కడప

వెబ్‌ల్యాండ్ ఆధారంగా పంట రుణాలు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొండాపురం, జూలై 17: పంట రుణాల కోసం బ్యాంకులకు వెళ్లే రైతులకు పాసుపుస్తకాల కష్టం తప్పినట్లే. పట్టాదారు పాసుపుస్తకంతోపాటు టైటిల్‌లీడ్ ఉంటేనే పంట రుణం ఇస్తామని తిప్పుకొనే పరిస్థితి లేకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకనుగుణంగానే త్వరలోనే చట్ట సవరణ చేయబోతున్నారు. ఒక భూమికి ఒకే రికార్డ్, పాసుపుస్తకమని, టైటిల్ లీడ్ అని ఇలా రకరకాల గందరగోళాలు ఇకపై ఉండవు. చేతి రాతలతో వుండే పాసుపుస్తకాలు కూడా ఇకపై వుండవు. ఎలక్ట్రానిక్ పాసుపుస్తకంతోపాటే టైటిల్ లీడ్‌ను జత చేసి ఒకే రికార్డ్‌గా ఇచ్చేందుకు ప్రభుత్వం సవరణలు ప్రతిపాదించింది. ఈ మేరకు అసెంబ్లీలో కూడా బిల్లు ప్రవేశపెట్టింది. ఈ బిల్లు ఆమోదం పొందుతే రెవిన్యూ శాఖకు సంబంధించి వెబ్‌ల్యాండ్ సాఫ్ట్‌వేర్ ఆధారంగా భూ వివరాలు తనిఖీ చేసుకొని రైతులకు పంటరుణం ఇచ్చే విధానం అమలులోనికి వస్తుంది. రుణం న్యాచ్యూల్ బ్యాంకుల్లో అందుకు తగ్గ ఏర్పాట్లు గతంలోనే చేసినా ఇప్పటి వరకు బ్యాంకర్లు రైతులకు పూర్తి స్థాయిలో సహకరించలేదు. ఇకపై ఈ వసరణల ద్వారా రైతులకు రుణాల మంజూరులో పాసుపుస్తకాల అవసరముండదు. రెవిన్యూ శాఖ తన ఆధీనంలో ఉండే వెబ్‌ల్యాండ్ సాఫ్ట్‌వేర్‌ను ఇప్పటికే బ్యాంకులకు అనుసంధానం చేసింది. మీ ఇంటికి - మీ భూమి అనే కార్యక్రమంలోనే ఈ అనుసంధాన ప్రక్రియ జరిగిపోయింది. రుణం కోసం బ్యాంకు వద్దకు వచ్చే రైతులు సర్వే నెంబర్, విస్తీర్ణం, యాజమాన్య హక్కుల వివరాలు అందులో కనిపిస్తాయి. వాటి ఆధారంగా రుణం మంజూరు చేస్తే ఆ వివరాలు వెబ్‌ల్యాండ్‌లో నమోదవుతాయి. అదే సర్వే నెంబర్‌పై మరో బ్యాంక్‌లో రుణం తీసుకొనే వెసులుబాటు వుండదు. అలాగే రుణం చెల్లిస్తే ఆ వివరాలు సాఫ్ట్‌వేర్‌లో నమోదవుతాయి. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పాసుపుస్తకం అవసరమే వుండదు.
రిజిస్ట్రేషన్ శాఖకు వెబ్‌ల్యాండ్‌ను అనుసంధానం చేశారు. ఇకనుంచి పాసుపుస్తకంలోని వివరాలను, యాజమాన్య హక్కులను తెలిపే టైటిల్‌లీడ్, పుస్తకంలోని వివరాలను కలిపి ఒకే పుస్తకంలోకి తీసుకువస్తున్నారు. పాసుపుస్తకాలు అవసరం లేకుండా చెయ్యాలన్నది రెవిన్యూ శాఖ యోచనగా తెలుస్తోంది. ఇ-పాస్ పుస్తకం అమలులోకి తెచ్చాక వాటిని టాపర్ అవకాశం వుండదు. రుణాలను వాటికే మంజూరు చేస్తారు. వీటి అవసరం లేకుండా వెబ్‌ల్యాండ్‌లో వివరాలను తెలిపే పత్రాలను తనిఖీ చేసుకొని యాజమాన్య హక్కులను తెలిపే పత్రాలను మీసేవా ద్వారా తీసుకొని భధ్రపరుచుకున్నా సరిపోతుంది. రైతులకు భరోసా కోసం పాసుపుస్తకాలు పొందవచ్చునని రెవిన్యూ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం పాసుపుస్తకం, టైటిల్‌లీడ్ వేర్వేరుగా వుండటం వలన అవినీతి పెరిగిపోతోందని, ఒకే భూమికి ఒకే రికార్డ్ వుండాలని పాసుపుస్తకం, టైటిల్‌లీడ్ ఒకే డాక్యుమెంట్‌లో కలిపి ఇవ్వాలని సవరణలో ప్రతిపాదించారు. అలాగే మ్యానువల్ పాసుపుస్తకాల్ని కూడా రైతులు వుంచుకొనే విధంగా కూడా చట్టసవరణలో ప్రతిపాదించారు. ఇకనుంచి పంట రుణానికి పాసుపుస్తకంతో పని లేకుండానే వెబ్‌ల్యాండ్ సాఫ్ట్‌వేర్ ఆధారంగానే రైతులకు పంటరుణాలు ఇప్పించేందుకు రంగం సిద్ధమైందని తెలుస్తోంది.