కడప

జిల్లాకు 2015-16లో రూ.10వేల కోట్లు కేటాయింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,జూన్ 7: జిల్లాలో 2015-16వ సంవత్సరంలో రూ.10వేల కోట్లు ప్రభుత్వం వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయించగా అందులో 50శాతానికి పైగా సంక్షేమం కోసం వెచ్చించడమైందని కలెక్టర్ కెవి సత్యనారాయణ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక నూతన కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నవనిర్మాణదీక్ష 6వరోజు కార్యక్రమంలో భాగంగా సంక్షేమ రంగం అభివృద్ధిపై చర్చ కార్యక్రమాలు ఏర్పాటుచేసిన సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2015-16లో రూ.6,500కోట్ల వార్షిక క్రెడిట్ ఫ్యాన్ లక్ష్యం కాగా లక్ష్యాన్ని అధికమించి 109శాతం అభివృద్ధి సాధించామన్నారు. ఈ ఏడాది రూ.15వేలు కోట్లు కేటాయించేందుకు లక్ష్యంగా నిర్దేశించామని ఇందులో 50శాతం సంక్షేమ రంగానికి ఉంటుందన్నారు. గత ఏడాది డిఆర్‌డిఏ ద్వారా 30వేల ఎస్‌హెచ్‌జిలకు రూ.700కోట్లు బ్యాంకు లింకేజి పథకాలు, మెప్మా ద్వారా 10వేల సంఘాలకు రూ.250కోట్ల రుణ సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు. ఎస్సీ,ఎస్టీ, బిసి లబ్ధిదారులు 10వేల మందికి రూ.200కోట్లు బ్యాంకుల ద్వారా వితరణ జరిగిందన్నారు. రాష్టవ్య్రాప్తంగా ముఖ్యమంత్రి సంక్షేమరంగానికి పెద్దపీట వేస్తూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని వివరించారు. నవనిర్మాణ దీక్ష కార్యక్రమానికి విచ్చేసిన విశిష్ట అతిధిగావిచ్చేసిన ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయాక అనేక కష్టాలు ఎదుర్కొన్నామని, ఆంధ్రప్రదేశ్‌ను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లాలని సిఎం చంద్రబాబు నవనిర్మాణదీక్ష కార్యక్రమం చేపట్టారన్నారు. రాష్ట్రానికి తిరిగి పూర్వవైభవం తెచ్చేందుకు అభివృద్ధిచేసేందుకు కృతనిశ్చయంతో పనిచేస్తున్నారన్నారు. గతంలో రూ.200లు పెన్షన్‌ను రూ.1000లు చేశారని ఎన్‌టిఆర్ విద్యోన్నతి పథకం కింద ఎస్సీ,ఎస్టీ , బిసి విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారన్నారు. ఎస్సీ,ఎస్టీలకు ఫీజు రీయంబర్స్‌మెంట్, ఉపకారవేతనాలు అందిస్తున్నారన్నారు. రాష్ట్రం విడిపోయాక రైతుల నుంచి 33వేల ఎకరాలు సేకరించి అమరావతి రాజధాని నిర్మిస్తున్నారని ఈ ఏడాది 10వేల మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నారన్నారు. రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఎన్నికల ముందు హిందుపురం నుంచి విశాఖ పట్టణం వరకు పాదయాత్ర చేసిన సందర్భంగా ప్రజలు రూ.200 పెన్షన్ సరిపోదని తెలిపితే ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్ రూ.1000లు , వికలాంగులకు రూ.1500 పెంచుతామని ప్రకటించి మాట నిలుపుకున్నారని గుర్తు చేశారు. రుణమాఫీ కూడా రాష్ట్రం సమైఖ్యంగా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయమని రెవెన్యూ లోటు బడ్జెట్ ఉన్నా రైతులకు రూ.30వేలకోట్లు రుణమాఫీ చేశారని, ఎస్సీ సబ్‌ప్లాన్ కింద రూ.8,500కోట్లు కేటాయించారన్నారు. రాష్ట్రాన్ని కరవు రైతు రాష్ట్రంగా చేయాలన్న ఉద్దేశ్యంతో అనేక కార్యక్రమాలు చేపడుతూ అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. బుధవారం ముఖ్యమంత్రి పాల్గొనే మహాసంకల్ప దీక్ష కార్యక్రమం రాష్ట్రానికి సంబంధించిన బృహత్తర కార్యక్రమం అయినందున అధికార, అనధికారులు ఈకార్యక్రమాన్ని విజయవంతం చేసి సహకరించాలన్నారు. ఈ సమావేశంలో సాంఘిక సంక్షేమశాఖ డిడి సరస్వతి, గిరిజన సంక్షేమాధికారిణి లలితాభాయి, మైనార్టీ సంక్షేమాధికారి ఖాదర్‌బాషా, డిఆర్‌డిఏ ఏపిడి నాగరాజు, వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సత్యనారాయణరాజు తదితరులు వారి శాఖలకు సంబంధించిన ప్రగతివివరించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శే్వత, జెసి-2 శేషయ్య, డిఆర్వో సులోచన, టిడిపి నాయకులు సురేష్‌నాయుడు, వివిధశాఖల అధికారులు, అనధికారులు పాల్గొన్నారు.