కడప

బంగారం, వెండి నగలు స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దవటం,జూలై 31: మండల పరిధిలోని మాధవరం -1 గ్రామంలోని పార్వతీపురం గ్రామంలో చోరీకి పాల్పడిన దొంగను ఆదివారం సిద్దవటం ఎస్‌ఐ లింగప్ప అరెస్టు చేశారు. అతని వద్దనుంచి రెండు బంగారు చైన్లు, ఒక ఉంగరం, రెండు జతల వెండి పట్టీలు స్వాధీనం చేసుకున్నారు. చోరీ విషయమై ఆదివారం సాయంత్రం సిద్దవటం పోలీసుస్టేషన్‌లో ఒంటిమిట్ట సిఐ వివరా లు వెల్లడించారు. సిద్దవటం మండలం మాధవరం -1లోని దళితవాడకు చెందిన మామిళ్ల చిన్నఓబులేసు అదే గ్రామపంచాయతీకి చెందిన పార్వతీపురంలో చిప్పల రాజ నివాస గృహంలో జూన్ 4వ తేదీ రాత్రి చోరీకి పాల్పడ్డారన్నారు. ఈవిషయమై అప్పట్లో బాధితులు ఫిర్యాదు చేశారన్నారు. మామిళ్ల ఓబులేసు చిన్నచిన్న దొంగతనాలుపాల్పడేవారని, అతనిపై అనుమానంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టామన్నారు. ఆదివారం భాకరాపేట బస్టాండులో అనుమానరీతిలో కన్పించగా అతన్ని అదుపులోకి తీసుకుని సోదాచేశామన్నారు. అపహరించిన బంగారు, వెండి నగలు విక్రయించేందుకు కడపకు వెళ్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. అతన్ని అరెస్టుచేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఎస్‌ఐ చెన్నయ్య, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.