కడప

హిట్లర్‌ను తలపిస్తున్న చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కమలాపురం, ఆగస్టు 2: రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం బ్రిటీష్ పాలనను గుర్తు చేస్తోందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు హిట్లర్‌ను తలపించేలా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి విమర్శించారు. ఆయన మంగళవారం విలేకర్లతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రత్యేక హోదా కోసం వైసిపి బంద్ నిర్వహించగా సహించలేక పోలీసులతో తమ పార్టీ, అఖిలపక్ష నేతలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి పోలీసుస్టేషన్లకు తరలించడం దారుణమన్నారు. తెలుగు దేశం పార్టీ నేతలు పోలీసుపహారాలో తిరుగుతున్నారని ప్రజల ముందుకు వస్తే తగిన బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. ప్రధాని మోదీ, సిఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో అనాడు ఇచ్చిన హామీలను తుంగ లో తొక్కి దొంగనాటకాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. విభజన చట్టం లోని హామీ అయిన ప్రత్యేక హోదాను ఏపికి ఇవ్వలేమని కేంద్రం స్పష్టం చేసిన సమయంలో రాష్ట్ర ప్రజలు బిజేపి, టిడిపిని బంగాళాఖాతంలో కలిపేస్తారన్న భయంతో చంద్రబాబు ఇప్పుడు ప్రత్యేక హోదాపై మాట మారుస్తున్నారని విమర్శించారు. అరెస్ట్‌లకు భయపడేది లేదని హోదా సాధించే వరకు పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేసారు.
వేంపల్లెలో...
వేంపల్లె: ప్రత్యేక హోదా కోసం వైకాపా ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర బంద్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం వేంపల్లెలో వైకాపా శ్రేణులు బంద్ నిర్వహించారు. వేకువజాము నుండే వైకాపా శ్రేణులు బంద్ నిర్వహించారు. ఈ బంద్‌లో ఆర్టీసీ బస్సు అద్దాలను స్వల్పంగా ధ్వంసం చేసి బస్సు టైర్లలో గాలి తీశారు. అలాగే పులివెందుల, ప్రొద్దుటూరు, రాయచోటి ప్రాంతాల్లోని బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. పట్టణంలోని పాఠశాలలు, వాణిజ్య వ్యాపార సముదాయాలను వైకాపా శ్రేణులు మూయించారు. వీరికి ఏఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ సంఘాలు మద్దతు తెలిపారు. బంద్ నిర్వహిస్తున్న ఎంపీపీ రవికుమార్‌రెడ్డి మరి కొంత మందిని వేంపల్లె పోలీసులు అరెస్టు చేసి సొంత పూచీకత్తుపై వారిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రవికుమార్‌రెడ్డి, జడ్పీటీసీ షబ్బీర్‌వలి, వైకాపా మండల కన్వీనర్ చంద్ర ఓబులరెడ్డి, సింగిల్‌విండో ప్రెసిడెంట్ చంద్రశేఖర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి, కత్తులూరు సర్పంచ్ ప్రసాదరెడ్డి, వైకాపా సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, వైకాపా నాయకులు, ఏఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు పాల్గొన్నారు.