సబ్ ఫీచర్

సెకండరీ విద్యను పటిష్ఠం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విద్యారంగానికి సెకండరీ విద్యే ప్రాణం. అందుకే అన్ని అభివృద్ధి చెందిన దేశాలలో సెకండరీ విద్యను ఎంతో శక్తివంతం చేసుకున్నారు. ఈ పునాదులు గట్టిగుంటేనే ఉన్నత విద్య శక్తివంతవౌతుంది. పరిశోధనా వ్యవస్థ పరిఢవిల్లుతుంది. మనమెంతో అభివృద్ధిని సాధించామని చెప్పుకుంటున్నప్పటికినీ తెలంగాణలో మండల కేంద్రాలలో సెకండరీ విద్యకు సంబంధించిన విద్యాలయాలు, కాలేజీలు సరిపోయేంతగా లేవు. ప్రధానంగా ప్రతి మండల కేంద్రంలలో జూనియర్ కాలేజీ ఉండాలి. కాని ఇప్పటికీ జూనియర్ కాలేజీలు లేని మండల కేంద్రాలు అనేకం ఉన్నాయి.
ప్రపంచంలో కొన్ని దేశాలలో సెకండరీ విద్యను హక్కుగా పరిగణిస్తుంటే కొన్ని ప్రాంతాలలో సెకండరీ జూనియర్ కాలేజీలు లేకపోవటం, ఉన్నవి కూడా వసతులు లేనటువంటివి ఉన్నాయి. అందులో తెలంగాణ ఒకటి. ప్రతి మండల కేంద్రంలో జూనియర్ కాలేజీలు లేవు. శ్రీకృష్ణ కమీషన్ ఆనాడు తెలంగాణా ప్రకటిస్తుందన్న భయంతో ఆనాటి పాలకులు 8 ప్రభుత్వ జూనియర్ కాలేజీలను వరంగల్‌లో పెట్టారు. కానీ అక్కడ బోర్డు తప్ప ఏమీ కనిపించదు. చివరకు ప్రిన్సిపాల్ కూడా కాంట్రాక్ట్ టీచరే కావటం మరొక విశేషం.
కేంద్ర ప్రభుత్వం సెకండరీ విద్య విషయంలో అడిగిన ప్రశ్నలలో మీకు సరిపోయినన్ని కాలేజీలు ఉన్నాయా? అన్నది ఒకటి. ఒకసారి తెలంగాణ రాష్ట్రాన్ని పర్యటిస్తే గత ప్రభుత్వాల నిర్లక్ష్యం బైటకు వస్తుంది. తెలంగాణకు ఒక స్పెషల్‌గా ఒక గ్రాంటు ఇచ్చి అన్ని వసతులుకల జూనియర్ కాలేజీలు ఏర్పాటుచేయాలి. హైదరాబాద్‌లో సెంట్రల్ యూనివర్సిటీ ఉన్నమాట వాస్తవమే. ఐఐటి ఉన్నది కూడా వాస్తవమే. కానీ కనీసం 30నుంచి 40 శాతం సీట్లను లోకల్ విద్యార్థులతో నింపాలి. ఉన్నత విద్యాలయాలను ఏర్పాటుచేశామని చెబుతూ జూనియర్ కాలేజీల వ్యవస్థ పటిష్టంగా లేకుంటే ఉన్నత విద్యాసంస్థల మెట్లు స్థానికులు ఎక్కలేరు. పట్టణాల్లో ఉండే కాలేజీలు కూడా కార్పొరేట్ కాలేజీలే ఉంటే అవి అంగడి వస్తువులుగానే ఉండిపోతాయి. కేంద్ర ప్రభుత్వమే నిధులు మంజూరుచేసి సెకండరీ విద్యావ్యవస్థ పటిష్టంకోసం కృషిచేయాలి. అప్పుడే తెలంగాణలో విద్య సామాన్యునికి అందుబాటులోకి రాగలుగుతుంది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కదా అని కొందరు వాదనలు ముందుకు తేవచ్చును. ఎన్నో సమస్యలతో సతమతవౌతున్న ప్రభుత్వానికి విద్యారంగంపై సంపూర్ణ దృష్టి కేటాయించటానికి ఎంతకాలం పడుతుందో ఆలోచించండి. అందుకు కొంత సమయం పట్టవచ్చును. అందరితో సమానంగా ఎదగాలంటే కేంద్రం సాయం లేకుండా అది జరిగే పనికాదు. జూనియర్ కాలేజీల వ్యవస్థను పటిష్టపరచటానికై కేంద్రాన్ని అడగటం సమంజసమే అవుతుంది. ఉన్న జూనియర్ కాలేజీల్లో కూడా ల్యాబ్‌లను పటిష్టం చేయాలి. హైస్కూల్స్‌లో సైన్స్‌ను తెలుగు పాఠాల మాదిరిగా బోధిస్తే మేక్ ఇన్ ఇండియా ఎలా అవుతుంది? సైన్స్ ల్యాబ్‌లను పటిష్టం చేయాలి. కొత్త రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం ఆదుకోవాలి. అందరితో సమానంగా సైంటిఫిక్ డెవలప్‌మెంట్ జరిగే అవకాశం ఉంది.
అయతే ఇక్కడ ఒక్కవిషయం గుర్తుంచుకోవాలి. విద్య ప్రభుత్వ రంగంలోనే ఉండాలి. ఏ రంగమైనా ప్రైవేటుపరం అయతే అది లాభాల దృక్పథంతోనే ముందుకు కొనసాగుతుంది తప్ప, నాణ్యతా ప్రమాణాలకు విలువుండదు. ప్రస్తుతం విద్యారంగం ప్రైవేటు గుప్పిట్లోకి వెళ్లిపోయంది. ఫలితంగా నాణ్యతలేని, వర్తమాన ప్రపంచ సమాజంతో పోటీపడలేని యువతీ యువకులు డిగ్రీలు చేత బట్టుకొని బయటకు వస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరం. విద్య సేవా రంగం కిందికి వస్తుంది కనుక ప్రభుత్వం చేతిలో అది ఉంటే ప్రామాణిక విద్య అందరికీ సమానంగా అందుతుంది.

- చుక్కా రామయ్య