కడప

యోగతో మానసిక, శారీరక ఆరోగ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,(క్రైమ్)జూన్ 21: ప్రతి ఒక్కరూ యోగా చేయడం వల్ల మానసిక, శారీరక ఆరోగ్యం కలుగుతుందని, జబ్బులను దూరంగా తరిమివేయవచ్చునని ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ అన్నారు. యోగా అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం నగరంలోని ఆర్‌ఎస్‌ఐ నరసింహులు మెమోరియల్ ఫంక్షన్ హాల్‌లో యోగ దినోత్సవాన్ని నిర్వహించి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ యోగ సాధనతో మనిషిలో అంచనావేయలేని ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చునన్నారు. యోగా ఒక ఔషధమని, ఎంతగా యోగచేస్తే అంతగా మనిషికి ఆరోగ్యం కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ డిఎస్పీ మురళీధర్, ఫ్యాక్షన్‌జోన్ డిఎస్పీ శ్రీనివాసులు, కడప డిఎస్పీ అశోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
యోగాతో మానసికోల్లాసం...
కడప,(కల్చరల్): యోగాతో మానసికోల్లాసం పొందవచ్చునని 31వ డివిజన్ కార్పొరేటర్ ఎంఎల్‌ఎన్ సురేష్ అన్నారు. అంతర్జాతీయ యోగాదినోత్సవం పురస్కరించుకుని స్థానికంగా ఉచితంగా యోగా శిక్షణ ఇస్తున్న సమైఖ్యయోగా సెంటర్ శిక్షకురాలు పద్మాశంకర్ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం యోగాదినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన కార్పొరేటర్ సురేష్ మాట్లాడుతూ యోగను అభ్యసించడం ద్వారా ఏకాగ్రత, గ్రహణ శక్తి, జ్ఞాపకశక్తి, మనోవికాసం పెద్దలపట్ల గౌరవం మొదలగునవి పెంపొందుతాయన్నారు. ప్రముఖ యోగా గురువులు నామా లక్ష్మినరసింహులు మాట్లాడుతూ యోగా సాధన వల్ల సమాజంలో ఉజ్వలభవిష్యత్‌కు ఎదగవచ్చునన్నారు. ప్రధానంగా మహిళలకు ఉచితంగా యోగాలో శిక్షణ ఇస్తున్న పద్మను వారు అభినందించారు. అనంతరం శిక్షకురాలు పద్మను శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు. అలాగే శిక్షణ పొందుతున్న పలువురు మహిళలు కూడా ఆమెను సంప్రదాయబద్ధంగా పూలు,పండ్లు ఇచ్చి ఘనంగా సత్కరించారు. అనంతరం అతిధులను కూడా యోగా సెంటర్ తరపున సత్కరించారు. ఈకార్యక్రమంలో వేదపండితులు శ్రీనివాసశర్మ, కె.రామ్మోహన్‌రావు, లక్ష్మీదేవి, ఎం.సౌజన్య, మైత్రి, ప్రణవి, గీత, శివకుమారి, వనజ పాల్గొన్నారు.
సంపూర్ణ ఆరోగ్యం
పెండ్లిమర్రి: మానవునికి వచ్చే రోగాలు మందులతో కొన్ని నయం చేయవచ్చునని, కొన్నినయం చేయలేమని కానీ యోగా ద్వారా సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని హోలిట్రినిటీ పాఠశాల కరస్పాండెంట్ డి.ఆంథోని రాజ్ అన్నారు. మంగళవారం నగరంలోని రామరాజుపల్లెగ్రామంలో ఉన్న హోలిట్రినిటీ పాఠశాలలో అంతర్జాతీయ రెండవ యోగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగాకు కులమత బేధాలు లేవని ఆరోగ్యం కోసం ఏ వయస్సువారైనా యోగా చేయవచ్చునన్నారు. భారతదేశంలో పుట్టిన యోగాను నేడు ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి ప్రధాన మంత్రి నరేంద్రమోడీ అని కొనియాడారు. మెదడు, మనస్సు, ఆత్మ, శరీరం ఇవన్నీ జీవశక్తిని పొంది నియంత్రణలో ఉండేందుకు యోగ ఒక అద్భుత సాధనమన్నారు. అనంతరం యోగ శిక్షకులు జి.్భస్కర్‌రెడ్డి విద్యార్థులు, ఉపాధ్యాయులచేత యోగాసనాలు చేయించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ మహేష్‌తోపాటు విద్యార్థులు, తల్లిదండ్రులు, పాఠశాల హెడ్మాస్టర్ మెర్సి జార్జి, సుధాకర్, గంగులయ్య, బ్రహ్మంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వల్లూరులో...
వల్లూరు: ప్రస్తుత సమాజంలో ప్రతి మనిషి ఏదో ఒక వ్యాధితో బాధపడుతున్నారని యోగా అభ్యాసనం ద్వారా వ్యాధులను దూరం చేసుకోవచ్చునని యోగా గురువు భాస్కర్‌రెడ్డి అన్నారు. మంగళవారం అంతర్జాతీయ రెండవ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదర్శపాఠశాల లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ప్రశాంత మనస్సును సొంతం చేసుకోవడం ద్వారా పరీక్షల్లో మంచి మార్కులు పొందాలంటే యోగా చేయాలన్నారు. వల్లూరులోని కస్తూరీబా గాంధీ బాలికల పాఠశాల, యాదాల శేషగిరి మెమోరియల్ పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు యోగాసనాలు నిర్వహించారు. కార్యక్రమంలో పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

బహుదాకు జలకళ
రాయచోటి, జూన్ 21: సుండుపల్లె మండల కేంద్రానికి సమీపంలో ఉన్న బహుదానది ప్రవహించడంతో జలకళ సంతరించుకుంది. దీంతో రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది. గత ఏడాది వర్షాలు పడి బహుదా ఉధృతంగా ప్రవహించడంతో ఈ ప్రాంతం సస్యశ్యామలమై రైతులు వరి సాగు చేసుకోవడం భూగర్భజలాల్లో నీటి శాతం పెరిగింది. అయితే ఈ యేడాది మొదటిలోనే బహుదానీరు రావడంతో ఇంకా వర్షాలు పడుతుండటం వలన నీటిమట్టాలు పెరుగుతాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం రాత్రి బహుదానది ఎగువ ప్రాంతాల్లో భారీగా వర్షాలు పడుతుండటం వలన నదిలోకి నీరు రావడంతో మండల కేంద్రంలోని ప్రజలు అనేక మంది నదిలో చేపలు పట్టేందుకు, నీటి ప్రవాహాన్ని చూసేందుకు ప్రజలు ఎగబడ్డారు.