కడప

రాజంపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి రాజ్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజంపేట, జూలై 28: రాజంపేట సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి వేల్లునుకుంది. డబ్బులు ముట్టజెబితేతప్పా పనులు జరగడంలేదు. ఈ అవినీతిపై ఎసిబికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. కాసులకు కక్కుర్తిపడి అధికారులు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు వంతపాడడం నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరుగుతోంది. డివిజన్ కేంద్రమైన రాజంపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై అవినీతి నిరోధకశాఖకు పలువురు ఫిర్యాదులు పంపడం జరిగింది. ఇటీవల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై అవినీతి నిరోధక శాఖాధికారుల దాడులున్నాయని తెలిసి దస్తావేజులు రాసే వారు సైతం తమను ఎక్కడ ఎసిబి అధికారులు విచారిస్తారోనన్న భయాందోళనలతో తమ దుకాణాలు మూసేసుకుని వెళ్లారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి కారణంగా తాము తీవ్రంగా నష్టపోతున్నామని కొందరి ఫిర్యాదు మేరకు నియోజకవర్గానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి వద్ద కూడా పంచాయతీ జరిగినా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పనితీరులో ఏమాత్రం మార్పు రాలేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు కాసులతో తమ ఇష్టారాజ్యంగా రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఉపయోగించుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. ఇందుకు రెవెన్యూశాఖ సహకారాన్ని కూడా వీరు తీసుకుంటుండడం కద్దు. ఎటువంటి పని అయినా కాసులుంటే ఈ కార్యాలయంలో పని చేసుకోవచ్చన్న దీమాతో కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులున్నారు. ఈ కార్యాలయంలో జరిగే అవినీతిలో భాగం ఉండడంతో రిజిస్ట్రార్ శాఖకు చెందిన జిల్లాస్థాయి నుండి రాష్టస్థ్రాయి వరకు ఉన్నతాధికారుల అండ ఈ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అధికారులకు పుష్కలంగా ఉన్నట్టు తెలుస్తొంది. తమను ఎవరూ ఏమి చేయలేరని, ఎవరికైనా ఫిర్యాదు చేసుకోవచ్చని స్వయంగా ఇక్కడి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అధికారులే పేర్కొంటుండడం బట్టి వీరికి ఏ స్థాయిలో ఉన్నతాధికారుల అండ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి కారణంగా అమాయకులైన ఎందరో మోసపోతూ నష్టపోతున్నారు. ఎసిబి అధికారుల చేతికి చిక్కకుండా ఉండేందుకు వీలుగా నేరుగా అవినీతి సొమ్మును ఈ కార్యాలయం అధికారులు నేరుగా తీసుకోకుండా కార్యాలయంలో పనిచేసే తాత్కాలిక ఉద్యోగి ద్వారా దండుకుంటున్నారు. అయితే ఈ కార్యాలయం అధికారులు అవినీతి, అక్రమాల విషయంలో ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ రెండేళ్ల నుండి జరిగిన రిజిస్ట్రేషన్లకు సంబంధించి పూర్తిస్థాయి విచారణ జరిగితే అవినీతి, అక్రమాలు కోకొల్లలుగా వెలుగుచూసే అవకాశాలున్నాయి. వందల ఎకరాల ప్రభుత్వభూమి అవినీతి కారణంగా అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లకుండా భావితరాలకు ఉపయోగపడుతుంది. ఈ కార్యాలయంలో జరిగే పనులకు ఒకొక్కదానికి రేటును నిర్ణయించినట్టు తెలిసింది. పట్టణ పరిధిలో జరిగే రిజిస్ట్రేషన్ పనులకు సెంటుకు 750 నుండి 1000 రూపాయల వరకు, గ్రామీణ ప్రాంతాల్లో జరిగే రిజిస్ట్రేషన్ పనులకు సెంటుకు 400 నుండి 600 వందల వరకు ధరలు కూడా నిర్ణయించినట్టు సమాచారం. అలాగే నకలు, ఈసిలకైతే ప్రభుత్వ ఫీజుతో పనిలేకుండా 500 రూపాయల వరకు, వివాహ సర్ట్ఫికెట్‌కు కూడా ప్రభుత్వ ఫీజుతో పనిలేకుండా 800 రూపాయల వరకు అవినీతి సొమ్మును దండుకుంటున్నట్టు ఆరోపణలున్నాయి. డికెటి భూములు అమ్మకూడదు, కొనకూడదు, రిజిస్ట్రేషన్లు చేయకూడదన్న నిబంధనలున్నా హైకోర్టులో పిటీషన్లువేసి సబ్ రిజిస్ట్రార్, రెవెన్యూ శాఖల సహకారం, ఆన్‌లైన్ మోసాలతో, చట్టంలోని లోపాలను తమకు అనుకూలంగా మార్చుకుంటూ తప్పుడు రికార్డులతో, తమ పూర్వీకుల ఆస్తులుగా, డికెటి భూముల విషయంలో రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఆ ప్రాంతంలో భూమిధరను బట్టి ఎకరాకు 50వేల నుండి లక్ష రూపాయల వరకు అవినీతి జరుగుతున్నట్టు సమాచారం ఇందులో రెవెన్యూ, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ అధికారులు కుమ్మక్కై అవినీతికి పాల్పడుతున్నట్టు తెలుస్తొంది. ఇలాంటి సందర్భాల్లో పూర్తిస్థాయి విచారణ లేకుండానే రిజిస్ట్రేషన్లు జరిగిపోతునట్టు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అలాగే సరైన చర్యలు లేని కారణంగా రెవెన్యూశాఖ నుండి పాసు బుక్కుల మార్పిడిలు, పాసుబుక్కుల పుట్టుకలు అవినీతి కారణంగా యధేచ్చగా పుట్టుకొస్తున్నట్టు కూడా ఆరోపణలున్నాయి. కొన్ని సందర్భాల్లో ఇలాంటి భూములను అమాయకులైన వారు కొనుగోలు చేయడం వల్ల వారు ఇబ్బందులు ఎదుర్కొనక తప్పనిసరి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. సబ్ రిజిస్ట్రేషన్, రెవెన్యూ శాఖల్లో అవినీతిని అంతమొందిస్తే తప్ప పేద భావితరాలకు ప్రభుత్వ భూములు అందించేందుకు పరిస్థితులు అనూకూలించవు. ఈ శాఖల అవినీతి, అక్రమాలను అరికట్టేందుకు సత్వరం ఈ శాఖల ఉన్నతాధికారులతో కాకుండా ఇతరశాఖల ఉన్నతాధికారులతో పూర్తిస్థాయి విచారణ జరపాల్సిన అవసరం ఉంది. అలాగే రిజిస్ట్రేషన్ ఛార్జీలకు సంబంధించి జరిగిన అక్రమాలు కూడా పూర్తిస్తాయి విచారణలో వెల్లడయ్యే అవకాశాలున్నాయి.