కడప

కుందూ, పెన్నానదులకు జలకళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,జూలై 31: జిల్లాలో నాలుగురోజులుగా వర్షం కురుస్తుండటం, కర్నూలు జిల్లా దిగువప్రాంతాల నుంచి వర్షం నీరు జిల్లాలోని కుందు, పెన్నానదుల్లో నీటి ప్రవాహం మొదలైంది. కుందూకు వెయ్యిక్యూసెక్కుల నీరు పైబడి కర్నూలు జిల్లా దిగువ ప్రాంతాల నుంచి చేరాయి. అలాగే పెన్నానది నీటి ప్రవాహం పెరిగి ఆ నదుల్లో భాగంగా ఆదినిమ్మాయపల్లె ఆనకట్టకు నీరు చేరి పెన్నానది నుంచి ప్రవాహం మొదలైంది.
అలాగే జిల్లాలోని బుగ్గవంక, మైలవరం, గండికోట ప్రాజెక్టులకు ఇప్పుడిప్పుడే నీరు చేరుతోంది. జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు కుంటలు, చెరువులకు ఒక మోస్తరులో నీరు చేరింది. జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు వస్తే, మరికొన్ని ప్రాంతాల్లో ఓమోస్తరు వర్షం కురుస్తోంది. గత ఏడాది ఇదే సమయానికి ఈ తరహాలో వర్షాలు కురవకపోయిన ప్రస్తుతం వర్షాలు ఆశాజనకంగానే ఉన్నాయి. ఖరీఫ్‌లో సాగుచేసిన పంటలకు ఈ వర్షాలు ఉపయోగపడనున్నాయి. అలాగే నీరు-చెట్టు కింద తవ్వకాలు చేసిన కాలువలకు, కుంటలు, చెరువుల ప్రాజెక్టుల సప్లై చానళ్లకు, వంకలు, వాగులకు ఈ వర్షాలతో నీరు పరవళ్లుతొక్కుతూ ప్రవహిస్తున్నాయి. మద్యతరహా జనవరులశాఖకు చెందిన చెరువులను ఆకస్మికంగా కురుస్తున్న వర్షాలకు నీరు వచ్చినట్లయితే గండి పడే అవకాశాలున్నాయని సంబంధిత ప్రజలు, అధికారులు అప్రమత్తమయ్యారు. అయితే కుంటలు, చెరువులతోపాటు బ్రహ్మంసాగర్ ప్రాజెక్టు మరమ్మతులో ఉన్నకారణంగా భారీ వర్షాలు కురుస్తే గండ్లుపడి భారీ ఎత్తున నష్టం వాటిల్లే అవకాశాలున్నాయి. మొత్తం మీద జిల్లాలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు నీటి ప్రవాహం పెరిగి కుందు, పెన్నానదులు పరవళ్లుతొక్కుతున్నాయి. పాపాఘ్ని, చెయ్యేరు, మాండవ్య, బహుద నదులు కూడా ఏమాత్రం నీరుచేరినా ప్రవహించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ వర్షాలు ఖరీఫ్‌లో సాగుచేసుకుంటున్న ఆరుపడి పంటలకు, వరికి ఎంతో తోడ్పాటు అందించే అవకాశాలున్నాయి.