కడప

రేషన్‌దుకాణాల్లో అక్రమాలకు చెక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, జూలై 28:రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ చౌకదుకాణాల నుంచి నిత్యావసర సరుకులు సక్రమంగా పంపిణీ చేసేందుకు నూతన విధి విధానాలు ఖరారు చేసి ప్రతి దుకాణానికి 500 కార్డులు కేటాటిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జిల్లాలో 1735 ప్రభుత్వ చౌక దాన్యపు దుకాణాలు ఉండగా ప్రస్తుతం ఉన్న రేషన్‌కార్డు లబ్ధిదారులను బట్టి 1672 చౌకదుకాణాలకు కుదించే అవకాశాలున్నాయి. ఆ దామాషిలో 63 చౌకదుకాణాలు మూతపడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. చౌకదుకాణాల ద్వారా జేబులు నింపుకుంటున్న పలువురు చౌకదుకాణాల డీలర్లు ప్రభుత్వ నూతన పాలసీ నిరాశకు గురిచేస్తోంది. ప్రస్తుతం చౌకదుకాణాల డీలర్లకు ఇచ్చే కమిషన్ కూడా ప్రభుత్వం పెంచేందుకు నిర్ణయం తీసుకుంది. జిల్లాలో 1735 చౌకదుకాణాలకు గాను 8,35,929 రేషన్‌కార్డులు ఉన్నా యి. వీటిలో తెల్ల రేషన్‌కార్డులు 6,42,279, అంత్యోదయ అన్న యోజనకార్డులు 56,803 కార్డులు, అన్నపూర్ణ కార్డులు 780, దారిద్య్ర రేఖకు దిగువనున్న రేషన్‌కార్డులు మొత్తం వెరసి 6,00,862 ఉన్నాయి. గులాబీ రేషన్‌కార్డులు 77,944 ఉన్నాయి. జిల్లాలో మొత్తం రేషన్‌కార్డులు 7,77,806 ఉండగా, ఇటీవల జన్మభూమి కార్యక్రమంలో 58,123 కార్డులు పంపిణీ చేశారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా 835929 రేషన్ కార్డులు కలిగివున్నాయి. కడప రెవెన్యూ డివిజన్‌లో 696 చౌకదుకాణాలు, రాజంపేట రెవెన్యూ డివిజన్‌లో 427 దుకాణాలు, జమ్మలమడుగు రెవెన్యూ డివిజన్‌లో 612 దుకాణాలు ఉండగా, ఈ దుకాణాల్లో 395 డీలర్‌షిప్‌లు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విధి విధానాలతో రేషన్ దుకాణాల సంఖ్య తగ్గడంతోపాటు కార్డు దారులకు సక్రమంగా సరుకులు పంపిణీ జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. చౌకదుకాణాలు కేటాయింపులో కూడా అడుగడుగునా అన్యాయం జరుగుతోంది. ఎస్సీ, ఎస్టీ, బిసి, పిహెచ్‌సి, డ్వాక్రా, మైనార్టీ,మాజీ సైనికులు, స్ర్తిలకు రిజర్వేషన్ సౌకర్యాలు ఉన్నా ఏప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ పార్టీ నేతలు రిజర్వేషన్లు గాలికి వదిలివేసి తమకు అనుకూలమైన వారికే చౌకదుకాణాలు దక్కించుకుని సరుకులు సక్రమంగా పంపిణీ చేయకుండా యధేచ్చగా నల్లబజారుకు తరలిస్తున్నారనేది జగమెరిగిన సత్యం. ప్రస్తుతం ప్రభుత్వం ప్రవేశపెట్టే నూతన విధానంతో అధికారపార్టీ నేతల అడ్డదారులకు కళ్లెంపడే అవకాశాలు కన్పిస్తున్నాయి.