కడప

మూడవ మలుపంటే అందరికీ హడల్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,జూన్ 14: జిల్లా నుంచి కర్నాటక, తమిళనాడు వెళ్లే వాహనాలన్నీ గువ్వల చెరువుఘాట్ ఎక్కక తప్పదు. ఈ ఘాట్‌రోడ్డు 18వ కర్నూలు-చిత్తూరు జాతీయ రహదారుల పరిధిలో ఉంది. ప్రతినిత్యం మూడవ మలుపువద్ద 200 అడుగుల పైబడి లోయలో చిన్నవాహనాలు మొదలుకుని, భారీ వాహనాలు అదుపుతప్పి పడటం షరా మామూలే. మంగళవారం తెల్లవారు జామున ఏకంగా ఆర్టీసీ బస్సు అదుపుతప్పి ఆ లోయలో పడి ఇద్దరి ప్రాణాలు అనంతవాయువులో కలిసి, 50 మంది క్షతగాత్రులయ్యారు. మూడుమాసాల క్రితం పొలతల మల్లేశ్వరస్వామి సన్నిధికి రామాపురం మండలం నుంచి ఒక లారీలో 50మంది పైబడి తరలివెళ్తుండగా ఇదే మూడవ లోయలో లారీ బోల్తాపడి ఐదుమంది ప్రాణాలు విడిచారు. మిగిలి అందరూ క్షతగాత్రులై చాలా మంది అవిటివారయ్యారు. ప్రతినిత్యం చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కర్నూలు, కడప, విజయవాడ ప్రాంతాలకు రాకపోకలు వేల సంఖ్యలోనే వాహనాలు ప్రయాణిస్తుంటాయి. అయితే ఘాట్ రోడ్డు మార్గంలో పలు మలుపుల్లో వాహనాలు ప్రమాదాలకు గురికాకుండా రక్షణ వలయాలు నిర్మించారు. మూడవ మలుపు లోయవద్ద పెద్దమలుపు ఉన్నా రక్షణ గోడ నిర్మించడం కానీ, రక్షణ వలయాలు ఏర్పాటు చేయడం కానీ జరగలేదు. ప్రతినిత్యం ప్రమాదాలు చోటు చేసుకోవడం, పలుశాఖాధికారులు జాతీయ రహదారుల అధికారులకు ఆదేశించినా, సూచించినా అంటీ అంటనట్లుగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా అవసరం లేని ప్రాంతాల్లో రక్షణ వలయాలు ఏర్పాటు చేస్తున్నారే కానీ, అవసరమున్న ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం లేదు. ప్రతినిత్యం గువ్వల చెరువుఘాట్ ప్రాంతంలో మరమ్మతులు లేని ప్రాంతాల్లో మరమ్మతులు చేసి లక్షల రూపాయలు అధికారులు దండుకుంటున్నారు. వాస్తవంగా 18వ జాతీయ రహదారిలో ఉన్న గువ్వలచెరువు ఘాట్ అభివృద్ధి చేయకపోవడం, అవసరమున్న చోట ప్రమాద సూచికల బోర్డులు ఏర్పాటుచేయకపోవడం ప్రధానకారమని చెప్పవచ్చు. గతంలో పాలకులు సొరంగ మార్గం ఏర్పాటు చేస్తామని, రోడ్‌వే మార్గం ఏర్పాటు చేస్తామని సాక్ష్యాత్తు మొన్నటి వరకు కాంగ్రెస్‌లో కొనసాగి కేంద్రమంత్రిగా పనిచేసిన, ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి వలస వచ్చిన ఏ.సాయిప్రతాప్ పలుమార్లు ఉత్తిత్తి హామీలు, ప్రకటనలు చేశారు. ఆయన ప్రకటనలన్నీ నేటికీ అమలుకాలేదు. ఆయన హయాంలో కడపలో తన ఇంటికి వెళ్లేందుకు రైల్వే ఫ్లై ఓవర్లు నిర్మించుకున్నారే కానీ ప్రజల సంక్షేమం పట్టలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇప్పటికైనా జాతీయ రహదారుల శాఖ, ప్రభుత్వం గువ్వల చెరువుఘాట్ వెడల్పుచేసి ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన అవసరం ఉంది.