కడప

గాలివీడులో 32.2 మిమీ వర్షపాతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాలివీడు, జూలై 29: మండల కేంద్రంలో శుక్రవారం ఉదయం కురిసిన వర్షం 32.2మిమీగా నమోదైందని సహాయ గణాంకాధికారి కొండయ్య తెలిపారు. తెల్లవారుజాము 4 గంటల నుండి ఏకధాటిగా కురిసిన వర్షానికి ఎగువగొట్టివీడు, గోరాన్‌చెరువు గ్రామాల్లోని చిన్న చిన్నకుంటలు, నిండి వాగులు అలుగు పారుతోంది. ప్రధానంగా అరవీడు గ్రామంలోని పొదలవంక ఉధృతికి కుషావతినదిలోని చెక్‌డ్యాంలలో అలుగులు పారుతున్నాయి. ఈ వర్షంతో పూర్తిగా భూగర్భ జలాలు పెంపొందుతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ వరినార్లు పోసి నెల రోజులు కావస్తుండటంతో ఈ వర్షపు నీటితో నారు మడులలో దుక్కులు చేసి వరి నాటడానికి రైతులు సమాయత్తమవుతున్నారు. ఈ రోజు కురిసిన వర్షంతో రైతుల మోములో ఆనందం వెల్లివిరుస్తోంది.