కడప

నేడు పట్టాలపై పరుగులు తీయనున్న నంద్యాల-కడప ప్యాసింజర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,ఆగస్టు 22: కడప -కర్నూలు జిల్లాల ప్రజల కలలు సాకారం కానున్నాయి. మంగళవారం నంద్యాల నుంచి కడప వరకు ప్రయాణించే ప్యాసింజర్ రైలును కేంద్రరైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు, ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు విజయవాడలో లాంఛనంగా ప్రారంభించనున్నారు. దశాబ్దకాలంగా నత్తనడకన నడిసిన ఎర్రగుంట్ల -నంద్యాల రైల్వేలైన్ పనులుపూర్తికావడంతో ఈ ప్యాసింజర్ రైలు సాకారం కానుంది. 77401 నెంబర్ డెమో ప్యాసింజర్ రైలును మంగళవారం మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో విజయవాడలో రిమోట్ కంట్రోల్ ద్వారా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి కడప, కర్నూలు జిల్లాల ఆయానియోజకవర్గ ప్రజాప్రతినిధులు, మంత్రులు, రైల్వే అధికారులు పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున హాజరుకానున్నారు. ఎనిమిది బోగీలతో ప్రయాణించే ఈరైలు మార్గం నంద్యాల నుంచి మద్దూరు, బనగానపల్లి, కోవెలకుంట్ల, సంద్యామల, నొస్సం, ఉప్పలపాడు, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు మీదుగా ఎర్రగుంట్ల చేరుకుంటుంది. అక్కడి నుంచి కమలాపురం, గంగాయపల్లె మీదుగా కడపకు చేరుకుంటుంది. ఈ సందర్భంగా ఎర్రగుంట్ల, కడప రైల్వేస్టేషన్లలో ఈరైలుకు స్వాగతం పలికేందుకు ప్రజాప్రతినిధులు సిద్దం అవుతున్నారు. ప్రారంభోత్సవం రోజు మాత్రం సాయంత్రం 3గంటలకు బయలుదేరి ఎర్రగుంట్లకు సాయంత్రం 6గంటలకు, కడపకు రాత్రి 8గంటలకు చేరుకుంటుందని రైల్వే అధికారులు పేర్కొన్నారు. మామూలుగా ఈ ప్యాసింజర్ రైలు ప్రతిరోజు నంద్యాలలో ఉదయం 6గంటలకు బయలుదేరి 10.30గంటలకు ఎర్రగుంట్ల, 11.30గంటలకు కడపకు చేరుకుంటుంది. అనంతరం కడప నుంచి ప్యాసింజర్ మధ్యాహ్నం 1గంటకు బయలుదేరి సాయంత్రం 6.30గంటలకు నంద్యాల చేరుకుంటుంది. ఎర్రగుంట్ల-నంద్యాల రైల్వేనిర్మాణం పూర్తికావడంతో ఈ ప్రాంతం ప్రయాణికుల అవసరాలతోపాటు పారిశ్రామిక అవసరాలు కూడా తీరనున్నాయి. ముఖ్యంగా ఆర్‌టిపిపి, భారతిసిమెంట్స్, జువారి, ఐసిఎల్, దాల్మియా తదితర కర్మాగారాలకు రావాల్సిన బొగ్గు ఈ రైలు మార్గం ద్వారా చేరనుంది. దీంతో అటు ప్రభుత్వ,ప్రైవేట్ రంగాలకు వ్యయభారంతోపాటు సమయం కలిసిరానుంది. అలాగే ఈ రైలుమార్గం మీదుగా విజయవాడతోపాటు నూతనంగా నిర్మించే అమరావతికి కూడా ఈప్రాంత ప్రజలు సౌకర్యంగా చేరుకునేందుకు అవకాశం కలుగుతుంది. ప్రస్తుతం విజయవాడ తదితర ప్రాంతాలకు వెళ్లాలంటే ఎంతో వ్యయప్రయాసాలతో రేణిగుంట, గూడూరు, నెల్లూరు మీదుగా విజయవాడకు చేరుకోవాల్సివుంది. దీనివల్ల ప్రయాణికులకు సమయాభావం పెరగడంతోపాటు ఆర్థికభారం పెరుగుతోంది. త్వరలో ఈరైల్వేమార్గం గుండా ఎక్స్‌ప్రెస్ రైళ్లను కూడా నడిపే అవకాశాలున్నట్లు రైల్వే అధికారులు పేర్కొంటున్నారు. అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు ఈరైలు మార్గంపై మరిన్ని రైళ్లను నడిపేందుకు కృషి చేస్తే ఈప్రాంత ప్రయాణికుల అవసరాలతోపాటు వాణిజ్యకార్యకలాపాలు, రాజధానికి సంబంధాలు పెరుగుతాయి. ఈ విషయంమై ప్రజాప్రతినిధులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

కెసి కెనాల్ నీటికోసం ఉద్యమిద్దాం

చాపాడు, ఆగస్టు 22: జిల్లాలోని కెసికెనాల్ నీటి సరఫరాపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన విడుదల చేయకపోతే ఉద్యమించక తప్పదని మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి పేర్కొన్నారు. సోమవారం మండలంలోని రాజువారిపేట, కొత్తరాజువారిపేట గ్రామాలలో ఎమ్మెల్యే గడపగడపకూ వైకాపా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీశైలం జలాశయంలో 873 అడుగుల నీటి నిల్వ ఉన్నప్పటికీ కెసి కెనాల్, తెలుగుగంగ ప్రాజెక్టులకు నీటిని విడుదల చేసినప్పటికీ ఈ నీరు ఎంతవరకు ప్రవహిస్తుందనే దానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. తాగు, సాగునీటి కోసమని ఈనెల 12న రాజోలి ఆనకట్ట నుంచి కెసికెనాల్‌కు నీరు విడుదల చేశారన్నారు. కృష్ణా పుష్కరాల అనంతరం కెసి కెనాల్ నీటి సరఫరాపై స్పష్టత ఇస్తామని ప్రకటించిన అధికారులు ఇంతవరకు నోరుమెదపలేదని ఆయన పేర్కొన్నారు. సోమవారం కడప, కమలాపురం, ప్రొద్దుటూరు, మైదుకూరు ఎమ్మెల్యేలు అంజద్‌బాషా, రవీంద్రనాథ్‌రెడ్డి, రాచమల్లు శివప్రసాదరెడ్డి, రఘురామిరెడ్డిలు కలిసి జిల్లా కలెక్టర్ సత్యనారాయణకు సాగునీటి విషయంపై చర్చించడం జరిగిందన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తాను రైతులకు న్యాయం చేస్తానని కలెక్టర్ ప్రకటించడం జరిగిందన్నారు. ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన ఇవ్వకపోతే ఈనెల 25న కడప కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తామని ఆయన హెచ్చరించారు. కెసికెనాల్‌కు ఈ ఏడాది నీటి విడుదలపై స్పష్టమైన ఆదేశాలున్నప్పటికీ ప్రభు త్వం వాటిని అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ఈసారి శ్రీశైలం జలాశయానికి ఆశాజనకంగా నీటిమట్టం చేరి 873.6 అడుగుల నీటిమట్టంతో 155 టి ఎంసీల నీరు నిల్వ వుందని, 841 అడుగులకు చేరగానే రాయలసీమ ప్రాంతాలకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీరు విడుదల చేసేందుకు వీలున్నా ప్రభుత్వం రాయలసీమ రైతాంగంపై సీత కన్ను వేసిందన్నారు. మరోవైపు పట్టిసీమ జలాలను ప్రకాశం బ్యారేజ్‌కు తరలించి అక్కడ వాడుకొనే నీటిని శ్రీశైలం ద్వారా రాయలసీమ జిల్లాలకు మళ్లిస్తామని పదేపదే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటిస్తున్నా ప్రస్తుత పరిస్థితులనుబట్టి చూస్తే ఆయనకు రాయలసీమపై ఎంత అభిమానముందే తెలుస్తోందన్నారు. స్పష్టమైన ప్రకటన చేయకపోతే సమస్య పరిష్కారమయ్యే వరకు ఉద్యమిస్తామని ఆయన పేర్కొన్నారు. గడపగడపకూ వైకాపాలో భాగంగా గ్రామాలలో పర్యటిస్తున్న తనకు రైతులు, మహిళలు, వివిధ రకాల చేతివృత్తుల వారితోపాటు వృద్దులు, వికలాంగులు, వితంతువులు, పేదలు తమ సమస్యలను తమ దృష్టికి తెస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం చేసిన మోసాలకు రాయలేని భాషలో ప్రజలు బూతులు తిడుతున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం కన్ను తెరిచి ప్రజా సమస్యలపై స్పందించి వారి సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జడ్పిటిసి బాలనరసింహారెడ్డి, ఎంపిపి బిర్రు కొండమ్మ, మండల ఉపాధ్యక్షుడు సానే నరసింహారెడ్డి, మండల కన్వీనర్ రాజశేఖర్‌రెడ్డి, వైకాపా నాయకులు బిర్రు రామచంద్రయ్యయాదవ్, లక్షుమయ్యయాదవ్, జయసుబ్బారెడ్డి, జివి.సుబ్బారెడ్డి, నాగసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రెయిన్‌గన్ వాడకంపై
రైతులకు అవగాహన
సుండుపల్లె, ఆగస్టు 22: మండలంలోని ముడుంపాడు పంచాయతీ ఆరోగ్యపురం నందు వేరుశెనగ ఎండిపోతున్న మాజీ సర్పంచ్ రామస్వామిరెడ్డి రైతు పొలంలో రెయిన్‌గన్ వినియోగాన్ని జేడీ ఠాగూర్‌నాయక్ ఆధ్వర్యంలో రైతులకు చూపించి సలహాలు, సూచనలు అందించారు. తీవ్ర వర్షాభావంతో ఎండిపోతున్న వేరుశెనగకు ఒక తడి రెయిన్‌గన్స్ ద్వారా వేరుశెనగ తడిపేందుకు ప్రభుత్వం మండలానికి నూరు పైపులు, నాలుగు రెయిన్‌గన్లను సరఫరా చేసిందని సూచించారు. వేరుశెనగ పంటకు నీటిని పట్టే ముందు ఉదయం, సాయంత్రం 2 కేజీల యూరియాను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసి పంటను కాపాడుకోవచ్చని తెలిపారు. అలాగే మండలంలో వేరుశెనగ వేసిన రైతుల పంటలు ఎండిపోతూ ఉంటే వ్యవసాయ కార్యాలయం దగ్గరికి తమ పాసుపుస్తకం ఆధార్‌కార్డు, రేషన్‌కార్డులతో వచ్చి పైపులు, రెయిన్‌గన్లు తీసుకుపోవచ్చని ఏవో పవన్‌కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎం ఐపీ పథకం సంచాలకులు మధుసూధనరెడ్డి, ఉత్తమ రైతు అమ్రూనాయక్, ముడుంపాడు రైతులు పాల్గొన్నారు.

వీరభద్రాలయంలో ఘనంగా పల్లకిసేవ

రాయచోటి, ఆగస్టు 22: స్థానిక భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి వారి దేవస్థానంలో శ్రావణ మాస మూడో సోమవారం సందర్భంగా పల్లకీ సేవను అత్యంత కన్నుల పండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా కన్నడ భక్తులు, గ్రామస్థులు పాల్గొని స్వామి వారికి 246 రుద్రాభిషేకాలు, శ్రీ అఘోర లింగేశ్వరస్వామికి 10 అభిషేకాలు, నందిపూజలు, కుంకుమార్చనలు, టెంకాయలు కొట్టి మంగళహారతులు ఇచ్చి తమ మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పల్లకీసేవలో సంబేపల్లె మండలం ముదినేనివాండ్లపల్లె వాసులచే తలాలు, పిల్లలగ్రోవి సాంస్కృతిక కార్యక్రమాలు అలరించినట్లు ఆలయ ఈవో మంజుల తెలిపారు.