కడప

ప్రజల ఫిర్యాదులపై అధికారులు స్పందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,(కల్చరల్)జూలై 25: వయోవృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు పెన్షన్లకోసం, భూమి కొలతలు, ఇ-పాస్ పుస్తకాలు, భూమి హద్దులకోసం వివిధ రకాల సమస్యలపై వచ్చిన ఫిర్యాదులపై అధికారులు వెంటనే స్పందించి వాటి పరిష్కారం కోసం కృషి చేయాలని కలెక్టర్ కెవి సత్యనారాయణ అధికారులకు సూచించారు. సోమవారం కొత్త కలెక్టరేట్‌లోని మీ కోసం హాల్‌లో డయల్ యువర్ కలెక్టర్, మీకోసం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ ఫిర్యాదుల పరిష్కారం కోసం మీ కోసం కార్యక్రమానికి ప్రతి సోమవారం వందల సంఖ్యలో ప్రజలు వస్తుంటారని వారి సమస్యలపై సానుకూలంగా స్పందించి పరిష్కరించేందుకు ఉపక్రమించాలన్నారు. సమస్యల ఫిర్యాదు మీ పరిధిలో రాకుంటే పై అధికారులకు తెలుపుతూ అర్జీదారునికి ఈ విషయాన్ని తెలపాలన్నారు. అంతేకానీ పరిష్కారం కాదని మీ వద్ద ఉంచుకోరాదని సూచించారు. అష్టకష్టాలకు ఓర్చి పరిష్కారం లభిస్తుందని మీకోసం కార్యక్రమానికి వస్తారని వారి సమస్యలు సానుకూలంగా విని పరిష్కరించాల్సిన అవసరం ప్రతి అధికారిపై ఉందన్నారు. అనంతరం ప్రజల నుంచి కలెక్టర్ అర్జీలు స్వీకరించి వాటి పరిష్కారం కోసం ఆయా అధికారులకు అర్జీలను బదిలీ చేశారు. ఈ సందర్భంగా వీరబల్లి మండలం గుర్రప్పగారిపల్లెకు చెందిన పద్మావతమ్మ గ్రామంలో సర్వేనెంబర్ 1747/10-4 లో 39సెంట్లు భూమి ఉందని ఆభూమిని ఆన్‌లైన్ చేయించాలని కోరారు. అలాగే దువ్వూరు మండలం సింగనిపల్లె గ్రామానికి చెందిన దస్తగిరమ్మ తన భర్త మరణించారని జీవనం గడిపేందుకు కష్టంగా ఉందని వితంతు పెన్షన్ మంజూరు కోసం అభ్యర్థించారు. కడప సంగంపేటకు చెందిన సరోజ వృద్ధాప్యంతో బాధపడుతున్నామని పనికి వెళ్లేందుకు కూడా శక్తిలేదని తన జీవనాధారం కోసం వృద్ధాప్య పెన్షన్ ఇప్పించాలని కోరారు. ఎర్రగుంట్ల మండలం తిప్పలూరు గ్రామానికి చెందిన మహ్మద్ రఫీ కమలాపురం మండలంలోని యల్లారెడ్డిపల్లెలో తన పేరుమీద 1.68 ఎకరాల పొలం ఉందని ఆ పొలంకు ఇ-పాసు పుస్తకం కోసం దరఖాస్తు చేసుకున్నానని ఇపాసు పుస్తకం త్వరగా ఇప్పించాలని అభ్యర్థించారు. పలువురు తమ సమస్యలను అర్జీల రూపంలో కలెక్టర్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ శే్వతతెవతియ, ఇన్‌చార్జ్ జెసి -2 నాగేశ్వరరావు, డిఆర్వో సులోచన, డిఆర్‌డిఏ పిడి అనిల్‌కుమార్‌రెడ్డి, డ్వామా పిడి రమేష్, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ సంజీవరావు, పంచాయతీరాజ్ ఎస్‌ఇ నాగేశ్వరరావు, సిపిఓ తిప్పేస్వామి, అగ్రికల్చర్ జెడి ఠాగూర్‌నాయక్, డిఎంహెచ్‌ఓ సత్యనారాయణరాజు, స్టెప్ సిఇఓ టి.మమత, అధికారులు పాల్గొన్నారు.