కడప

ఉపాధ్యాయ ఏకీకృత సర్వీస్ నిబంధనలు అమలు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాలివీడు, ఆగస్టు 23, ప్రభుత్వం ఉపాధ్యాయ ఏకీకృత సర్వీస్ రూల్స్‌ను వెంటనే అమలు చేసి, పర్యవేక్షిణ అధికారుల పోస్టులను భర్తి చేయాలని ఎస్టీయు రాష్ట్ర అధ్యక్షులు కత్తి నరసింహారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం స్ధానిక జెడ్పీబాలికోన్నపాఠశాలలో ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఈసమావేశానికి ముఖ్యఅతిధిగా హాజరైన ఆయన మాట్లాడుతూ రాష్ట్రేతర ఆసుపత్రులలో కూడా ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్‌కార్డులను వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. ప్రతి ఉద్యోగి ప్రీమియం చెల్లిస్తున్నప్పటికీ సరైన వైద్య సేవలు పొందలేకపోతున్నారన్నారు. రాష్ట్రంలో దాదాపు 8లక్షల మంది ఉద్యోగులు, పెన్సనర్లకు ప్రయోజనం కలిగే విధంగా 10వ పీ ఆర్సీని అమలు చేయడంతోపాటు 10నెలల పీ ఆర్సీ బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన సీపీఎస్ పరీక్షా విధానాన్ని రద్దు చేయుటకు సెప్టెంబర్‌నెలలో ప్రధాన మంత్రికి, ముఖ్యమంత్రికి ఎస్టీయు తరుపున లక్ష వినతి పత్రాలను అందజేయనున్నామన్నారు. జాతీయ విద్యావిధానం డ్రాప్స్ రూల్స్‌లో అసంబంధమైన అంశాలను తొలగించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో అభివృద్ధి, వౌలిక వసతుల కోసం ప్రభుత్వం రూ.4,999కోట్లు నిధులను విడుదల చేయడం జరుగుతోందన్నారు. మేనేజ్‌మెంట్ వివక్షలేకుండా అన్ని మేనేజ్‌మెంట్‌ల ఉపాధ్యాయులకు ప్రభుత్వ ఉత్తర్వులను వెంటనే అమలు చేయాలన్నారు. ఈ సమావేశంలో ఎస్టీయు రాష్ట్ర కార్యదర్శి రవీంధ్రనాధ్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి బాలగంగిరెడ్డి, జిల్లా ఉపాధ్యాక్షులు రామక్రిష్ణారెడ్డి, ప్రధానోపాధ్యాయులు నాగముని, మహబూబ్‌బాషా, ఎస్టీయు మండల కార్యదర్శి కుమారస్వామి, జిల్లా కౌన్సిలర్‌లు రెడ్డెన్న, చంద్రశేఖర్‌రాజు, అంజద్‌బాషా, తదితరులు పాల్గొన్నారు.