Others

మనసుంటే మార్గం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సృష్టిలో ఏది వ్యర్థ కాదు. ఆయుర్వేదం ప్రతి మొక్కా ఔషధమే నంటుంది. అందులో పెరటి తోట పెరిగే కరివేపాకు, పుదీనా, కొత్తిమీర ఇలాంటివేవైనా సరే అటు ఆరోగ్యాన్నిస్తాయ. ఇటు వంటను రుచులతో నింపేస్తాయ. కనుక ఇంతులంతా పెరటి తోటకు ప్రీతిని చూపిస్తారు.
ఇపుడు అన్నీ అపార్ట్‌మెంటులు కదా అనుకోకండి. చిన్న చిన్నకుండీల్లో ఇలాంటివి పెంచుకోవచ్చు. విరిగిన ఫ్లాస్టిక్ బుట్టలు, బక్కెట్లు, ట్రేలు ఇలాంటివి కూడా కుండీల్లుగా ఉపయోగపడుతాయ. మనుసుంటే మార్గం ఉంటుంది కదా. అందుకే
అలా పెంచుకున్న కుండిల్లోని కరివేపాకులను పుదీనా అప్పటికప్పుడు రోటి పచ్చళ్లు కాని పొడి చేసుకోవచ్చు. సలాడ్ చేసినప్పుడు అందంగా అలంకరించడానికి ఈ మొక్కలు ఉపయోగపడుతాయ.
మనం మార్కెటు నుంచి తెచ్చుకున్న కూరగాయలతో కూరలు చేస్తాం సరేసరికాని కొన్ని కొన్ని కూరగాయల తొక్కతో ఆరోగ్యాన్ని అందాన్ని పెంచుకోవచ్చు. అంటే బీరకాయ పొట్టు, నిమ్మ తొక్కల్లాంటివి కడిగి శుభ్రంగా ఎండబెట్టి పొడి చేసుకుని వాటిని ముఖానికి మాస్క్‌గా ఉపయోగిస్తే మొటిమలు రావు. స్నానానికి సబ్బుకు బదులు ఈ పొడిని ఉపయోగిస్తే దురదల్లాంటి రావు. కొన్ని కూరగాయలు అంటే బీరకాయను మొత్తం ఎండబెట్టితే అది మంచి బ్రష్‌గా ఉపయోగపడుతుంది. బీరకాయ పైతొక్కతో పచ్చడి చేసుకోవచ్చు.
చక్కెరకు బదులుగా బెల్లం, ఖర్జూరం ఉపయోగిస్తే చక్కెర వ్యాధుల బారిన పడకుండా చూసుకోవచ్చు. బెల్లం వాడకం వల్ల నడుము, తొడల్లో ఎక్సెస్ కొవ్వు పేరుకోదు. దోస, చపాతీలు నాన్‌స్టిక్‌లో కాకుండా ఐరన్ తవాల్లో చేసుకుంటే క్యాన్సర్లురావు సరికదా ఐరన్ లోపం రాదు.
వంటకు స్టీలు, ఇనుప పాత్రలకన్నా మట్టి పాత్రలే మెరుగైనవి అంటున్నారు. ఇపుడు అడుగున మట్టితో తయారు చేసినవి వస్తున్నాయ. వాటిని ఉపయోగించుకోవచ్చు.
ముందురోజు దేవుని దగ్గర పెట్టిన పూలను తీసుకొని వాటిని చల్లనీటిలో వేసి గదిలో అక్కడక్కడా పెడితే గదికి అలంకారం చేసినట్టుగా ఉంటుంది.
*