కడప

ఒంటిమిట్ట ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంటిమిట్ట, ఏప్రిల్ 12: ఏక శిలానగర ఒంటిమిట్ట కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంతో టిటిడి యంత్రాంగం ఉత్సవాలకు నాంది పలికింది. ముందుగా ఆలయ ప్రాంగణం, స్వామివారి మూలవిరాట్‌లకు సంజీవరాయస్వామి ఆలయంలో వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో కూడిన స్వచ్చమైన నీటితో తిరుమంజనం నిర్వహించారు. స్వామివారి గర్భాలయంలో టేకుతో ఏర్పాటు చేసిన ద్వారం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. తిరుమలేశుని తరహలో రామాలయంలో టేకుతో ద్వారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా నాయకులు పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణం, ధ్వజస్థంభాన్ని శుద్ధనీటితో శుభ్ర పరిచారు. ఈ కార్యక్రమంలో విప్ మేడా మల్లికార్జునరెడ్డి, మండల వైకాపా సీనియర్ నాయకులు ఆకేపాటి వేణుగోపాల్‌రెడ్డి, అతికారి వెంకటయ్య, గడ్డం జనార్ధన్‌రెడ్డి, బి.లక్ష్మీనారాయణనాయుడు, సుబ్బానాయుడు, మండలంలోని పార్టీ నాయకులు, డిప్యూటీ ఇఓ బాలాజీ, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
భద్రతా ఏర్పాట్లపై ఎస్పీ ఆరా
ఒంటిమిట్ట కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లపై మంగళవారం జిల్లా ఎస్పీ నవీన్‌గులాఠీ ఆరా తీశారు. ముందుగా ఆయన స్థానిక సిబ్బందితో కల్యాణ వేదిక ప్రాంగణంలోని స్థలాన్ని పరిశీలించారు. బందోబస్తుపై రాజంపేట డిఎస్పీ రాజేంద్ర, ఇతర సిబ్బందితో చర్చించారు. అదే విధంగా ఈ నెల 20వ తేది జరగబోతున్న సీతారాముల కల్యాణానికి సిఎం చంద్రబాబునాయుడు విచ్చేస్తున్న నేపథ్యంలో హెలిప్యాడ్ స్థలాన్ని ఆయన పరిశీలించారు. సుమారు 3 గంటల పాటు బందోబస్తుపై చర్చించారు. ఈ కార్యక్రమంలో సిఐ శ్రీరాములు, నందలూరు, సిద్దవటం ఎస్సైలు భక్తవత్సలం పాల్గొన్నారు.