కడప

ఉపాధి కూలీలకు గడ్డపారలు పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుండుపల్లె, జూలై 17: మండలంలోని మాచిరెడ్డిగారిపల్లె పంచాయతీలోని ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కూలీలకు, రైతులకు ఆదివారం ఉచితంగా అదే గ్రామానికి చెందిన ఎంపీటీసీ మహేశ్వర్‌రెడ్డి చేతుల మీదుగా గడ్డపారలు పంపిణీ చేశారు. గ్రామంలోని 270 మంది రైతులకు పంపిణీ చేసినట్లు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఎక్కువ మంది ఉపాధి పనులు చేస్తుండటం వారికి ఉపాధి లభించినట్లు ఉందన్నారు. ఉపాధి హామీని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి పొందవచ్చునని రైతులకు సలహాలు ఇచ్చారు. అనంతరం ప్రతి ఇంటికీ ఒక ఇంకుడు గుంత తవ్వాలని, ఒక చెట్టు నాటాలన్నారు. చెట్లు నాటడం ద్వారా హరితానికి ప్రాణం పోసినట్లు ఉంటుందని, తిరిగి మన ప్రాణవాయువును చెట్లు అందిస్తాయని, ఇంకుడు గుంతలతో భావితరాలకు నీటిసమస్య రాకుండా ఉండవచ్చని బోరుబావుల్లో నీరు తవ్వకుండా రైతన్నల కడుపులు నింపే భూముల్లో బంగారం పండవచ్చని ఆమె రైతులను కోరారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ అమరావతి, రైతులు, ఉపాధి కూలీలు పాల్గొన్నారు.