కడప

మూసివేసిన సంక్షేమ హాస్టళ్లను ప్రారంభించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయచోటి, జూలై 25: రాయచోటి నియోజకవర్గంలోని గాలివీడు, చిన్నమండెం బాలికల వసతి గృహాలను తిరిగి ప్రారంభించాలని పీఆర్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సుంకు రవీంద్ర డిమాండ్ చేశారు. సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోనే అత్యంత కరువు పీడిత ప్రాంతమైన రాయచోటిలో వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థుల సంఖ్య లక్షల్లో ఉందని అటువంటి చోట వసతి గృహాలు మూయడం వల్ల పేద విద్యార్థులు చదువుకు దూరమయ్యే అవకాశం ఉందని ఈ సంక్షేమ హాస్టళ్ల మూసివేతకు నిరసనగా ఎమ్మెల్యే, ఎంపీ దృష్టికి తీసుకెళ్లి తిరిగి ప్రారంభించేలా చూడాలని వినతిపత్రం సమర్పిస్తామని ఆయన తెలిపారు. బీసీ జనాభా అధికంగా గల రాయచోటి నియోజకవర్గంలో బీసీ బాలుర, బాలికల గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రెసిడెన్షియల్ స్కూళ్లు పేరుతో విద్యను ప్రైవేటుపరం చేయాలని చూస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పీఆర్‌ఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు రవిశంకర్, ఉపాధ్యక్షులు రవిశంకర్‌రెడ్డి, రాయచోటి పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు సునీల్, రెడ్డిశేఖర్ పాల్గొన్నారు.