కడప

లీకేజీలతో గమ్యం చేరని రోళ్లమడుగు నీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీరబల్లి, జూలై 31: మండల పరిధిలోని పలు గ్రామాల్లో ప్రజలకు తాగునీరు అందించేందుకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి రోళ్లమడుగు నీరు గ్రామ గ్రామానికి అందించే క్రమంలో పలుచోట్ల లీకేజీలతో నీరు వృధాగా పోతోంది. సంవత్సరాలు గడుస్తున్నా మండలంలో తాగునీటి కొరత తీరలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. వీరబల్లిటౌన్‌లోకి రోళ్లమడుగు తాగునీరు అందించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని చెప్పవచ్చు. దీనికంతటికీ నాశిరకం పనులే కారణమని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాగునీటి కొరత లేకుండా పరిపూర్ణంగా ఒక్క గ్రామానికైనా అందిస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి తాగునీటి సమస్యపరిష్కరించాలన్న లక్ష్యంతో ఉన్నా అధికారుల నిర్లక్ష్యం వలన ఫలితం అంతంత మాత్రమేనని స్థానిక మహిళలు సైతం ఆరోపిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో స్వచ్ఛమైన రోళ్లమడుగు తాగునీరు ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నారు. మండలానికి రెండు పైపులైన్లు ఏర్పాటు చేశారు. కొత్తరోడ్డు వద్ద నుంచి గుర్రప్పగారిపల్లె గ్రామంలో నుండి వీరబల్లి వరకు పైపులైన్ వేశారు. మరొకటి ఓదివీడు వ్ద నుండి మట్లి గ్రామం మీదుగా ఏర్పాటు చేశారు. వీరబల్లికి వచ్చే పైపులైన్ ద్వారా పలుచోట్ల ఇప్పటికే తాగునీరు అందించిన దాఖలాలు లేవని పలువురు ఆరోపిస్తున్నారు. ఇందుకు కారణాలేమిటో సంబంధిత అధికారులకే ఎరుక. ఓదివీడు వద్ద నుంచి వచ్చే పైపులైన్ ద్వారా అప్పుడప్పుడు తాగునీరు వస్తున్నా లీకేజీలతో కొన్నిచోట్ల వృధాగా నీరుపోతోంది. గంగరాజుపల్లె, ఓదివీడు కస్పామధ్యలో పైపు మెయిన్ పైపులైనే లీకేజీ కావడంతో పనుల్లో ఎంత వరకు నాణ్యత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇందుకు కారణం అధికారుల పర్యవేక్షణా లోపమా లేక కాంట్రాక్టర్ చేతివాటమా అని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోలేదని చెప్పవచ్చు. ఇప్పటికైనా సంబంధిత అదికారులు స్పందించి వీరబల్లి టౌన్ మరియు పక్క గ్రామాలకు తాగునీరు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.