Others

సాయం చేసే చేతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దానం ఇచ్చేవాళ్ళు గొప్పవాళ్లు.. తీసుకునేవాళ్లు అదృష్టవంతులు. మధ్యలో తన గొప్పతనం ఏం లేదని తన నిరాడంబరతను చాటి చెప్పారు కలెక్టర్ కర్ణన్. ఆపన్నహస్తం పేరుతో కలెక్టర్ చేస్తున్న సేవా ప్రయత్నంపై జనం నుంచి పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం అవుతోంది. పేదవారికి తోచిన సాయం చేయడమనేది పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. ఒక పాత టీషర్టుని ఓ నిరుపేద కుర్రాడికిచ్చినా మంచిపని చేసినట్లే. ఈ సూత్రంతోనే ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్లమందికి సాయమందిస్తోంది వాల్ ఆఫ్ కైండ్‌నెస్. మంచిర్యాల కలెక్టర్ ఆర్వీ కర్ణన్ చేస్తున్న మంచి పని కూడా అదే.
*
అది తెలంగాణలోని మంచిర్యాల బస్టాండ్. అక్కడ జిల్లా పరిషత్ బాలుర పాఠశాల దగ్గర కనిపిస్తుందొక ఆపన్నహస్తం స్టాల్. ‘సాయం చేసే చేతులకివే మా శతకోటి నమస్కారాలు, ‘మనం చేసే ఎన్నో సత్కార్యాలకన్నా మనం చేసిన ఒక దానం మిన్న’ అనే ఆకట్టుకునే సూక్తులు రాసి ఉంటాయి. ఈ సూక్తులను చదువుతూ.. అక్కడ వున్న వస్తుసామగ్రిని చూసినవారికి కూడా ఎంతోకొంత సాయం చేయాలనే ఆలోచన మదిలో తలెత్తుతుంది.
ఆ స్టాల్ నిండా బట్టలు, చెప్పులు, దుప్పట్లు గుట్టలు గుట్టలుగా కనిపిస్తాయి. ఎవరో ఒకరు వచ్చి తమ చేతిలో ఉన్న కవర్‌ను ఆ స్టాల్‌లో పెట్టేసి వెళుతుంటారు. అక్కడ ఉన్నవారు ఓపిగ్గా వాటన్నిటినీ వేరు చేసి శుభ్రంగా మతడపెట్టి కవర్‌లో నీట్‌గా సర్దుతుంటారు. ఇవన్నీ ఏం చేస్తారనుకుంటున్నారా? పేదలకే చేరుతుంటాయి.
ఎవరికీ కావల్సినవి వారికి..
ఆదివారంనాడు బట్టలన్నీ బస్తాల్లోకి నింపుకుని ఆటోలో తీసుకుని మురికివాడల్లోని ప్రాంతాలకు తీసుకువెళతారు. వాళ్లు ఇచ్చే దుస్తులు చూసుకుని మురిసిపోయే చిన్నారి, ఎర్ర రంగు చీర కట్టుకుని- ఓ వృద్ధురాలి కళ్ళలో కనిపించే సంతోషం.. టీషర్ట్ సైజు చూసుకుని ఆనందపడిపోయి కుర్రాడు.. ఇలా ఎంతోమంది ఆ స్టాల్ నుంచి లబ్దిపొందుతున్నారు. చెప్పులు కావల్సినవాళ్లకి చెప్పులు.. దుప్పటి అవసరమైన వాళ్ళకు దుప్పటి. చీరలైతే చీరలు, గినె్నలైతే గినె్నలు. పాతవే కావచ్చు.. కానీ కొత్త ఆనందాన్ని ఇచ్చేవి. వాడినవే కావచ్చు.. మరొకరికి అవసరానికి మారేవి.
ఇదే ఆపన్నహస్తం కానె్సప్ట్. మంచిర్యాల కలెక్టర్ ఆర్వీ కర్ణన్ చేస్తున్న మనసున్న ప్రయత్నం. మొదటి ప్రయత్నంలోనే జనం నుంచి ఊహించని స్పందన వచ్చింది. ఆపన్నహస్తం స్టాల్‌లో నిత్యం వందలకొద్ది పాత బట్టలు, చెప్పులు, బ్యాగులు వస్తున్నా యి. పేదవారికి అవసరమయ్యే అన్ని రకాల వస్తువులు పోగవుతున్నాయి. వాటన్నింటిని అంగన్‌వాడి సిబ్బంది చక్కగా ప్యాక్ చేస్తారు. వాటన్నిటినీ బస్తా ల్లో నింపి మురికివాడలు, గిరిజన ప్రాంతాల్లో నివసించే వారికి, యాచకులకు, అనాథాశ్రమాలకు వెళ్లి ఇస్తుంటారు. కేవలం జిల్లా కేంద్రం నుంచే కాకుం డా చుట్టుప్రక్కల ప్రాంతాలవారు కూడా వచ్చి బట్ట లు, దుప్పట్లు ఇచ్చి వెళ్తుంటారు. ఈ చిన్న సాయానికే ఎంతో సంతృప్తిని, సంతోషం వ్యక్తంచేసేవారెందరోఉన్నారు.
మహారాష్టల్రో చూసి స్ఫూర్తి పొంది..
మహారాష్టల్రో ఒక కలెక్టరేట్ ముందు ఇలాంటి ‘వాల్ ఆఫ్ కైండ్‌నెస్’ చూసి మంచిర్యాల కలెక్టర్ స్ఫూర్తిపొందారు. ఈ ప్రయత్నం మనమెందుకు చేయకూడదు అనుకున్నారు. వెంటనే జిల్లా అధికారులతో మాట్లాడి, అంగన్‌వాడి వర్కర్ల సాయంతో ప్రారంభించారు. వారం రోజుల్లోనే జనం నుంచి ఊహించని స్పందన వచ్చింది.
పాతవే కాదు కొత్తవి కూడా..
కలెక్టర్ చేస్తున్న ఈ సాయానికి ఎంతో మంది షోరూమ్ యజమానులు, బుక్ షాపుల వాళ్లు కొత్త వస్తువులనే పేదలకు ఇవ్వమని ఇస్తున్నారు. ఇప్పటిదాకా 9వేల బట్టలొచ్చాయి. 1000 దాకా నోట్‌బుక్స్ ఇచ్చారు. చెప్పుల షోరూం యజమానులు మేము సైతం అంటూ కొత్త చెప్పులు, బూట్లు దానం చేశారు. ఇంకో రెండు మూడు నెలల తరువాత మరిన్ని సెంటర్లలో వాల్‌కైండ్‌నెస్ గోడల్ని ఏర్పాటుచేసే ఆలోచనలో ఉన్నారు.

చిత్రాలు..కలెక్టర్, ఆపన్నహస్తం స్టాల్ నిండా బట్టలు, చెప్పులు, దుప్పట్ల గుట్టలు