కడప

మానవ మనుగడకు మొక్కలే ఆధారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయచోటి, జూలై 29: మానవ మనుగడకు మొక్కలే ఆధారమని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. వన మహోత్సవంలో భాగంగా మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ రాజు ఆధ్వర్యంలో చిత్తూరు మార్గంలోని స్ర్తిశక్తి భవనం సమీపంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ నసీబున్ ఖానమ్, తహసీల్దార్ గుణభూషణ్ రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని ఆయన సూచించారు. నేటి మొక్కలే రేపటి పౌరులకు ఎంతో ఉపయోగపడుతాయని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటాలని ఆయన చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా మొక్కలు నాటాలన్నారు. మొక్కలు నాటితే ప్రశాంతమైన వాతావరణం ఉండడమే కాకుం డా, చల్లదనం, స్వచ్ఛమైన వాయువును అందించి కాలుష్యాన్ని తగ్గిస్తాయన్నారు. రాయచోటి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పదివేల మొక్కలు నాటడం చాలా సంతోషకరమన్నారు. ఇందుకు కృషి చేసిన మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ రాజును ఆయన అభినందించారు. పట్టణ సుందరీకరణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం మున్సిపల్ చైర్ పర్సన్ నసీబున్ ఖాన మ్ మాట్లాడుతూ మొక్కలు నాటడం వల్ల అవి ఎంతోగానో ఉపయోగపడుతాయని తెలిపారు. కాలుష్య నివారణతో పాటు మానవ మనుగడ మొక్కల పెంపకాలతోనే ముడిపడి ఉంటుందన్నారు. మొక్కలను నాటి వాటి సంరక్షణ చర్యలను కూడా చేపట్టాలని సూచించారు. ప్రతి ఒక్కరూ మొక్కలను విధిగా నాటి సంరక్షించాలని కోరారు. కార్యక్రమంలో మునిసిపల్ వైస్‌ఛైర్మన్ ఇందాదుల్లా, కో ఆప్షన్ సభ్యులు సలావుద్దీన్, కౌన్సిలర్ ఫయాజుర్‌రెహిమాన్, మునిసిపల్ డీఈ సుబ్రమణ్యం, వృక్ష సంరక్షణ సమితి అధ్యక్షులు తులసీశ్వర్‌రెడ్డి, మునిసిపల్ సిబ్బంది పాల్గొన్నారు.