కడప

పాత ధరకే ఎరువుల విక్రయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,జూలై 17: కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఎరువుల ధరను తగ్గించినా పలువురు వ్యాపారులు పాత ధరకే విక్రయిస్తూ రైతులను నిలువుదోపిడీ చేస్తున్నారు. జిల్లా అధికారులు ఎరువుల అంగళ్లపై దాడులు నిర్వహిస్తున్నా వ్యాపారులు తీరు మార్చుకోవడంలేదు. క్షేత్రస్థాయిలో కొంతమంది సంబంధిత అధికారులు ఎరువుల వ్యాపారులతో మిలాఖత్ అయి వ్యాపారులకు వత్తాసుపలుకుతున్నట్లు తెలుస్తోంది. చాలాకాలంగా ఎరువుల వ్యాపారులు ఖరీఫ్, రబీ సీజన్‌లో విత్తనాలు, ఎరువులను అండర్ గ్రౌండ్‌లో దాచిపెట్టి కృత్రిమ కొరత సృష్టించి బాగా డిమాండ్ పెంచి రైతులను నిలువుదోపిడీ చేస్తున్నారు. వరుస కరువులతో కుదేలవున్నా వరుణదేవుడికి కానీ ప్రభుత్వానికి కానీ చివరకు వ్యాపారులకు కానీ కరవురైతుపై కనికరం లేక వారి రక్తాన్ని పిండి పిప్పిచేస్తున్నారు. జిల్లాలో ఆర్‌సిఎఫ్, ఐఎఫ్‌ఎల్ కంపెనీలకు చెందిన ఎరువులను ఎరువుల అంగళ్లకు సరఫరా చేశారు. డిఏపి 16.20.13 ఎరువులను పాతధర రూ.1285కాగా కొత్త్ధర రూ.1249లు, ఎంఓపి పాతధర రూ.840 లు కాగా కొత్త్ధర రూ.790లు ఉంది. ప్యారం పాస్ పాతధర రూ.924లు, కొత్త ధర రూ.871లు ఉంది. యూరియా పాతధర రూ.298లు, కొత్త్ధరలో మార్పులేదు. సూపర్ పాతధర రూ.415లు, కొత్త్ధర రూ.390లు, 20.20.13 పాతధర రూ.954లు, కొత్త్ధర రూ.918లు, 28.28.0 పాతధర రూ.1270లు, కొత్త్ధర రూ.1223లు, 10.26.26 పాతధర రూ.1202లు, కొత్త్ధర రూ.1155లు, 14.35.14 పాతధర రూ.1270లు, కొత్త్ధర రూ.1223లు చొప్పున రైతులకు విక్రయించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఎరువుల విక్రయేతలు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ రైతులను దగా చేస్తున్నారు. ఈ అక్రమాలు నివారించేందుకు రాష్ట్రప్రభుత్వం టాస్క్ఫోర్స్ ఏర్పాటుచేసినా ఆ టాస్క్ఫోర్స్ అంటీ అంటనట్లుగా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా పలువురు వ్యాపారులకు అధికారపార్టీ నేతలతో సంబంధాలు కలిగివుండటంతో రాజకీయ వత్తిళ్లు కారణంగా కొంతమంది అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఎరువులను పాతధరలకే విక్రయించి రైతులను అన్ని విధాల ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.