కడప

రేపు గురుపౌర్ణమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,(కల్చరల్)జూలై 17: స్వస్తిశ్రీ ధుర్ముఖినామ సంవత్సరం ఆషాఢ శుద్ధిపూర్ణిమ (ఆషాఢవ్యాస పౌర్ణమి) పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా ఈనెల 19వ తేదీ మంగళవారం భక్తులందరూ శ్రీ సద్గురు సాయినాధునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఘనంగా నిర్వహించనున్నారు. త్రిమూర్తుల స్వరూపంగా గురువును భావించి ఆరాధించడం హైందవజాతి లక్షణం. అజ్ఞాన అంధకారంలో మునిగితేలే శిష్యకోటిని ఉద్దరించేవాడు గురువు. ప్రతి వ్యక్తి జీవితంలో గురువుపాత్ర గణనీయంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. గురుపౌర్ణమి నాడు ప్రత్యేకంగా గురువులను స్మరించి తరించడం మనకు కొత్త ఏమీకాదు. సాయిబాబా నోటిమీదుగా భక్తులకు చేసుకోమని చెప్పిన ఉత్సవం ఇదొకటే. మనం చింతించిన దాన్ని మాత్రమే ఇస్తుంది చింతామణి. మనస్సులో కల్పన చేసుకుని, దాన్ని మాత్రమే ఇస్తుంది కల్పవృక్షం. కోరిన కోర్కెలు మాత్రమే కామధేనువు తీరుస్తుంది. కానీ సద్గురు మాత్రమే ఎన్నడూ కోరని వాటిని కూడా దానం చేస్తాడు. నేడు కోటానుకోట్ల మంది ప్రజలు శ్రీషిర్డిసాయి బాబాను గురువుగా భావిస్తూ పూజిస్తున్నారు. సద్గురువు అనేవాడు ఏదైనా మొదట తను ఆచరించి తర్వాతే శిష్యులకు ఆదర్శంగా నిలుస్తాడు. సద్గురు సత్యానికి ప్రతీక. గురువు విశిష్టతను మాటల్లో చెప్పలేం. ప్రతి ఒక్కరు గురువును ఆరాధ్యదైవంగా భావించి, వారి యొక్క విశిష్టతను తెలుసుకుని అతని ప్రేమకు పాత్రులమవుదాం. సద్గురువు యొక్క లీలలను, బోధనలను, పారాయణం, శ్రవణం, చింతనను చేయడమే సద్గురు కృపకు ఉత్తమమైన మార్గమని బాబా తెలియజేశారు.
శ్రీషిర్డిసాయిబాబా ఆలయాల్లో
గురుపౌర్ణమి వేడుకలు
గురుపౌర్ణమి పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా ఉన్న షిర్డిసాయిబాబా ఆలయాలతోపాటు కడప నగరంలోని మున్సిపల్ మైదానంలో వెలసివున్న శ్రీ దత్తసాయి మందిరం, శ్రీషిర్డిసాయిబాబా ఆలయంలో మంగళవారం స్వామివారికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఈసందర్భంగా ఉదయం 4గంటలకు కాగడ హారతి, 4.30గంటలకు అభిషేకం, ప్రత్యేక అలంకరణ, అర్చన, తీర్థప్రసాదాలు, మంగళహారతి ఉంటాయి. అలాగే ఉదయం 9గంటలకు సాయి సత్యవ్రతం, 12గంటలకు కాగడ హారతి, 12.30గంటలకు అన్నదానం, సాయంత్రం 6గంటలకు సంధ్యాహారతి, 8గంటలకు పల్లకీసేవ, 9గంటలకు పవళింపుసేవ నిర్వహించనున్నారు. అలాగే బుధవారం సాయంత్రం 5గంటలకు సాయినాధుని గ్రామోత్సవం వైభవోపేతంగా నిర్వహిస్తారు. అదేవిధంగా నగరంలోని రాయచోటి రోడ్డులోని ప్రకృతినగర్‌లో శ్రీషిర్డిసాయిబాబా మందిరం, కో-ఆపరేటివ్ కాలనీ సాయిబాబా ఆలయం, రైల్వేస్టేషన్ రోడ్డులోని సాయిబాబా మందిరం, అంగడివీధిలోని సాయిబాబా ఆలయం, అల్మాస్‌పేటలోని సాయిబాబా ఆలయం, నబీకోటలోని సాయిబాబా ఆలయం, ఐటిఐ సర్కిల్‌సమీపంలోని సాయిబాబా ఆలయంతోపాటు పలు ఆలయాల్లో గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు.
సిద్దవటంలో...
సిద్దవటం: మండలంలోని భాకరాపేట సమీపంలో ఉన్న బెటాలియన్ ఎదుట వెలసిన శ్రీ షిర్డిసాయిబాబా ఆలయంలో ఈనెల 19వ తేదీన గురుపౌర్ణమి నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు ఆవులరెడ్డి, ధనలక్ష్మిలు తెలిపారు. సాయినాథునికి అభిషేకాలు, హారతులు, వ్రతం, హోమం తదితర పూజలు నిర్వహిస్తామన్నారు. అదేరోజు సాయంత్రం స్వామివారి గ్రామోత్సవం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో విప్ మేడా, కమాండెంట్ స్యామేల్ జాన్‌లు తదితర అధికారులు పాల్గొంటారన్నారు.