కడప

ఇన్‌పుట్ సబ్సిడీపైనే రైతుల ఆశలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, సెప్టెంబర్ 2: జిల్లాలో పలుప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొని చేతికందాల్సిన వేరుశెనగ వర్షాలు రాకపోవడంతో కాయ ఉత్పత్తి పెంచుకుని పంటపొలాల్లో నిట్టనిలువునా ఎండిపోయాయి. ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు గురువారం జిల్లా పర్యటన సందర్భంగా వేరుశెనగ రైతాంగాన్ని అన్నివిధాల ఆదుకుంటామని అనంతపురం జిల్లా తరహాలో 90శాతం ఇన్‌ఫుట్ సబ్సిడీ జిల్లాకు ఇస్తానని హామీ ఇవ్వడంతో రైతులు ఇన్‌ఫుట్ సబ్సిడీపై గంపెడుఆశలు పెట్టుకుని ధైర్యంగా ఉన్నారు. జిల్లాలో నెలరోజులుగా వర్షాలు కురవకపోవడం మే చివరి, జూన్ మొదటి వారంలో సాగుచేసిన వేరుశెనగ, బుడ్డశెనగ, కంది, పసుపు, పత్తి తదితర పంటలు నిట్టనిలువునా ఎండుతున్నాయి. జూన్ చివరి, జూలై మొదటివారంలో సాగుచేసిన పంటలు కొంతమేరకు బాగానే ఉన్నాయి. నెలరోజులుగా వర్షాలు కురవకపోవడం, మూడురోజుల క్రితం భారీ ఎత్తున వర్షాలు కురిసినా ఆ వర్షాలు జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు, కమలాపురం నియోజకవర్గాల్లోని కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యాయి. దీంతో ఈ ఏడాదిలో ఖరీఫ్‌లో రెండవ పర్యాయం సాగు చేసిన పంటలే ఆశాజనకంగా ఉన్నాయి. జిల్లాలో రాయచోటి, లక్కిరెడ్డిపల్లి, పులివెందుల, ప్రొద్దుటూరు, రాజంపేట, రైల్వేకోడూరులలో అత్యధికంగా వర్షాభావం పై ఆధారపడి వేరుశెనగ సాగుచేశారు. జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్‌సీజన్‌లో 1,73,148 హెక్టార్లలో పంటసాగుచేయాల్సివుండగా, 1,34,405 హెక్టార్లలో సాగుచేసేందుకు లక్ష్యంగా పెట్టుకుని ఇప్పటి వరకు లక్ష ఎకరాల హెక్టార్ల వరకు సాగుచేశారు. ఆముదం 5వేల హెక్టార్లు, కంది 10వేల హెక్టార్లలో, పత్తి 32వేల హెక్టార్లలో తదితర పంటలు సాగుచేశారు. నెలరోజులపాటు వర్షాలు కురవని కారణంగా పంటలన్నీ ఎండిపోయాయి. వరి నర్సరీలు పెంచుకుని వరినాట్లు వేసుకోలేని దయనీయ పరిస్థితిలో ఉన్నారు. పండ్లతోటలకు కూడా భారీ ఎత్తున నష్టం వాటిల్లింది. బిందు, తుంపర సేద్యమని సాగుచేసుకున్న పండ్లతోటలకు అధికారులు సకాలంలో స్పింక్లర్లు, వివిధ సామాగ్రి పంపిణీ చేయని కారణంగా పండ్లతోటలు సైతం ఎండుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా పర్యటన సందర్భంగా అనంతపురం జిల్లాకు రైతులకు ఇచ్చే రాయితీలు, సహాయ సహకారాలు జిల్లాకు అందిస్తానని ప్రకటించారు. ప్రస్తుతం జిల్లాకు 24 మండలాల్లో 124 రెయిన్ గన్లు అందజేశారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలకు రెయిన్‌గన్లు ఇచ్చి నీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని ప్రకటించడంతోపాటు వేరుశెనగ పంట రైతులకు 90శాతం ఇన్‌ఫుట్ సబ్సిడీని ప్రకటించారు. ఉద్యాన పంటలకు, వాణిజ్య పంటలకు ప్రతి ఎకరాకు రూ.2వేలు లేదా రూ.3వేలు ఖర్చుపెట్టి పంటలను కాపాడేందుకు ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని సిఎం ప్రకటించారు. పంటసంజీవిని కింది నాలుగు ఎకరాలకు ఒక కుంట ఏర్పాటుచేసుకోవాలన్నారు. మొత్తం మీద ముఖ్యమంత్రి ప్రకటనతో జిల్లా రైతాంగం ఊపిరిపీల్చుకుంది.