కడప

నేడు పాఠశాల విద్యాకమిటీ ఎన్నికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,జూలై 31: నేడు పాఠశాల విద్యాకమిటీ ఎన్నికలు జరుగనున్నాయి. పాఠశాలల విద్యాభివృద్ధికి ఎంతో దోహదపడేందుకు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పాఠశాల అభివృద్ధికమిటీ ఎన్నికలు జరుపుతోంది. ఆ ఎన్నికలు ప్రభుత్వ లక్ష్యానికి భిన్నంగా రాజకీయ ఎన్నికల తరహాలో హోరాహోరీగా పోరుకొనసాగుతోంది. సోమవారం జిల్లా వ్యాప్తంగా దాదాపు 4వేల పాఠశాల అభివృద్ధి విద్యాకమిటీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ మద్దతుదారులు బరిలోకి దిగి సోమవారం జరిగే ఓటింగ్ ప్రక్రియలో తాడోపేడో తేల్చుకోనున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకమునుపు పదేళ్లపాటు కాంగ్రెస్‌పాలనలో ఉన్నందున మూడేళ్లముందు జరిగిన ఎంపిటిసిలు, సర్పంచ్ ఎన్నికల్లో అధికసంఖ్యలో వైకాపా మద్దతుదారులే సర్పంచ్‌లుగా కొనసాగుతూ రాజకీయంగా అన్ని గ్రామాల్లో వైకాపా నేతలే హవా చలాయిస్తున్నారు. తెలుగుదేశంపార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైకాపా ప్రాబల్యాన్ని అంచలంచలుగా తగ్గిస్తు వస్తున్నారు. గ్రామస్థాయి ఎన్నికలైనందున రాజకీయ పార్టీ నేతల ప్రాబల్యం కంటే స్థానికులు తమ పరువు పటిష్టలు కాపాడుకునేందుకు విద్యాకమిటీ పదవులు చేజిక్కించుకోవడానికి నువ్వా నేనా అని ఇరుపక్షాల నేతలు తలపడుతున్నారు. అయితే సగం విద్యాకమిటీలు ఏకగ్రీవంగా ఎన్నిక జరిగినా చర్చలు కొనసాగిస్తున్నారు. ఫ్యాక్షన్ ప్రాంతాల్లోనూ, అధికారపార్టీలోనే నేతల్లో రెండువర్గాలు ఉన్న ప్రాంతాల్లో ఎన్నికలు బరిలో తమ వర్గాలవారిని గెలిపించుకోవాలన్న ధీమాతో అధికారపార్టీకి చెందిన రెండు వర్గాలు భావిస్తున్నారు. ఇక వాస్తవ పరిస్థితులకు వస్తే పాఠశాలల అభివృద్ధి కమిటీలో ఆ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులే బరిలో దిగాలని , ఆపాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులే ఓటుహక్కు వినియోగించుకోవాలన్న నిబంధన ఉండటంతో ఇరుపార్టీలకు చెందిన వారు తమకు అనుకూలంగా ఉండి నమ్మినబంటుగా ఉండే వారినే అధ్యక్షునిగా ఎన్నికల బరిలో దించారు. వైకాపా ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో సంబంధిత పాఠశాలల హెడ్మాస్టర్, మండల విద్యాశాఖాధికారులు ఈ ఎన్నికల్లో ఎవరికీ చెప్పుకోలేక తలలుపట్టుకుని కూర్చున్నారు. మామూలు ఎన్నికలైతే ఎన్నికల నిబంధనల ప్రకారం ఎన్నికలు నిర్వహించాల్సివుంటుంది. విద్యాకమిటీ ఎన్నికలకు నిబంధనలు ఉన్నా అధికారపార్టీ నేతలదే పైచేయిగా ప్రతి దానికి పాఠశాలల హెడ్మాస్టర్లను, విద్యాశాఖాధికారులను హెచ్చరిస్తూ తమ అనుచరగణానికి పదవులు ఇప్పించాలని ఒత్తిళ్లు తెస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఎన్నికల్లో స్థానిక రాజకీయ భవిష్యత్ సోమవారం ఓటింగ్ ప్రక్రియలో తేలనుంది.