Others

సిరి నిలవాలంటే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంపదను అందరూ కోరుకుంటారు. డబ్బులను ఎవరూ కాదనరు. సంపదను సంపాదించే మార్గాలకోసమే నిరంతరమూ అనే్వషిస్తుంటారు చాలామంది. అట్లాంటి వారికి ఓ ఉపాయం..
సంపద, డబ్బు, పసిడి ఇట్లాంటివాటిన్నంతా మనం లక్ష్మీదేవిగా భావిస్తాంకదా. ఈ లక్ష్మీ దేవియే అష్టమ దేవతగా చెప్తారు. ఈ లక్ష్మి అతి చంచల. కాని తనకిష్టమైనవి ఎక్కడ ఉంటే అక్కడే స్థిరపడి ఉంటుందికూడా. ఆమె కిష్టమైనవి ఏంటంటే దానం, అధ్యయనం,అతిథి పూజనం ఈ మూడు ఎవరు చేస్తుంటారో వారి దగ్గర లక్ష్మి స్థిరనివాసం చేస్తుంది.అంతేకాదు అబద్దాలు ఆడకూడదు. చాడీలు చెప్పకూడదు. ఉన్నాలేదు అని బొంకకూడదు. నచ్చిన వారితోను, నచ్చని వారితోను ఒకేవిధంగా మాట్లాడాలి. ప్రశాంత చిత్తులుగా ఉండాలి. ఎవరినైనా క్షమించగలగాలి. పెద్ద మనసు ఉండాలి. ఇవిఅన్నీ మీకు సహజగుణాలు అనుకోండి ఇక మీరే సిరికలవారు . ఇక మీయిష్టం. ఈ లక్షణాలు అలవర్చుకుంటారో, స్వతహాగా తెచ్చుకుంటారో వారే సుమా లక్ష్మీదేవికి వారసులు. మీ ఇంట సిరుల పంట