కడప

తెలుగువారి సంక్షేమానికి తానా కృషి : డిజిపి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజంపేట, జూలై 17:తెలుగువారి సంక్షేమానికి అమెరికాలోని తానా సంస్థ కృషి చేస్తున్నదని డిజిపి జె.వి.రాముడు అన్నారు. ఆదివారం రాజంపేట పట్టణం మన్నూరు హైస్కూల్‌లో తానా ప్రతినిధి వేమన సతీష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో డిజిపి పాల్గొని కరాటే విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తానా తెలుగువారి సంక్షేమానికి కోట్లాది రూపాయలతో సేవా కార్యక్రమాలు అమలు చేస్తున్నదని డిజిపి పేర్కొన్నారు. ఈ సందర్భంగా పోలీసు శాఖలో 40 సంవత్సరాలు సర్వీసు పూర్తి చేసిన సందర్భంగా 40 ఏళ్ల లోగోను డిజిపి రాముడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ ఐజి శ్రీ్ధర్‌బాబు, జిల్లా ఎస్పీ రామక్రిష్ణ, స్థానిక పోలీసులు, పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందుగా కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన డిజిపి రాముడికి హైస్కూల్ వద్ద ఘనంగా స్వాగతం లభించింది. తానా ప్రతినిధి వేమన సతీష్ మాట్లాడుతూ తానా ఆధ్వర్యంలో తెలుగువారి కోసం విభిన్న రీతిలో కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతున్నదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నూతన రాజధాని నిర్మాణానికి, రాష్ట్ర అభ్యున్నతికి చేస్తున్న కృషిని కూడా ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా టిడిపి దళిత నాయకులు సత్యాల రామకృష్ణ డిజిపిని దుశ్శాలువతో సత్కరించి అంబేద్కర్ చిత్రపటాన్ని బహుకరించారు.