కడప

రాష్ట్రాన్ని హరితాంధ్రగా మార్చుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందలూరు, జూలై 11:రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దాలని ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం బీసీ వెల్ఫేర్ గురుకుల పాఠశాల ఆవరణలో, రోడ్డుకు ఇరువైపుల మొక్కల నాటే కార్యక్రమంలో మేడా పాల్గొన్నారు. తొలుత విద్యార్థులతో కలసి పాఠశాల నుండి రెవెన్యూ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం రోడ్డుకు ఇరువైపుల మొక్కలునాటి నీరు పోశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వృక్షాలు స్వచ్ఛమైన ప్రాణవాయువును అందించడమే కాకుండా, కాలుష్యాన్ని నిరోధిస్తాయ ని, సకాలంలో వర్షాలు కురిపిస్తాయన్నారు. ఎండ వేడిమిని నివారించడమే కాకుండా చెట్లతో ప్రకృతిని సంరక్షించడం జరుగుతుందన్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణను కూడా ప్రతి ఒక్కరు విధిగా పాటించాలన్నారు. అనంతరం ఆయన బీసీ వెల్ఫేర్ పాఠశాలను తనిఖీ చేసి, ఉపాధ్యాయుల పనితీరు, వౌలిక వసతులపై ప్రిన్సిపాల్ ఆంజనేయరాజును విచారించారు. పాఠశాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. విద్యార్థులకు నాణ్యమై న విద్యనిందించాలని ఉపాధ్యాయ లకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి మేడా పద్మజ, సొసైటీ చైర్మన్ ఎం.విజయభాస్కర్‌రెడ్డి, జెడ్పీటీసీ శివరామరాజు, మార్కెట్‌యార్డ్ ఛేర్మన్ యెద్దల విజయసాగర్, ఎంపిడిఓ జుబేధాబేగం, తహశీల్దార్ చంద్రశేఖర్, సర్పంచ్ సమ్మెట శివప్రసాద్, ఈఓఆర్డీ ప్రసాద్, ఆర్‌ఐ సాహెబ్‌బాషా, ఉపాధి ఎపిఓ మురళి, టిడిపి నాయకులు బి.లక్ష్మీనరసయ్య తదితరులు పాల్గొన్నారు.

మట్కాబీటర్ల అరెస్టు

కడప,జూలై 11: కడప బహిష్కరణకు గురైన మట్కాబీటర్ గునికుంట్లరామయ్య, రౌడీ షీటర్, మట్కాబీటర్ కరీముల్లాబాషా, గునికుంట్ల రాకేష్, ప్రొద్దుటూరు మట్కాబీటర్ ప్రశాంతరావు, తలారీ విజయకుమార్‌లను అరెస్టు చేసినట్లు కడప డిఎస్పీ అశోక్‌కుమార్ సోమవారం సాయంత్రం డిఎస్పీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ, డిఎస్పీ అశోక్‌కుమార్‌లకు వచ్చిన సమాచారం మేరకు సోమవారం మద్యాహ్నం 12గంటలకు వన్‌టౌన్ సిఐ రమేష్ సిబ్బందితో కలిసి కలెక్టర్ బంగ్లా సర్కిల్ వద్ద వాహనాల తనిఖీ కార్యక్రమం చేపట్టారన్నారు. కడప తహశీల్దార్ శ్రీనివాసులురెడ్డి, విఆర్వో శ్రీనివాసులుతో కలిసి ఎస్‌ఐ వి.నాగరాజు, పిఎస్‌ఐలు భాస్కర్‌రెడ్డి, శివప్రసాద్‌రెడ్డి, ఏఎస్‌ఐ నౌషద్‌బాషా, పిసి ప్రసాద్‌లతో వాహనాలు తనిఖీ చేస్తున్నట్లు చెప్పారు. ఎర్రముక్కపల్లె సర్కిల్ వైపు నుంచి సిల్వర్ కలర్ మారుతీ సుజికి ఎరిక్ట కారు నెం.ఏపి 044ఏ జెడ్ 4499 వాహనం అతివేగంగా దూసుకొచ్చిందన్నారు. వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించగా డ్రైవర్ తన వేగాన్ని ఆపే పరిస్థితి కన్పించలేదన్నారు. దీంతో సిఐ సిబ్బందిని అప్రమత్తం చేసి మొబైల్ బ్యారిగేట్లను ఆ వాహనానికి అడ్డుపెట్టి ఆపామన్నారు. వారు వాహనం దిగిన వెంటనే పోలీసులను తోచుకుని పారిపోవడానికి ప్రయత్నించారన్నారు. తహశీల్దార్‌తో కలిసి వారిని విచారించగా కొంతకాలంగా కడప జిల్లాలో మట్కా నిర్వహణదారులపై పోలీసులు గట్టి నిఘా ఉంచినందున మట్కా నిర్వహించడం కష్టమైందని వారు తెలిపారన్నారు. ఎలాగైనా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశ్యంతో గంజాయి వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నట్లు వారంతా కలిసి తుని వద్ద 21కేజిల 200 గ్రాముల గంజాయిని రూ.1లక్షా 5వేలకు కొనుగోలు చేసినట్లు తెలిపారు. దిప్పంపాటి మనోహర్‌కు చెందిన ఎరిక్టకారులోని వెనుకసీటులో పెట్టుకుని కడప మీదుగా చెన్నైకు వెళ్తున్నట్లు తెలిపారన్నారు. వారిపై సెక్షన్ 143, 307, 353, ఆర్‌బైడబ్ల్యు ఐపిసి , 8సి ఆర్‌బైడబ్ల్యు 20 (బి), ఎన్‌డిపిఎస్ యాక్టు 1985 మేరకు కేసు నమోదుచేసి వారి నుంచి గంజాయి, కారు, రూ.8.100 నగదు స్వాధీనం పరుచుకుని వారిని రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు.