్యూరో
కడప,జూన్ 6: రాష్ట్ర విభజన అనంతరం ఆర్థిక లోటు ఉన్న సిఎం చంద్రబాబు విశేష కృషి వల్ల రాష్ట్రం వేగంగా అభివృద్ధి సాధిస్తొందని కలెక్టర్ సత్యనారాయణ పేర్కొన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నవనిర్మాణదీక్ష సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో 5వ రోజు పారిశ్రామిక రంగంపై చర్చించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతం వృద్ధిరేటులో వేగంగా పయనిస్తోందన్నారు. వ్యవసాయ రంగంలో 8శాతం, పరిశ్రమల రంగంలో 11శాతం, సేవారంగంలో 11శాతం వృద్ధిసాధించామన్నారు. జాతీయ స్థాయిలో సాధించిన సరాసరి వృద్ధికంటే ఆంధ్రప్రదేశ్ వృద్ధిరేటు అధికంగా ఉందన్నారు. జాతీయస్థాయిలో 7.4శాతం ఉంటే మన రాష్ట్ర 10.99శాతం ఉందన్నారు. విశాఖపట్టణానికి చాలా పరిశ్రమలు తెచ్చి ఇండస్ట్రి హబ్‌గా చేసేందుకుప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. అలాగే రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ఎక్కువ అనువైన వాతావరణ వనరులు ఉంటే ఆ ప్రాంతాన్ని పరిశ్రమల పరంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. విశాఖ, చెన్నై క్యారిడార్ చెన్నై - బెంగళూరు కారిడార్‌లు రాబోతున్నాయని దీనివల్ల రూ.40లక్షల కోట్లు పెట్టుబడులు భారతదేశానికి రానున్నాయన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల రంగాన్ని అభివృద్ధిచేసేందుకు వౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని వారు పేర్కొన్నారు. సమావేశంలో రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్‌నాయుడు మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా ఏపిలో పరిశ్రమల రంగంలో అభివృద్ధి ఆగిపోయిందని, రాష్ట్రం విడిపోయాక ముఖ్యమంత్రి పరిశ్రమల అభివృద్ధికి శ్రీకారం చుట్టారన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు పారిశ్రామికవేత్తలు ముందుకువస్తున్నారని ఇక్కడ ప్రోత్సాహకాలు, సబ్సిడీలు బాగున్నాయన్నారు. ప్రస్తుత రోజుల్లో భారతదేశానికి పరిశ్రమలు స్థాపించేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తున్నారన్నారు. ఏపిఐఐసి జనరల్ మేనేజర్ రమణారెడ్డి మాట్లాడుతూ ప్రతి జిల్లాలో లక్ష ఎకరాలు పరిశ్రమలకోసం కేటాయించాలని ప్రభుత్వం ఆదేశించిందని జిల్లాలో 90వేల 700 ఎకరాలు గుర్తించడమైనదన్నారు. ఇందులో 6500 ఎకరాలు కొప్పర్తిలో సిద్దంగా ఉందని, పరిశ్రమల స్థాపనకు, నీటి సరఫరాకోసం రూ.97కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. రైల్వేకోడూరు శెట్టిగుంట వద్ద మెగా ఫుడ్ పార్క్‌కోసం 43.72 ఎకరాలు సిద్ధం చేసి ప్రతిపాదనలు పంపామన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 100 ఎకరాలు లఘు, చిన్న ,మద్య తరహా పరిశ్రమలస్థానకు కేటాయించడమైనదన్నారు. జిల్లా పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు చిన్నారుల జానపద కూచిపూడి నృత్యాలు అందిరినీ ఆకట్టుకున్నాయి. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ శే్వత, జాయింట్ కలెక్టర్ -శేషయ్య, డిఆర్వో సులోచన, టిడిపి రాష్ట్ర కార్యదర్శి సిఎం సురేష్‌నాయుడు, టిడిపి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి, కార్యదర్శి హరిప్రసాద్, వైవియు పాలక మండలి సభ్యుడు గోవర్దన్‌రెడ్డి, జాతీయ ఉపాధిహామీ పథక కమిటీ సభ్యులు పీరయ్య, టిడిపి నాయకులు సుభాన్‌బాషా, అమీర్‌బాబు, పారిశ్రామికవేత్త రామసుబ్బారెడ్డి, జిల్లాలోని వివిధ శాఖాధికారులు, పాల్గొన్నారు.

సిఎం పర్యటనకు భారీ బందోబస్తు

కడప,(క్రైమ్)జూన్ 6: అధికారపక్ష, ప్రతిపక్ష నేతలమద్య భారీ ఎత్తున జరుగుతున్న మాటల తూటాలకు జిల్లా వేడెక్కింది. రెండుపార్టీల మధ్య రణరంగం తలపించేలా వేడెక్కి ఉంది. ఈ సందర్భంగా ఏర్పాటుచేస్తున్న నవనిర్మాణదీక్ష ముగింపు సమావేశం ఈనెల 8న కడపలో ఏర్పాటు చేస్తున్నందున పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఉద్దేశ్యంతో ఐదు వేలమంది పోలీసులతో భారీ ఎత్తున మోహరించారు. అడిషనల్ డిజి ఠాకూర్, పలువురు ఐపిఎస్ ఉన్నతాధికారులు నేతృత్వం వహిస్తున్నారు. జిల్లా ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ ప్రత్యేకంగా శ్రద్ధతీసుకుని డిఎస్పీలకు, పోలీసు అధికారులకు దిశనిర్దేశం చేశారు. సుమారు 400 సిసి కెమెరాలు ఏర్పాటుచేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సభను విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాల్లో, ముఖ్యంగా మున్సిపల్ స్టేడియాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు.

నేడు మంత్రి పల్లె రాక
కడప,(కలెక్టరేట్)జూన్ 6: రాష్టస్రమాచార పౌరసంబంధాలశాఖ మంత్రి డా.పల్లె రఘునాధరెడ్డి ఈనెల 7వ తేదీన జిల్లాకు వస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారిణి సులోచన సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మంత్రి మంగళవారం మధ్యాహ్నం 2గంటలకు పుట్టపర్తి నుంచి బయలుదేరి సాయంత్రం 5గంటలకు కడప చేరుకుని స్థానిక కార్యక్రమాల్లో పాల్గొంటారన్నారు. అదేరోజు రాత్రి కడపలో బస చేస్తారన్నారు. 8న స్థానికంగా ఏర్పాటుచేసిన మహాసంకల్పం ముగింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రి పల్లె పాల్గొంటారన్నారు.

వైఎస్ హయాంలోనే అవినీతి..

రాయచోటి, జూన్ 6 : దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే అవినీతి రాజ్యమేలిందని తెలుగు దేశం పార్టీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి జగన్ మోహన్ రాజు, జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి సుజాత, టిడిపి జిల్లా కార్యదర్శి ముస్తాక్ హుస్సేన్‌లు దుయ్యబట్టారు. సోమవారం స్థానిక తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో విలేఖరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి ప్రజల దృష్టిని మరల్చేందుకు చేసిన విమర్శల్లో వాస్తవం లేదన్నారు. వైఎస్‌ఆర్ హయాంలోనే రాష్ట్రం, జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగిందని చెబుతున్న శ్రీకాంత్‌రెడ్డి వైఎస్ ఆర్ హయాంలోనే అభివృద్ధికి బదులు అవినీతి, దోపిడీ రాజ్యమేలిందని టిడిపి నాయకులు విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలలో ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన అన్ని హామీలను ఒక్కొక్కటిగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నెరవేరుస్తున్నారని వారు చెప్పారు. ఈ రెండేళ్ల కాలంలో జిల్లాలో వివిధ రంగాల్లో అభివృద్ధి జరిగితే ఏమీ జరగలేదని ఎమ్మెల్యే నిందలు వేయడం ఆయనకే తగును అన్నారు. వైఎస్ హయాంలో జిల్లాలో లక్షలాది ఎకరాల ప్రభుత్వ భూములను ఫ్యాక్టరీల పేరుతో వైఎస్ అనుచరులకు కట్టబెట్టారని వారు విమర్శించారు. అంతేకాకుండా ప్రతి అన్నదాతను లక్షాధికారిగా చేస్తానని చెప్పిన వైఎస్ ఐదేళ్ల పాటు సీఎంగా కొనసాగితే రైతులు మళ్లీ ఎందుకు అప్పుల కోసం బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వచ్చిందని వారు ప్రశ్నించారు. టీడీపీ హయాంలో జిల్లాలో ఎయిర్‌పోర్టు, హజ్‌భవన్ నిర్మాణం, పేదలకు పక్కా ఇళ్లు, ఎన్‌టిఆర్ భరోసా కింద వితంతువులకు, వికలాంగులకు, వృద్ధులకు ప్రతి నెలా పింఛన్లు ఇచ్చిన ఘనత చంద్రబాబునాయుడుకే దక్కుతుందన్నారు. నిరుద్యోగ నిర్మూలన కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాత్రింబవళ్లు కష్టపడుతూ యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారని వారు చెప్పారు. ఇకపోతే రాయచోటి నియోజకవర్గంలో వెలిగల్లు ప్రాజెక్టు నిర్మాణంలో కోట్లాది రూపాయలు నిధులు దుర్వినియోగం అయినట్లు వారు తెలిపారు. టీడీపీ రెండేళ్ల కాలంలో ఏ రంగంలో ఏ మేరకు అభివృద్ధి జరిగిందో, ఎంత నిధులు ఖర్చు చేశామో ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి ఇంటర్నెట్ ద్వారా తెలుసుకోవచ్చునని వారు సూచించారు.
తమ పార్టీ అధినేత చంద్రబాబునాయుడుపై ప్రతిపక్ష నాయకులు అనాగరిక పదజాలంతో అసభ్యకరమైన దూషణలకు దిగుతుండటం ప్రజల్ని రెచ్చగొట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుండటం అందరూ గమనిస్తున్నారన్నారు. భవిష్యత్తులో వైకాపా రాజకీయ చిత్రపటంలో లేకుండా తుడుచుకుపోతుందని వారు జోష్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి అంజాద్‌అలీఖాన్, టీ ఎన్‌టీయూసీ పట్టణ అధ్యక్షుడు గ్రంధే గంగాదర్, పట్టణ మహిళా ప్రధాన కార్యదర్శి నాగవేణి, టీడీపీ మైనార్టీసెల్ పట్టణ ప్రధాన కార్యదర్శి అతావుల్లా తదితరులు పాల్గొన్నారు.

నవనిర్మాణదీక్ష
ప్రణాళికలు సిద్ధం చేయండి

ఆంధ్రభూమి బ్యూరో
కడప,జూన్ 6: గత ఐదురోజులుగా రాష్టవ్య్రాప్తంగా నవనిర్మాణదీక్ష కార్యక్రమాలు ప్రజల సహకారంతో అధికారుల కృషితో విజయవంతంగా నిర్వహించామని ఈకార్యక్రమాల్లో చర్చించిన అంశాలన్నీ మంగళవారం సాయంత్రంలోపు ప్రణాళికలు సిద్ధం చేసి పంపాలని రాష్టమ్రుఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్టమ్రంత్రులను, కలెక్టర్లను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టర్ కెవి సత్యనారాయణ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ 2వ తేదీ నుంచి నవనిర్మాణదీక్ష కార్యక్రమాలు అందరి సహకారంతో రాష్టస్థ్రాయి నుంచి మండలస్థాయివరకు ఘనంగా నిర్వహించామన్నారు. 2014న విభజన తర్వాత మనందరం ఎక్కడ ఉన్నాం, కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి ఎంతమేరకు సహకారం అందించింది, తెలంగాణ ప్రభుత్వం వల్ల ఎన్ని సమస్యలపై అందరం పునరాలోచించుకోవాలన్నారు. 175నియోజకవర్గాల్లో 13 జిల్లాల్లోని ప్రజలందరి సహకారం, అధికారుల కృషి, సమైఖ్యంగా కష్టపడటంతో ప్రభుత్వం 10.99 వృద్ధి సాధించామన్నారు. కన్వర్‌జెన్స్ ఫండ్ తెచ్చుకుని 60శాతం లేబర్ ద్వారా 40శాతం మెటిరియల్ కాంపౌండ్ చేశామన్నారు. అందులో భాగంగా రాష్ట్భ్రావృద్ధిలో పెన్షన్లు , ఈపాస్ సంక్షేమ పథకాలు సజావుగా జరుగుతున్నాయన్నారు. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ కాపులకు సబ్‌ప్లాన్ పెట్టామన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఎక్కువ లాభాలు ఉన్నాయని ఆర్థిక అసమానతలు తగ్గిస్తూ ప్రతి కుటుంబానికి రూ.10వేలు అందిస్తామన్నారు. కడప జిల్లా కమలాపురంలో అత్యధిక వర్షంపాతం నమోదు అయినట్లు తనకు నివేదిక అందిందని ఈసమాచారం సరైనదా కాదా అని జిల్లా కలెక్టర్ తెలపాలన్నారు. కలెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ కమలాపురంలో 37 మి.మీ.వర్షం కురిసిందన్నారు. గత సంవత్సరం నవంబర్ మాసంలో అధికవర్షాల వల్ల భూగర్భజలాలు పెరిగాయని, ఈసంవత్సరం ఏప్రిల్ మాసంలో భూగర్భజలం తగ్గిందన్నారు. మే మాసంలో జిల్లాలో వర్షాలు భాగా కురిశాయని కలెక్టర్ ముఖ్యమంత్రికి వివరించారు. సిఎం మాట్లాడుతూ ఈనెల 8న రాష్టస్థ్రాయి ప్రజాప్రతినిధులు, ప్రజలు, ఉద్యోగులు మహాసంకల్పనం చేయాలన్నారు. గత సంవత్సరం ఎన్ని ఎకరాలకు తాగునీరు అందించాం, ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలకు నీరు అందించవచ్చునో ప్రణాళికలు సిద్ధంచేయాలన్నారు. రాబోయే రోజుల్లో కాలుష్యాన్ని నియంత్రించి ఉష్ణోగ్రతలు తగ్గించి భూగర్భజలాలు పెంచాలన్నారు. సెప్టెంబర్‌లో వచ్చే వర్షాలకు అందరూ అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.
ఈ వీడియోకాన్ఫరెన్స్‌లో రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్, రాష్టప్రౌరసరఫరాల కార్పొరేషన్ చైర్మన్ లింగారెడ్డి, జెసి శే్వత, జెసి -2 శేషయ్య, ఇరిగేషన్ సిఇ వరదరాజులు, సిపిఓ తిప్పేస్వామి, డిఆర్‌డిఏ, మెప్మా పిడిలు అనిల్‌కుమార్‌రెడ్డి, వెంకటసుబ్బయ్య తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ప్రజాభాగస్వామ్యంతోనే రాష్ట్ర నవనిర్మాణం

వల్లూరు,జూన్ 6: రాష్ట్ర విభజన కారణంగా జరిగిన నష్టాలను భర్తీ చేయడంలో ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందిస్తే 2050 నాటికి ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణం సాధ్యవౌతుందని ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ అన్నారు. సోమవారం వల్లూరు మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన నవనిర్మాణ కార్యక్రమంలో ఆయన హాజరై మాట్లాడారు. నవనిర్మాణ దీక్షలో ప్రజలందరూ భాగస్వామ్యంతోనే రాష్ట్ర నవనిర్మాణం అత్యుత్తమస్థాయిలో జరుగుతుందన్నారు. ప్రజలందరూ నవనిర్మాణ దీక్షకు పాటుపడాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజలు, రైతులకోసం అనేక కష్టాల కోర్చి ఎన్నికల్లో వాగ్దానాలు చేసిన ప్రతి అంశాన్ని నెరవేర్చారన్నారు. ఉనికిని కోల్పోయిన వైకాపా నాయకులు జగన్ ఇష్టమొచ్చిన రీతిలో మాట్లాడటం ప్రతిపక్ష నాయకునిగా తగదన్నారు. రాష్ట్రప్రభుత్వం రైతులకోసం రూ.25వేల కోట్లు రుణమాఫీ చేశారని, డ్వాక్రా మహిళలకు చేనేత కార్మికులకు రుణమాఫీ చేసిన ఘనత ఒక చంద్రబాబునాయుడుకే దక్కుతుందన్నారు. అధికారులు, ప్రతాప్రతినిధులు తమ వంతు సహాయం అందించి ముఖ్యమంత్రికి చేయూతనందించాలన్నారు. రాష్ట్రం విడిపోయిన రోజునుంచి నేటి వరకు ప్రత్యేక దృష్టిసారించి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిబాటలో కృషి చేసేందుకు చంద్రబాబునాయుడు శ్రద్ధ చూపుతున్నారన్నారు. జూన్ 2న ఆంధ్రరాష్ట్రం విడిపోయి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నవనిర్మాణ దీక్షను ప్రారంభించారన్నారు. ఈదీక్షపై ప్రజలకు ప్రభుత్వాధికారులు, ప్రజాప్రతినిధులు క్షుణ్ణంగా వివరిస్తుంటే ప్రతిపక్షనేతలు ఏరికోరి రాద్దాంతాలు చేస్తూ ప్రభుత్వంపై విమర్శలు చేయడం తగదన్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్సీ పుత్తానరసింహారెడ్డి, కడప మార్కెట్‌యార్డు చైర్మన్ జయసుబ్బారెడ్డి, ఎంపిడిఓ సాంబశివారెడ్డి, తహశీల్దార్ వెంకటేసు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.